షిర్డీ చూడాలన్న నా జీవిత ఆశయం నెరవేరింది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నేను తమిళనాడు నుండి వికలాంగ అమ్మాయిని. నేను 2006 నుండి బాబా యొక్క భక్తురాలిని అయ్యాను. నేను అతనిని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత నా జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి. నేను స్టడీస్ లో చాలా పేలవంగా ఉన్నప్పటికీ  బాబా యొక్క దయతో నా పేజి డిగ్రీని ఫస్ట్ క్లాసు లో పూర్తి చేసాను. బాబాకు నా ధన్యవాదాలు.

నేను వికలాంగురాలిని కావడం వలన పాఠశాల మరియు కాలేజీకి తప్ప మరే ప్రదేశాలకు వెళ్ళిలేకపోతున్నాను. నా తండ్రి కూడా చాలా కఠినంగా ఉంటారు, అందుచే అతను నన్ను ఒంటరిగా వెళ్ళడానికి అనుమతించరు. నా మరణం లోపల నా జీవితంలో కనీసం ఒక్కసరైన షిర్డీ చూడాలి అనేది నా లక్ష్యం. ఆ అద్భుతమైన అవకాశం నాకు 2014వ సంవత్సరంలో వచ్చింది. అవును, బాబా నన్ను షిర్డీకి పిలిచారు.

ఒకరోజు నేను వార్తాపత్రికలో ఒక నెలపాటు షిర్డీకి ప్రత్యేక రైళ్ళు వేసినట్లు ప్రకటన చేసాను. అది కూడా మా స్వగ్రామం నుండి నేరుగా షిర్డీకి వెళ్ళే  రైలు. నేను వెళ్ళి నా తండ్రి అనుమతిని అడిగాను. ఆశ్చర్యకరంగా అతను నా స్నేహితుల కుటుంబంతో వెళ్ళడానికి నన్ను అనుమతించారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది.

నా స్నేహితురాలు నాకు టిక్కెట్లను బుక్ చేసింది. నా సోదరి ఆన్లైన్లో దర్శన్ టిక్కెట్లను బుక్ చేసింది. బాబా నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడు మేము రైలులో ఎక్కాము.

నేను రైలులోకి ప్రవేశించినప్పుడు మాకు చాలా ఉత్సాహంగా అనిపించింది, ఎందుకంటే మేము తప్ప కోచ్లో ఎవరూ లేరు. అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. నాకు చాలా అనుకూలంగా అనిపించింది. ప్రయాణంలోనేను నా స్నేహితురాలితో బాబా గురించి చర్చించికుంటూ ప్రతి క్షణాన్ని బాగా ఆస్వాదించాను, రైలులో సాయి సచ్చరిత చదివాను మరియు నా ఐపాడ్ లో బాబా యొక్క పాటలను విన్నాను.

మేము ఉదయం 4 గంటలకు మందిరం చేరుకున్నాము. వాస్తవానికి మేము ఆరతి దర్శనం కోసం బుక్ చేసుకున్నాము, కాని రైలు ఆలస్యమై మేము కాకడారతి మిస్ అయ్యాము. మేము విచారంగా 15 నిమిషాల పాటు గేట్ దగ్గర నిలబడి బాబా మమ్మల్ని లోపలికి అనుమతించండి అని సాయిని ప్రార్ధించము.

కొద్ది క్షణాలలో సెక్యూరిటీలు మమ్మల్ని అనుమతించారు. మేము సమాధి మందిరం లోపలికి వెళ్ళగానే బాబా యొక్క సమాధికి ఎదురుగా వెళ్ళటానికి సెక్యూరిటీ వాళ్ళు మాకు అనుమతి ఇచ్చారు. ఇతర భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు. కానీ మమ్మల్ని క్యూలో నిలబడకుండా బాబా నేరుగా తమ ఎదుటకు పిలుచుకున్నారు. నాకు స్వర్గం లో నిలబడినట్లుగా అనిపించింది ఎందుకంటే నేను ఇది అసలు ఊహించలేదు. నేను బాబాను చాలా దగ్గరగా చూశాను మరియు నా కళ్ళలో కన్నీరు వచ్చింది. అప్పుడు నాకు ఉత్సాహంగా సమాధిని తాకలనిపించింది కానీ దురదృష్టవశాత్తు వారు గ్లాసుతో మూసివేశారు. నేను నిరాశపడ్డాను.

తర్వాత మేము సమాధి మందిరం నుండి బయటకు వచ్చి వేప చెట్టు కింద ఉన్నాము అనగా గురుస్తాన్ లో. అక్కడ మేము నేలపై నుండి వేప చెట్టు ఆకులు సేకరించాము. ఒక వేప ఆకు నా భుజం మీద పడింది. నేను ఆ సమయంలో చాలా ఆనందంగా భావించాను మరియు నా జేబులో ఆ వేప ఆకులను దాచుకున్నాను. బాబా ఆశీర్వాదం అని నేను భావించాను. తరువాత మేము చావడికి వెళ్లి బాబా యొక్క పెద్ద చిత్రాన్ని చూశాము మరియు నేను దానిని తాకి, అక్కడ ప్రార్థన చేసాను.

ఇప్పుడు మేము ద్వారకామాయికి వెళ్ళాము. అక్కడ పెద్ద క్యూ ఉంది. కానీ అక్కడ భద్రతా సిబ్బంది నాకు నేరుగా బాబా పాదుకల వద్దకు వెళ్ళమని నన్ను పిలిచి, అతను నాకు ఒక అందమైన శాలువాను ఇచ్చాడు. ఇది నారింజ రంగులో ఉంది. అతను నాకు మాత్రమే ఇచ్చాడు. నేను ఆ శాలువను బాబా పాదాలకు తాకించి నాతోపాటు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ శాలువను మా ఇంటిలో బాబా విగ్రహం వద్ద ఉంచాను. ఇది నాకు బాబా నుండి రెండవ ఆశీర్వాదం.

అప్పుడు మేము ఒక నల్ల కుక్క ను(అది బాబాయే) చూసాము. అది హనుమాన్ ఎదుట తన భక్తులను చూస్తు చాలా ప్రశాంతంగా ఉంది. దానిని చూసి నాకు సంతోషంగా అనిపించింది.

మేము ఆలయం ప్రాంగణంలో 3 గంటలు మాత్రమే గడిపాము కాని ఆలయంలోని స్థలాలన్ని మేము సందర్శించాము. షిర్డీ చూడాలన్న నా జీవిత ఆశయం నెరవేరింది. బాబా నా ప్రయాణం చాలా సులభం మరియు సౌకర్యవంతము చేసారు. షిర్డీ వెళ్ళడం అసాధ్యమని నేను అనుకున్నాను. కానీ బాబా అసాధ్యాన్ని సాధ్యం చేసారు. నేను నా జీవితంలో ఇది ఎప్పుడూ మర్చిపోలేను. నా స్నేహితుల కుటుంబ సభ్యలు కూడా నాకు చాలా సహాయం చేసారు. మేము పూర్తి సంతృప్తితో షిరిడి నుండి తిరిగి వచ్చాము. మాకు అద్భుతమైన దర్శనం ఇచ్చినందుకు బాబా మీకు  ధన్యవాదాలు.

ఓం సాయి రామ్.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles