Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ఈ వేదాంత మార్గం మిగుల కఠినమైంది” అంటారు సాయి. ప్రతి క్షణం జాగురూకులై ఉండాలి.
కురుమద్దాలి పిచ్చమ్మ గారు స్వయంగా తన గత జన్మలను గూర్చి “వీడు (పిచ్చమ్మ గారు) ఒక జన్మలో రాజు. తరువాత వైష్ణవుడుగా పుట్టి మాలవాళ్ళను రోతగించుకున్నాడు. అందుకే ఈ జన్మలో మాల కులంలో పుట్టించాడు రాముడు” అనేవారు.
ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన కర్మనంతా అనుభవించింది ఆమె. పెళ్లైంది. కూతురును కన్నది. భర్త మరణిస్తే కూతురును సాకింది.
వివాహం చేసింది. కానీ ఆ కూతురు అత్తింట కష్టాలను ఓర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
అప్పటి వరకు సంసారంలో కష్టాలు వస్తే కన్నీరు మున్నీరుగా విలపించేది. ఇప్పుడు సంసారమే లేదు. ఇక ఆమెకు కన్నీరెందులకు – భగవంతుని కోసం, భగవానుని దర్శనం కోసం.
ఆమె రోదిస్తుంటే ఒక గోసాయి వచ్చి అనునయించి, ఆదరించి, కన్నీరు తుడిచి, ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆ గోసాయి రాముడు అంటుందామె.
మాల పిచ్చమ్మ అవధూత పిచ్చమ్మ అయింది – రామవధూత పిచ్చమ్మ అయింది.
ఆకులూ అలమలు తినేది, ఒండ్రు మట్టి కూడా తినేది. ఆమె వద్దకు సర్పాలు వచ్చి ఆడుకునేవి. పిల్లలు రాళ్ళు వేసి కొట్టేవారామెను.
ఒకనాడొక పిల్లవాడు రాయితో కొట్టబోతుంటే “ఒరేయ్, కుర్రాడా! రాళ్ళు విసరకురా, చేతులు బొబ్బలెక్కుతాయి” అన్నది.
ఆకతాయి రాళ్ళు విసిరాడు, చేతులు బొబ్బలెక్కాయి. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వారు వెళ్ళి ఆమెను క్షమించమన్నారు. బొబ్బలు మాయమయ్యాయి.
ఆమె మహత్తును గుర్తించి, కురుమద్దాలిలో ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఎవరో కాళ్ళు చచ్చుపడిన వ్యక్తిని, ఆసుపత్రికి తీసుకువెళుతుంటే ఆమె “ఇంటికి పోరా” అన్నది.
అంతే అతడు హాయిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాళ్ళ చచ్చు రోగపు జాడే లేదు!
రాముడు ఏది పలికిస్తే అది పలుకుతాడీ జీవుడు అనేది. నేడు. మహత్తంతా రామునిదే అనేది.
ఆమెను మలయాళ స్వామి, కోమ్మరాజు లక్ష్మీకాంత యోగి, శ్రీపాద కృష్ణమూర్తి, త్రిపురనేని గోపీచంద్, కాటూరి వేంకటేశ్వరరావు మొదలైన వారెందరో దర్శించుకున్నారు.
ఆమె రామ నామం చేస్తుంటే, భక్తులందరూ అనుసరించారు. ఆమె భౌతికకాయం విడిచింది. ఆ దినం 15 జనవరి, 1951.
“ఎద్దల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనబడడు. నీ, నా లేకుండా పోవాలి. అప్పుడు కనబడతాడు దేవుడు” అనేది ఆమె.
నేడు జనవరి 15 ఆమె మహాసమాధి చెందిన రోజు. ఆమెను స్మరించి, ఆమె వాక్కులను అనుసరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జీవిత గమ్యం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 14
- పాహి దత్తప్రభో! …. మహనీయులు – 2020 – జనవరి 27
- భయమెలా? ఓ మనసా! … మహనీయులు @2020 – జనవరి 3
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- శిక్ష తప్పదు గాక తప్పదు! …..సాయి@366 జనవరి 18…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments