Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి ప్రథాన్ అనే పేరుగల భక్తుడు, సాయిని దర్శించి తిరిగి బొంబాయి పోబోతుంటే భారీగా వర్షం కురవసాగింది.
సాయిబాబా అప్పుడు “ఓ దేవా! ఇక వర్షాన్ని ఆపు. నా బిడ్డలు తిరిగి ఇళ్ళకు వెళ్ళాలి. వారు కష్టపడకుండా ఇళ్ళకు వెళ్లనీ” అన్నాడు. వెంటనే వాన ఆగిపోయింది.
ఫ్రాన్సిస్ జేవియర్ ఒకసారి సముద్రం మీద ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. తుఫాన్ చెలరేగింది. ఓడలోని వారంతా హ హ కారాలు చేస్తున్నారు.
ఫ్రాన్సిస్ జేవియర్ అప్పుడు దైవాన్ని ప్రార్ధించాడు. అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చు అని దైవానికి మనవిచేసి, తన చేతిలో ఉన్న శిలువ ప్రతిమను ఉప్పొంగుతున్న సముద్రంలో వేశాడు. తుఫాన్ ఆగిపోయింది.
ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క శిలువ ప్రతిమ మాత్రం సముద్రంలో ఉండిపోయింది.
ఫ్రాన్సిస్ సముద్ర తీరం వెంబడి నడుస్తున్నాడు. ఒక పెద్ద పీత ఆ శిలువ ప్రతిమను సముద్రమునుండి తెస్తోంది. ఆ పీతను, ప్రతిమను చూచిన వారందరూ ఆశ్చర్యపోయారు.
ఆ ప్రతిమను ఫ్రాన్సిస్ తీసుకున్నాడు సంతోషంతో. తిరిగి ఆ పీత సముద్రంలోకి వెళ్ళిపోయింది.
ఫ్రాన్సిస్ తన చదువు పూర్తి ఐన పిదప, ఆచార్యునిగా కీర్తిని, ధనాన్ని సంపాదించదలచాడు.
స్నేహితుడైన ఇగ్నేషియస్ లయోలావలన జీవితాన్ని క్రీస్తు సేవకు అంకితం చేద్దామనుకున్నారు. దేశాలు తిరగసాగాడు. అందరకు దైవ భక్తిని, నమ్మకాన్ని ప్రోత్సహించసాగాడు.
ఈయన తన జీవితంలో అద్భుతాలను చూపాడు. ఒకసారి ఆయన చర్చిలో ఉండగా ఒక మహిళ, బావిలో పడి చనిపోయిన తన కుమారున్ని ఎత్తుకుని వచ్చి, ఆయన వద్ద ఉంచి, రోదించసాగింది.
ఆయన భగవంతుని ప్రార్థనచేశాడు. ఆ పిల్లవాడు లేచి తల్లి దగ్గరకు వెళ్ళాడు.
ఫ్రాన్సిస్ మత ప్రచారనిమిత్తం అనేక ప్రదేశాలకు వెళ్ళేవాడు.
ఒక చిన్న పిల్ల మరణావస్థలో ఉంది. మలక్కనంతా ఆ పిల్ల తల్లి గాలించింది. ఫ్రాన్సిస్ కొరకు.
ఆయన అక్కడే లేరు. చిన్న పిల్ల మరణించింది. ఖననం చేశారు. ఫ్రాన్సిస్ కొరకు ఆ తల్లి ఎదురుచూడసాగింది.
ఫ్రాన్సిస్ వస్తారని, మృతురాలైన తన పిల్లకు జీవాన్ని ఇస్తాడని, కొన్ని దినాలు గడిచాయి. ఆయన మలక్కారాగానే ఆమె దీనాతిదీనంగా ఫ్రాన్సిస్ ను ప్రార్ధించింది.
మీరు ఇక్కడే ఉంటే పిల్ల బ్రతికి ఉండేదని, ఇప్పుడైనా బిడ్డను బ్రతికింపమని ప్రార్ధించింది. ఫ్రాన్సిస్ దైవాన్ని ప్రార్ధించాడు.
“పిల్లను సమాధి చేసిన స్థలానికి పో, పిల్ల బ్రతికింది” అన్నారు. విశ్వాసంతో ఆమె, సమాధిని తెరిపించింది. పిల్ల సజీవంగా ఉంది.
ఇది విశ్వాసపు విలువ. ఆమెకు ఫ్రాన్సిస్ పై విశ్వాసం ఉంటె, ఫ్రాన్సిస్ కు తన దైవంపై విశ్వాసం ఉంది.
నేడు ఏప్రియల్ 7. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జన్మదినం (ఏప్రియల్ 7, 1506), దైవమును స్మరించెదము గాక. విశ్వాసము గాఢమగును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కోరుకున్న బీదరికం…. మహనీయులు – 2020… జూలై 16
- పరమాత్మను దర్షింపచేసే ప్రకృతి… మహనీయులు – 2020 – జనవరి 16
- శక్తుల కూడలి …. మహనీయులు – 2020… మే 26
- తస్మై గురవే నమః …. మహనీయులు – 2020… సెప్టెంబరు 26
- మానవ జన్మ…. మహనీయులు – 2020… ఆగస్టు 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments