Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా “నా చిన్నతనంలో అన్నం కొరకు వెదకుచూ బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు నగిషీ పని దొరికింది” అంటారు.
బాబా భూమన్ షా చిన్నతనంలో పనికోసం తిరిగాడు. గృహ నిర్మాణమవుతుంటే, పని ఇప్పించండని కోరాడు.
కుర్రవాడివి, నీవేమి చేయలేవు అని కామందు అంటే “నేను చేసిన పనికి ఎంత ఇవ్వవచ్చునో అంటే ఇవ్వండి” అని వేడుకున్నాడు.
రాళ్ళు మోసే పని ఇచ్చారు. బాబా భూమన్ షా తన తలపైనా పెట్టుకున్న రాళ్ళు రెండంగుళాలు పైకి లేచి, వాటంతట అవే కదలసాగాయి. ఆయన సిద్ధుడని గ్రహించారు అది చూచినవారందరు.
ఒకసారి భూమన్ షా పశువులు కాసేటప్పుడు అతని పశువులు ఎవరి పొలంలోనో మేశాయి. ఆ పొలం యజమాని భూమన్ షా తండ్రితో ఫిర్యాదు చేశాడు.
అందరూ పోయి ఆ పొలం చూశారు. పైరు పచ్చగా కళకళలాడుతొంది నిండుగా. బాబా భూమన్ షా సాధారణ వ్యక్తి కాడని గ్రహించారు ఆ ఊరివారు.
ప్రీతం దాస్ జీ దగ్గర ఉపదేశం ఇప్పిద్దామని తల్లిదండ్రులు కుర్రవాడైన భూమన్ షాను తీసుకువెళ్ళారు.
తేజస్సుతో వెలిగిపోతున్న బాల భూమన్ షాను తన గురువులైన శ్రీ చంద్ జీయే అని గుర్తించి, అందరకూ ఈ విషయం చెప్పాడు. గురువు ఉపదేశించాడు.
వారిది ఉదాసీ సంప్రదాయం. ఆ సాంప్రదాయ వారు అవివాహితులుగానే ఉండాలని ఒక నియమం.
భూమన్ షా తనకు గతంలో అనుబంధం ఉన్న కుతుబ్ కోట అనే గ్రామంలో స్థిరపడదామనుకుని వెళ్ళాడు.
అక్కడ మహమ్మదీయులే ఎక్కవ. లఖావట్టు అక్కడి జాగిర్దారు. కానీ, ఆయనను లాహోరులోని చెరసాలలో బంధించారు.
లఖావట్టు తల్లి భూమన్ షాను ఎలాగైనా తన కుమారున్ని చెరసాల నుండి తప్పింపుమని ప్రార్ధించింది.
తాను అలాగే చేస్తానని, పూర్వ జన్మలో బంధం ఉన్న ఆ గ్రామాన్ని తనకు ఇవ్వాలని కోరాడు. ఆ తల్లి అందుకు అంగీకరించింది.
నాలుగు, ఐదు దినాలు గడిచాయి. ఒకనాడు లఖాపట్టు ఇంటికి రావటం చూచి ఆశ్చర్యపోయింది అతని తల్లి. ఎలా వచ్చావని అడిగింది.
నిన్న రాత్రి ఒక దివ్యకాంతి నా చెరసాలలోని గదికి వచ్చింది. ఒక మహనీయుడు ప్రత్యక్షమై “పద నిన్ను విడిపిస్తాను. నా వెంట రా” అన్నాడు.
చేతులకు, కాళ్ళకు ఉన్న గొలుసులు విడిపోయాయి. తాళాలు పెట్టిన ద్వారాలు కూడా ఏమీ అడ్డగించలేదు. ఈ ఉరి పొలిమేర వరకు క్షణంలో వచ్చాము. ఆ మహనీయుడు అదృశ్యమయ్యాడు” అని చెప్పాడు.
తల్లి కుమారుని తీసుకువెళ్ళి భూమన్ షాను చూపగా తనను విడుదల చేసింది ఈ మహనీయుడే అన్నాడు కుమారుడు.
ఎవరో అడిగారు “ఈ ఊరికి, మీకు సంబంధం ఏమిటి?” అని. బాబా భూమన్ షా ఆ గ్రామంలో ఒక చోట త్రవ్వమన్నాడు.
కమండలం, చిమటా, పెద్ద పెద్ద పాత్రలు, పెనం మొదలైనవి కనిపించాయి అక్కడ. “ఇక్కడే నేను అన్నదానం చేసేవాడిని” అన్నారు బాబా భూమన్ షా.
భూమన్ షా జయంతి ఏప్రియల్ 14 (1697). మనము అన్నదాన వితరణ కార్యక్రమాల్లో పాల్గొందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కఠినం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 6
- ఎవరిపై విశ్వాసం? …. మహనీయులు – 2020… ఏప్రిల్ 7
- శాస్త్ర జ్ఞానం…. మహనీయులు – 2020… జూన్ 14
- భూదాన సేవ …. మహనీయులు – 2020… ఏప్రిల్ 18
- రాముని వారము, మాకేమి విచారము …. మహనీయులు – 2020… ఏప్రిల్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments