శాస్త్ర జ్ఞానం…. మహనీయులు – 2020… జూన్ 14



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఆబూ హనీఫా మహమ్మదీయ ధర్మశాస్త్రాలలో దిట్ట. బట్టల వ్యాపారం చేస్తుండేవాడు.

ఒకనాడు ఆయన తన బట్టల దుకాణంలో ఉండగా, అల్లా పేరు చెప్పి ఒక బట్టను తన గుమాస్తా అమ్మాడు. అల్లా పేరుతొ బట్టను అమ్మటం హనీఫాకు నచ్చక ఆ రోజు దుకాణాన్ని మూసివేశాడు.

మరోసారి ఒక బట్టలో కొంచెం నాణ్యత తగ్గింది. ఈ విషయం చెప్పి బట్టను అమ్మమన్నాడు ఆయన.

కానీ గుమాస్తా ఆ విషయాన్ని చెప్పకుండా అమ్మాడు. ఆ రాత్రి ఈ విషయం తెలిసింది హనీఫాకు. ఎవరికి అమ్మాడో ఆ గుమాస్తా చెప్పలేకపోయాడు.

ఆ రోజు సరకులను అమ్మగా వచ్చిన ధనాన్ని మొత్తం అప్పుడే దాన, ధర్మాలకై ఖర్చు పెట్టాడు హనీఫా.

ఇటువంటి నీతి, నియమాలు, ధర్మ శాస్త్రంలోని పట్టును, సంప్రదాయాల ఆచరణలో నిపుణతను ఆనాటి పాలకుడు గ్రహించి, ఖాజీగా ఉండమని ఒత్తిడి తెచ్చాడు హనీఫాపై. “నేను ఆ పదవికి తగను” అన్నాడు హనీఫా.

“నీవు అబద్దం ఆడుతున్నావు’ అన్నాడు పాలకుడు. “ఐతే అబద్దాలకోరును ఎందుకు ఖాజీగా పెట్టుకుంటారు మీరు?” అని నిర్మొహమాటంగా అడిగాడు హనీఫా.

ఆ పాలకుడు హనీఫాను గుర్రానికి కట్టివేసి రోజుకు పదకొండు కొరడా దెబ్బలను కొట్టించేవాడు. ఇలా ఒక రోజుకాదు, రెండు రోజులు కాదు, పది రోజులు అయినా ఆయన లొంగలేదు. కన్నీరు కార్చాడు హనీఫా.

ఎందుకు?

తనకు దెబ్బలు తగిలినందుకు కాదు, తన తల్లి తనను గుర్రానికి కట్టివేసి, దెబ్బలు కొడుతున్నందుకు విలపించింది. తల్లి విలాపమును ఆయన చూడలేకపోయాడు.

అంతేగాని తనకు తగిలిన దెబ్బలను గూర్చికాదు. అప్పటికీ తల్లి అన్నది – “బిడ్డా! ఇటువంటి బాధను కలిగించే ఆ విద్య నీకు ఎందుకు? వదలిపెట్టు” అని.

అమ్మా! నేను ధనార్జన కోసం జ్ఞానాన్ని ఎప్పుడూ ఆర్జించలేదు. ఆ జ్ఞానాన్ని అల్లాకోసం, నా ముక్తి కోసం నేర్చుకుంటున్నాను. నన్ను ప్రపంచం ఏమైనా అనుకోనీ , అమ్మా!” అన్నాడు ఆబూ హనీఫా.

జ్ఞానాన్ని సంపాదించటం కాసుల కోసం, గండపెండేరాల్ని తొడిగించుకోవటంకోసం కాదు. భగవద్దత్తమైన జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడుతూ, ముక్తిని సాధించుట కొరకే అని హనీఫా జీవితం చెబుతోంది.

చివరకు హనీఫాను ఖైదు చేసి, విషం ఇచ్చి చంపాడు పాలక ప్రభువు.

ఒకసారి సాయిబాబా వద్దకు కుంభకోణం నుండి వేదపండితులు వచ్చి, సాయిని ముసల్మానుగా భావించి, సాయికి నమస్కరించక, భూదేవికి నమస్కరించి, వేదం పఠన ఆరంభించారు. మధ్యలో వారి గొంతు పెగలలేదు.

సాయియే పఠించసాగాడు. సాయి చెప్పాడు “దైవానుగ్రహానికి వేదం పఠించాలి, కానుకల కొరకు కాదు”.

జ్ఞానార్జన ధనార్జనకు పొత్తులేదని తెలిసిన ఆబూ హనీఫా తేదీ తదితర వివరాలు తెలియవు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles