Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
తపోవన్ మహారాజ్ అంటే చాలామందికి తెలియదు. చిన్మయానందుల వారి గురువు అంటే అందరకు తెలుస్తుంది.
సాయిబాబా తనకు శిష్యులు లేరంటారు. తపోవన్ మహారాజ్ కు శిష్యులున్నారు. కానీ చాలా తక్కువమంది.
అయన ఆశ్రమం (హిమాలయాలలో) ఒక చిన్న గది మాత్రమే. శిష్యులు కఠోరమైన నియమాలు పాటించాలి.
ఒకసారి అయన శిష్యులకు పాఠం చెబుతుంటే ఎవరో గంపలో మామిడిపండ్లు తెచ్చి ఇచ్చారు. ఆ గంపను లోపాల పెట్టించారాయన.
ఆ రోజు గడిచింది. మరునాడు గడిచింది. మూడోనాడు కూడా గడిచింది. శిష్యులందరూ నిరుత్సాహంచెందారు. ఆయన ఆ గంపను బయటకు తెమ్మన్నారు.
శిష్యులందరూ ఏంతో ఆశతో ఉన్నారు. ఎదురు చూస్తున్నారు. ఆ బుట్టను మామిడిపండ్లతో సహా ఎదురుగా ఉన్న లోయలో పారవేయించారు.
ఏ విధమైన కోర్కెలు ఆధ్యాత్మికపథంలో పనికిరావు. అవి పతనానికి దారితీస్తాయి. మనసును అధ్యయనంపై ఉంచాలిగాని, మామిడిపండ్లపై కాదు” అన్నారు తపోవన్ మహారాజ్.
శిష్యులు తమ తప్పును గ్రహించారు. అదే ఆ గురువుకు కావాలి.
గంగాప్రసాద్ మహారాజ్ గారి భక్తుడు. కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకున్నాడు.
గంగాప్రసాద్ చిన్న సోదరిని పిలచి “మీరెందరు వచ్చారు?” అని అడిగారు. ఆ చిన్నపిల్లతోపాటు తాము లెక్కించసాగాడు మహారాజ్.
ఒకటి, రెండు, మూడు….ఏడు. ఒక ఆశ్రమవాసిని పిలచి ఏడు బత్తాయి పండ్లను ఆ పిల్ల గౌనులో వేశారు మహారాజ్.
ఆ పిల్ల అందరికంటే ముందుగా బయలుదేరింది. ఆ పిల్లను అక్కడున్న కోతులు చుట్టుముట్టాయి. ఆమె కేకలకు అందరూ వచ్చారు, మహారాజ్ తో సహా.
మహారాజ్ పరిస్థితి గ్రహించాడు. “రాం రాం” అంటూ ఆ కోతులను పిలిచాడు. అవి చెట్లు దిగివచ్చాయి. తాము తీసుకున్న బత్తాయిపండ్లతో సహా కోతులు పండ్లను క్రిందపెట్టాయి.
“పీచే, పీచే” అన్నారాయన. అవి వెనుకకు అడుగులు వేశాయి.
ఒక ఆశ్రమవాసిని పిలిచి బత్తాయిపండ్ల బుట్టను తెమ్మన్నారు. స్వామీజీ ఇచ్చిన ఆ బత్తాయిపండ్లను వరుసగా వచ్చి ఆ కోతులు తీసుకుపోయాయి.
ఇదే ప్రకృతితో సహజీవనం అంటే. ప్రకృతి భగవంతుని చూపే ద్వారము. భగవంతుడే సత్యము. ఆనందమే సత్యము.
“హిమాలయాలలో విహారం” అనే గ్రంధాన్ని ఆయన సంస్కృతంలో రచించారు. ఇంకా ఆయన ఆత్మకథను “ఈశ్వర దర్శనం” అనే పేరుతొ రచించారు.
తపోవన్ మహారాజ్ ను స్వామి శివానందుల వారు “హిమవత్ విభూతి” గా కీర్తించారు.
కోవెల లేని దైవంగా కీర్తింపబడే తపోవన్ మహారాజ్ ప్రకృతిలో లీనమైన దినం నేడే జనవరి 16 (1957).
వికృతిగా గాక ప్రకృతిని,తద్వారా భగవంతుని దర్శించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భవ శంకర దేశికమే శరణం … మహనీయులు @2020 – జనవరి 9
- ఆత్మానందం …. మహనీయులు – 2020… ఆగస్టు 18
- దొంగ కూడా మనవాడే …. మహనీయులు – 2020… మే 16
- దూరంగా ఉండని గురువు… మహనీయులు – 2020 – జనవరి 6
- దొంగల్లో దొంగ…. మహనీయులు – 2020… నవంబర్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments