Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నియమనిష్టలతో, నీటి నిజాయితీలతో కూడిన సాయిబాబా జీవితం మానవజాతికే మార్గదర్శకం కాగలిగింది” అంటారు, డాక్టరు చలసాని సుబ్బారావుగారు.
“నేను వేదాంతంపై ఉపన్యాసాలు ఇచ్చాను. తురీయానంద స్వామిలో మీరు మూర్తీభవించిన వేదాంతాన్ని చూడగలరు” అని పలుకుతారు వివేకానందస్వామి, తురీయానంద స్వామి గురించి మాట్లాడుతూ.
జనవరి 3, 1863 హరినాథ్ గా జన్మించిన వ్యక్తి.. అనంతరం రామకృష్ణ పరమహంస శిష్యుడై తురీయానంద స్వామి అయ్యారు.
పదేళ్ళ వయసప్పుడు తురీయానంద స్వామి ఒకసారి నదిలో స్నానం చేస్తుండగా “మొసలి, మొసలి, తక్షణమే బయటకు వచ్చెయ్” అని ఓ బాలుడు ఒడ్డునుండి అరిచాడు. ఒడ్డువైపు బయలుదేరాడు నది నుండి.
ఏమిటి నేను చేస్తున్న పని? రాత్రి పగలు సోహం సోహం అని జపించే నేను, నా ఆదర్శాన్ని మరచిపోయి, శరీరమే నేనని భ్రమిస్తున్నానా? ఎంత సిగ్గుచేటు” అని తలచి మళ్ళీ నదిలోనికి వెళ్ళిపోయాడు స్నానం చేయటానికి.
సన్యాసిగా జీవితం ఆరంభించక పూర్వమే అటువంటి స్థితిలోనున్న, తురీయనందులు తురీయానందాన్ని పొందారు.
ఎవరో తురీయనందులతో “మీరు ఈ దేహం కానట్లయితే, మీ చేతిని ఈ మంటలో పెట్టగలరా?” అని ప్రశ్నించారు.
తురీయానంద స్వామి ఒక్కసారిగా లేచి “నేను పెట్టగలను. నేను నా చేతిని మంటలో పెట్టినా కాలిపోదు. నా దేహం మాత్రమే కాలుతుంది” అని చేతిని నిప్పులో పెట్టబోతుంటే, పరిస్థితి చేయిదాటిపోతోందని ఎవరో వారించారు.
ఒకసారి ఈయన సంగోల్ లో ఉన్నప్పుడు మలేరియా జ్వరం వచ్చింది. అయినా గ్రామంలోనికి భిక్షకై వెళ్ళేవారు.
ఒకసారి ఆయనకు చాల నీరసంగా ఉంది. అలాగే నదిని దాటుతుంటే, నదిలో పడిపోయాడు. ఎవరో లేవదీశారు.
తడి గుడ్డలతోనే భిక్షకు పోతుంటే, ఎవరో వృద్ధురాలు ఈయనను చూచి జాలిపడి అయన ఆరోగ్యం గురించి అడిగింది.
అప్పుడు తురీయనందులు “అమ్మా! నేను ఈ దేహాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంటే, నువ్వు నా యోగక్షేమాలు విచారించి, దానిని నాకు మరల గుర్తు చేస్తున్నావు. దయచేసి ఇకనైనా నా ఆరోగ్యం గురించి అడగవద్దు” అన్నారు ఆమెతో.
ఎవరో పెన్సిలును, మొద్దుబారిన కత్తితో చెక్కగా, పెన్సిలు మొన వంకరపోయింది. తురీయనందులు ఆ పెన్సిలును, ఆ కత్తితో చెక్కి, సూటైన మొన వచ్చేటట్లు చేసారు.
అయన “ప్రతి పనిని దైవారాధనగా భావించి చెయ్యి. నువ్వేది చేసినా అమ్మకు నివేదనగా ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయాలి” అన్నారు.
అంటే సాయినాథుడు తెల్పిన శ్రద్ధను లోకికంగా కూడా చూపాలి.
నేడు జనవరి 3 తురీయనందుల జన్మదినం. తురీయానందము పొందుదుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
- ఆధ్యాత్మిక పథం – ఓ జారుడుబండ … మహనీయులు – 2020 – జనవరి 15
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- అద్భుతం కేశవం…..మహనీయులు – 2020 – జనవరి 22
- గోవింద రాం రాం గోపాల హరి హరి … మహనీయులు – 2020 – జనవరి 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments