సాయి కధలు ఎన్ని సార్లు చదివిన అమృతం వాలే మధురంగా ఉంటాయి–V. Tarkad-26–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sri Ram


బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై ఆరవ భాగం

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఇప్పుడు వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గురించి చెప్తున్నారు. 

తార్ఖడ్ కుటుంబం వారి అనుభవాల భాండాగారాన్ని నేను మీముందు తెరిచాను. యివన్నీ చదివిన తరువాత బాబా మీద మీ నమ్మకం రెట్టింపవుతుందని నాకు బాగా తెలుసు. యిపుడు మనం సాయి సచ్చరిత్రలోని అనుభవాలు చూద్దాము.

సాయి సచ్చరిత్రలోని 9 వ. అథ్యాయం వైపు నేను మీ దృష్టిని మరల్చుదామనుకుంటున్నాను.

మన పాఠకులందరూ కూడా ఈ పవిత్రమైన పుస్తకంలో యెంతో జ్ఞానవంతులని నేను భావిస్తున్నాను.

వారు ఒక్కసారయిన చదివి ఉంటారు. ఒకవేళ యెవరయినా అలా చేయకపోతే, నా వినమ్రమైన అభ్యర్థన యేమంటే దయచేసి చదవండి.

అది షిరిడీ సాయిబాబా వారి జీవితాన్ని గురించి చాలా చక్కగ వివరిస్తుంది. అనేకమైన లీలలను ఆయన షిరిడీలో తను ఉన్న కాలంలో తన భక్తులకు దర్శింపచేశారు.

చదివిన  మళ్ళి ఒకసారి చదవండి. ఎందుకంటె సాయి కధలు ఎన్ని సార్లు చదివిన అమృతం వాలే మధురంగా ఉంటాయి.

ఈ పవిత్ర గ్రంథంలోని 9 వ. అథ్యాయం యెక్కువ భాగం తార్ఖడ్ కుటుంబానికే చెందుతుంది. అంటే మా నానమ్మగారు, మాతాతగారయిన రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ అనబడే బాబా సాహెబ్ తార్ఖడ్, యింకా మానాన్నగారు జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్.

యింతకు ముందు వివరించినట్లుగా తార్ఖడ్ కుటుంబం విపరీతమయిన ప్రార్థనా సమాజ్ వాదులు. వారు విగ్రహారాథనని నమ్మరు. ఆ కారణం చేత వారికి దేవునియందు నమ్మకం లేదు. యేమయినప్పటికీ వారి అదృష్టం వారిని షిర్డీ సాయిబాబాతో బంథం యేర్పడటానికి తీసుకు వచ్చింది.

అప్పుడది ఒక గొప్ప మార్పు. అందుచేత ప్రముఖ ఆరతి కూడా చేప్పేది ఆయన నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చగలడని (నాస్తికానహీ తూ లావిషినిజ భజని) తార్ఖడ్ కుటుంబంలో యిది అనుభవ పూర్వకంగా నిరూపితమయింది.

సాయి సచ్చరిత్ర రచయిత స్వర్గీయ శ్రీ అన్న సాహెబ్ ధబోల్కర్ గారు తన 9వ అథ్యాయంలో, గొప్ప భక్తుడైన కుమారుడు ఉన్నందుకు బాబా సాహెబ్ తార్ఖడ్ గారు చాలా అదృష్టవంతులని చెప్పారు.

మా నాన్నగారు ఉదయం 4 గంటలకే లేచి, స్నానం చేసిన తరువాత యింటిలో తమ మందిరంలో ఉన్న బాబా ఫొటోకి చందనం అద్ది, బాబాకి ఆరతి యిస్తూ ఉండేవారు.

ఆయన అయిదు వత్తులవెండి దీపాన్ని (నిరంజన్) వెలిగించి అందులో బాబా యిచ్చిన ఒక పైసా నాణాన్ని ఉంచేవారు.

ప్రతిరోజూ ప్రసాదంగా పటిక బెల్లాన్ని సమర్పిస్తూ ఉండేవారు. మథ్యాన్న భోజన సమయంలో దానిని వారందరూ తింటూ ఉండేవారు.

పూజ అయిన తరువాత తండ్రీ, కొడుకులిద్దరూ బైకుల్లాలోని టెక్స్ టైల్ మిల్ కి వెడుతూ ఉండేవారు.

బాబా దయవల్ల ఆ రోజుల్లో మాతాతగారు నెలకు రూ.5,000/- మా నాన్నగారు నెలకు రూ.2,000/- జీతం సంపాదిస్తూ ఉండేవారు.

ఒక సారి మా తాతగారికి, బాబాగారు కఫ్నీలు కుట్టించుకోవడానికి కాటన్ తానులు పంపిద్దామనే కోరిక కలిగింది.

ఆయన జోతీంద్రతో, తల్లితో కూడా షిరిడీ వెళ్ళి బాబాకి సమర్పించి రమ్మని సూచించారు. కాని యింటిలో పూజ ఎవరుచేస్తారనే కారణం చేత జ్యోతీంద్రగారు యిష్టపడలేదు.

అపుడు మాతాతగారు ఆబాథ్యతను తాను తీసుకుని జ్యోతీంద్ర చేసినట్లే తాను కూడా చేస్తాననీ అందులో యెటువంటి లోటు జరగనివ్వననీ హామీ ఇచ్చారు.

ఆ హామీతో మా నాన్నగారు తన తల్లితో షిరిడీకి బయలుదేరారు. తరువాత రెండు రోజులు బాగానే గడిచాయి. కాని, ముడవరోజున మా తాతగారు పూజా సమయంలో కలకండ పెట్టడం మరచిపోయారు.

భోజనం చేసే సమయంలో తన పళ్ళెంలో కలకండ లేకపోవడంతో మధ్యాన్నానికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే లేచి షిరిడీలో ఉన్న జ్యోతీంద్ర కి తాను చాలా పెద్ద తప్పు చేసానని బాబాగారిని క్షమించమని అడగమని కోరుతూ ఉత్తరం వ్రాశారు.

అక్కడ షిరిడీలో అదే సమయంలో ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. ద్వారకామాయిలో మద్యాహ్న హరతి అయిన తరువాత, మా నానమ్మగారు, బాబా గారి దగ్గరకు ఆయన ఆశీర్వాదములు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, బాబా మా నానమ్మగారితో

“అమ్మా ! ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది.. యెప్పటిలాగే నేను బాంద్రా వెళ్ళాను. తలుపుకి తాళం వేసి ఉండటం చుశాను. కాని నన్నెవరూ ఆపలేదు యెందుకంటే తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా ప్రవేశించాను. కాని తినడానికి యేమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది ఖాళీ కడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది.” అన్నారు.

బాబా చెపుతున్నదేమిటో మానాన్నమ్మగారికి అర్థం అవలేదు. కాని మానాన్నగారు, ఉదయం పూజా సమయంలో బాబాకి ప్రసాదం పెట్టడం తన తండ్రి మరచిపోయి ఉంటారని అర్థం చేసుకున్నారు.

ఆయన బాబాని తన తండ్రి చేసిన పెద్ద తప్పుకు మన్నించమని కోరారు. వెంటనే ముంబాయి వెళ్ళడానికి అనుమతినివ్వమని అడిగారు. బాబా అనుమతినివ్వక యింకా కొన్ని రోజులు ఉండమన్నారు.

యేమయినా గాని, మా నాన్నగారు అస్థిమితంగా ఉన్నారు. ఆయన బాబా చెప్పిందంతా వివరంగా తన నాన్నగారికి ఉత్తరం వ్రాశారు. రెండు ఉత్తరాలూ ఒకదానికొకటి దాటుకుని వారికి చేరగానే వాటిని చదివిన తరువాత తండ్రీ కొడుకులిద్దరికీ కన్నీరొచ్చింది.

తమ మీద బాబాకున్న అపరిమితమైన ప్రేమ తెలిసివచ్చింది. బాబా యింకా ఆ ఫోటో ఫ్రేములో తాను సజీవంగా ఉన్నాననీ ప్రతిరోజూ వారు సమర్పించే నైవేద్యాలని తప్పకుండా స్వీకరిస్తున్నట్లు గుర్తు చేశారు.

రేపు తరువాయి భాగం  …

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “సాయి కధలు ఎన్ని సార్లు చదివిన అమృతం వాలే మధురంగా ఉంటాయి–V. Tarkad-26–Audio

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles