Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా “అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు” అన్నారు.
వినోబాభావే తల్లి ఇంటికి వచ్చిన బిచ్చగాండ్లకు దాన ధర్మాలు చేసేది.
ఒకసారి బలిష్టుడైన వానికి అన్నదానం చేసింది. వినోబా “అలా చేయటం సబబా?” అని ప్రశ్నించాడు.
“వినో (వినోబాభావే) ఒక వ్యక్తి యోగ్యతా యోగ్యతలు నిర్ణయించే శక్తి మనకుందా? గుమ్మం ముందు నిలబడిన ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే” అంది.
వారాలబ్బాయి వారింటికి భోజనానికి వచ్చేవాడు. అతడికి వేడి వేడిగా రొట్టెలు తయారుచేసి పెట్టేది.
వినోబాకు రాత్రి మిగిలిపోయిన రొట్టెలను పెట్టేది. కారణం అడిగాడు.
“అతిథి నారాయణ స్వరూపుడే. నారాయణునకు మనము తినగా మిగిలిన వంటకాలు పెట్టటం సబబా?” అని సమాధానమిచ్చింది తల్లి.
ఒకసారి ఆమె లక్ష బియ్యపు గింజలను భగవంతునకు సమర్పిద్దామనుకున్నది. ఆమె భర్త “ఒక తులానికి ఎన్ని బియ్యపు గింజలు వస్తాయో లెక్కకట్టి ఎన్ని తులాలు కావాలో తెలుసుకో. అదనంగా కొన్ని గింజలను కలుపు” అన్నాడు.
ఆమె కుమారుని అడిగింది. “అమ్మ నీవు సమర్పించే బియ్యపు గింజల సంఖ్యను గణిత శాస్త్రంతో ముడిపెట్టవద్దు. ఆ లక్ష గింజలు భక్తి భావానికి ప్రతీకలు.
భగవంతుని ఒక్కొక్క నామాన్ని చదువుతూ, ఒక్కొక్క గింజను తీస్తే భగవంతుని నామాలను గుండెలో నింపుకున్నట్లవుతుంది. చేసే ప్రతి పనిలోను భగవంతుడు ప్రతిఫలించాలి” ఆనాడు వినోబా. ఆమె కుమారుని సలహా పాటించింది.
వినోబా భావే జీవితమే ఇతరులకు మార్గదర్శకమైంది.
కప్పల అరుపులలో మాండూక్యోపనిషత్తును దర్శించే ఆధ్యాత్మికవేత్త. విశ్వమంతటా సర్వతోముఖంగా ఉండాలనుకునే వినోబాకు ఎవరు సహకరించరు?
కాలి నడకన భారతదేశ యాత్ర చేశాడు. పోచంపల్లి గ్రామానికి వచ్చాడు.
అప్పడు ఆయనను దర్శించటానికి ఎందరెందరో వచ్చారు. సెంటు భూమి, గజం స్థలం లేని వారు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు.
పూటగడవని నిరుపేద కుటుంబాలు 40 ఉన్నాయి. అక్కడున్న రామచంద్రా రెడ్డి అనే భూస్వామి తన భూమి నుండి 100 ఎకరాలను దానం చేస్తానన్నాడు. ఆయన సహృదయానికి మురిసిపోయాడు వినోబా.
ఆ భూమిని 40 కుటుంబాలకు వ్యక్తిపరంగాగాక, సమిష్టిగా తీసుకోండన్నాడు.
ఇంకా రామచంద్రా రెడ్డిగారినే ఆ భూమికి కావలసిన విత్తనాలను ఉచితంగా సమకూర్చమని కోరాడు వినోబా. సంతోషంతో అంగీకరించాడు రెడ్డిగారు.
ఆ దినం ఏప్రియల్ 18, 1951, భూదాన యజ్ఞానికి బీజం పడ్డది తెలుగు గడ్డపైననే.
నేడు ఏప్రియల్ 18. వినోబాను స్మరిద్దాం! మానవ సేవే మాధవ సేవ అని ఆచరిద్దాం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మాధవ సేవ … … …. మహనీయులు – 2020… ఆగస్టు 5
- కృష్ణ నామ చైతన్యం…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 18
- జీవిత గమ్యం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 14
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
- ఎవరిపై విశ్వాసం? …. మహనీయులు – 2020… ఏప్రిల్ 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments