Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈరోజు మనం బాబా భక్తులైన తార్ఖడ్ కుటుంబములో శ్రీ వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ ముంబాయి వారు తన అనుభవాన్ని, సాయిలీల పత్రికలో కొన్నిసంవత్సరాల క్రితం వ్రాయగా, దాని అనువాదాన్ని ఆయన మాటలలోనే మీముందు ఉంచుతున్నాను.
ఈ అనుభవం చదువుతుంటే ఒడలు పులకరిస్తుంది.
సాయి భక్తులందరూ కూడా ప్రతీరోజు ఊదీని ధరించి బయటకు వెళ్ళే అలవాటు చేసుకొవాలి.
సిల్వర్ బాక్సు (వెండి భరిణె) బై: వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్ :: ముంబాయ్
నా మీద బాబా కురిపించిన అనుభూతి గురించి చెప్పేముందు నా గురించి కొంత గత చరిత్ర చెబుతాను.
శ్రీ సాయి సచ్చరిత్రలో 9 వ అథ్యాయంలో హేమాడ్ పంత్ గారు మా తాతగారైన బాబా సాహెబ్ తార్ఖడ్ గారి గురించి చెప్పడం జరిగింది.
సీతాదేవి రామచంద్ర తార్ఖడ్, రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ , జ్యోతేంద్ర రామచంద్ర, వీరు ముగ్గురూ కూడా 1909 నుంచి 1918 వరకు బాబాతో ఉన్న అదృష్టవంతులు.
అందుచేత తార్ఖడ్ ఫామిలీ కి తరతరాలకి ఆయన ఆశీస్సులు అందచేస్తూనే ఉన్నారు.
బాబాగారు మా కులదేవత. ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు.
మేము మా జీవితమంతా ఆయన యొక్క అనుగ్రహాన్ని పోందుతున్నాము. ఇంకా ముందు ముందు పొందుతామన్న నమ్మకం మాకుంది.
నేనిప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని మీ ముందు వుంచుతున్నాను.
ఈ సంఘటన 1973 నవంబర్ దీపావళి రోజులులో జరిగింది. నేను మొట్టమొదటి సారిగా విదేశాలకు వెళ్ళడానికి తయారవుతున్నాను.
నేను పని చేసే కంపనీ వారు ట్రయినింగ్ నిమిత్తం ఇంగ్లాండ్ పంపిస్తోంది. నేనక్కడ లండన్ కి 100 కి.మీ. దూరంలో ఉన్న చోటమార్చ్ లో ఉండాలి.
అందుచేత అవసరమయినవన్నీ కూడా సద్దుకోవడం చాలా ముఖ్యం. నేను శుక్రవారం బయలుదేరి శనివారం రాత్రికి చేరుకున్నాను.
ఆదివారం విశ్రాంతి తీసుకున్నాను. సోమవారం పొద్దున్నే ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుండగా నా దగ్గర ఊదీ లేదని తెలుసుకున్నాను.
చిన్నప్పటినుంచీ బయటకు వెళ్ళేటప్పుడు ఊదీ పెట్టుకోవడం మాకు అలవాటు.
నాకు కొంత నిరాశ వచ్చింది. అప్పుడు నాకు ట్రావలింగ్ సూట్కేసులో మొట్ట్ఘమొదట ఊదీ పాకెట్ పెట్టి తరువాత బట్టలు సద్దటం నా భార్యకు అలవాటని గుర్తుకొచ్చింది. వెంటనే నేను సూట్కేస్ ఖాళీ చేసి చూడగా ఊదీ పాకట్ కనిపించింది.
కాని అది 5 నెలలు వరకూ వస్తుంది. నేను నా ఉద్యోగ రీత్యా ముంబాయి నుంచి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండాలి.
అందుచేత ముంబాయి వెళ్ళగానే ఒక వెండి డబ్బా ఊదీ వేసుకునేందుకు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను.
లండన్లో ఈ చిన్న ఊదీ పాకట్ పెద్ద సహాయకారి. లండన్ లో నాకు ఇచ్చిన ట్రయినింగ్ లో పని పూర్తి చేసుకుని మార్చ్ లో ముంబాయి వచ్చాను.
ముంబాయి లో వెండి డబ్బా కొనడానికి నాభార్య, అత్త గారితో కలిసి గిర్గావ్ వచ్చాను.
షాప్ లో ఉన్న కుర్రాడు 7,8 బాక్సులు చూపించాదు. కాని బాక్సు లకి అన్నీ మూతలు విడిగా వచ్చే విథంగా ఉన్నాయి. అందుచేత నాకు అలా మూత విడిగా రాకుండా, బాక్సుతోనే మూత అతికి ఉన్నది కావాలని చెప్పాను. ఆర్డర్ ఇస్తే తయారు చేయిస్తాను అని చెప్పారు.
అంత చిన్న పనికి ఆర్డర్ ఇవ్వడం యెందుకు మరో షాప్ లో చూద్దామని ప్రక్క షాప్ లోకి వెళ్ళాము. షాప్ వానికి నాకు కావలసిన బాక్సు చెప్పాను.
షాప్ యజమాని పాత బాక్సు అయినా ఫరవా లేదా అని అడిగాడు. పాత బాక్సు అంటే యెమిటి? అని అడిగాను. కొంతమంది పాత వెండి సామాన్లు అమ్మేస్తూ ఉంటారు.
వాటిలో మీకు కావలసిన బాక్సు ఉండవచ్చు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది ఇది వినగానే. పవిత్రమయిన బాబా ఊదీ వేసుకోవడానికి పాత వెండి బాక్సు కొనడమా? అదేమన్నా మంచి పనేనా?
నా భార్య, అత్త గారు కూడా ఇలాగే ఆలోచించి మరో షాప్ లో క్రొత్త బాక్సు ఉంటుందేమో చూద్దమనుకున్నారు.
కాని షాప్ యజమానిని బాథ పెట్టడం యెందుకని పోనీ తీసుకొచ్చాక వద్దని చెప్పవచ్చులే అనుకొని, సరే తీసుకురండి చూస్తామని చెప్పాము.
ఈలోపున షాప్ యజమాని మాకు యెలాంటి బాక్సు కావాలో అదే తెచ్చి ఇచ్చాడు. ఆ బాక్సు చూడగానే నాకు తెలివి తప్పిపోయింది.
యెందుకంటే అది చాలా నల్లగా ఉంది. నా మొహంలో భావాన్ని చూసి, షాప్ యజమాని అన్నాడు, “అయ్యా, ఒకవేళ మీరు కోరుకునే బాక్సు ఇలాంటిదే అయితే వర్రీ కావద్దు.
దీనికి మెరుగు పెట్టి క్రొత్తదానిలా తయారు చేయించి ఇస్తాను” అన్నాడు. షాపతను పాపం చాల శ్రమ తీసుకున్నాడనిపించింది నాకు.
బాక్సు మూత తెరిచి చూడగానే నాకు నోట మాటరాలేదు. బాక్సు వంక కన్నర్పకుండా చూడ టం మొదలుపెట్టాను.
నా భార్య, అత్తగారు నన్నుచూసి యేమయింది అలా ఉండి పోయావు? యెమి జరిగింది? అన్నారు. వారికి బాక్సు చూపించగానే వాళ్ళకు కూడా నోటమాట రాలేదు.
బాక్సు మూత లోపల బాబా బొమ్మ అతికించి ఉంది. ఇదంతా నేను అతిశయంగా చెప్తున్నానని అనుకోవద్దు. చిన్న బాక్సు లో బాబా బొమ్మ యెవరు ఫిట్ చేస్తారు?
పైగా ఇది 1974 సం. బాబా మీద భక్తి అంత యెక్కువగా లేదు. ఇప్పుడు ఉన్నంతగా అప్పుడు ఇంతమంది భక్తులు లేరు.
అందుచేత యెవరయిన బాబా భక్తుడు ఇంత శ్రమ తీసుకుని బాక్సులో బాబా బొమ్మ పెట్టాడంటే నాకు నమ్మబుథ్థిగా లేదు. లేకపోతే గణపతి, రాముడు, కృష్ణుడు, శంకరుడు, వేరే దేవుళ్ళ బొమ్మలు పెట్టుకునుందేవారు.
షాప్ యజమాని బాక్సుకి మెరుగు పెట్టించి ఇచ్చాడు. అది ఇప్పటికి మెరుగు తగ్గకుండా వుంది.
ఇంట్లో ఇంకా కొన్ని వెండి సామాన్లు, బొమ్మలు ఉన్నాయి అవి కొంతకాలమయిన తరువాత నల్లగా మారాయి కాని, ఈ బాక్సు మాత్రం ఇంకా వన్నె తగ్గలేదు.
ఈ బాక్సు యెప్పుడు నాతోనే ఉంటుంది. బాబా ఊదీ యెప్పుడు తీసుకున్నా బాబా దర్శనం బాక్సులో నాకు కనపడుతూ ఉంటుంది.
నేను గతం గుర్తు చేసుకుంటే, నేనే కనక కొత్త బాక్సుకి ఆర్డర్ చేసుంటే అందులో బాబా ఫోటో వుండేది కాదు.
ఇప్పటికి అనుకుంటాను బాబా నాకోసమే ఆ బాక్సు తయారు చేయించారేమోనని.
తార్ఖడ్ కుటుంబంలో మూడవతరంవారమయిన మాకు బాబామీద ఇంకా నమ్మకం బలపడింది.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు
- తొలిసారి ఒంటరిగా షిరిడి వెళ్ళిన నాకు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన బాబా వారు
- సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 2 వ భాగం
- బాబా పేరును మాత్రమే ఉంచి ప్రారంభించిన నా కొత్త వ్యాపారం సక్సెస్ అవ్వుట
- భక్తురాలి కుటుంబం యొక్క ప్రతి సమస్యలోను వివిధ రూపాలలో వచ్చి ఆదుకున్న బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “ఆయన మమ్ములని ప్రతి విషయంలోను రక్షిస్తూ ఉన్నారు–Taarkad-24”
kishore Babu
August 30, 2016 at 8:05 pmThank you so much Sai Suresh..