Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
జనవరి 13, 1885లో ఒక శిశువు జన్మించాడు. ఆ బిడ్డడి పేరు తెలియదు, కానీ ఆ గురువు ప్రసాదించిన మంత్రం “గోవింద రాం రాం గోపాల హరి హరి” అంటూ ఆ నామ సంకీర్తన చేస్తూ కాలినడకన పల్లెలు, పట్టణాలు ఎన్నో తిరిగాడు శిష్యులతో.
భక్తులు, శిష్యులు ఆయనకు పెక్కు చోట్ల ఆశ్రమాలు నిర్మించి ఇచ్చారు. కొంతకాలం మాత్రమే అక్కడ ఉండి నామ సంకీర్తనతో దేశాటన చేసేవాడు. గోవింద స్వామి అయ్యాడాయన.
అయన నెల్లూరు చేరాడు. ఒక పాశ్చాత్య మండలాధికారి ఆయన హరి సంకీర్తనను అడ్డుకుందామని తలచి బయలుదేరాడు – మందీ మార్బలంతో.
కానీ సంకీర్తన చేస్తూ వస్తున్న గోవింద స్వామిని చూసి మంత్ర ముగ్దుడై తానూ నామ సంకీర్తనలో పాల్గొన్నాడు.
నామ సంకీర్తనతో పులులు జింకలవుతాయి. ఇటువంటి సంఘటనే చైతన్య మహాప్రభు జీవితంలో కూడా కానవస్తుంది.
గోవింద స్వామి నెల్లూరు సమీపంలోని వావిళ్ళ చేరాడు. అక్కడ కలరా వ్యాపించింది.
ఒక సన్యాసి ఆ ఊరి వారిని మోసగించి డబ్బు గుంజుతున్నాడు. ఇది తెలిసిన గోవింద స్వామి సన్యాసిని సున్నితంగా వారించాడు, అలా చేయటం తగదని, సన్యాసి రెచ్చిపోయాడు.
గోవింద స్వామిని నిందించాడు. గోవిందా స్వామి పట్టించుకోలేదు.
గోవింద స్వామి గురువును కూడా నిందించ నారంభించాడు సన్యాసి. తన గురువును నిందిస్తుంటే తాళలేకపోయాడు గోవింద స్వామి.
చర్చ సాగుతొంది. చివరకు గోవిందస్వామి నా గురువు ప్రసాదించిన మంత్రాన్ని ఒక కాగితంపై వ్రాసి త్రాసులో వేస్తాను. నీవు కూడా అలా చేయి అన్నాడు. సరే అన్నాడు సన్యాసి.
తన గురువు ప్రసాదించిన మంత్రాన్ని “గోవింద రాం రాం గోపాల హరి హరి” ని వ్రాసి ఒక వైపు త్రాసులోని పళ్ళెంలో పెట్టాడు. రెండో వైపు సన్యాసి తన గురువు వ్రాసిన మాత్రన్నుంచాడు.
గోవింద స్వామి గురువు మంత్రమే బరువైనది. ఎన్ని కాగితాలనైనా, ఏ వస్తువునైనా ఉపయోగించుకోండని సన్యాసికి సవాలు విసిరాడు గోవింద స్వామి.
ఎంత బరువు వేసినను గోవింద స్వామి మంత్రంతో సరితూగలేదు. సన్యాసి కాలికి బుద్ధి చెప్పాడు.
గోవింద స్వామి నామ సప్తాహం చేసి, ఆ కాలరాను పోగొట్టాడు.
ఒక మాట: ఏ గురువు నేర్పిన మంత్రమైనను ఒక్కటే. కానీ సన్యాసి తన గురూపదేశమును అక్రమ ధనార్జన సంపాదనకు వాడటం వలన నిర్వీర్యమైంది.
సాయిబాబాను మొదట పిచ్చి ఫకీరన్న వారే, అయన మహిమలను చూచి భగవంతుడన్నారు.
గోవింద స్వామిని భగవదవతారం అనేవారు. అయన “నేను భగవంతుని సాధారణ భక్తుడను. భక్తుల సేవకుడను, మానవ సేవ ద్వారా మాధవ సేవ చేయండి” అని సందేశం ఇచ్చేవారు.
నేను జనవరి 13, గోవింద స్వామి జన్మ దినం. అయన కిష్టమైన నామాన్ని స్మరించెదము గాక – “గోవింద రాం రాం గోపాల హరి హరి”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రాం…రాం…రాం…. …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 24
- కావవే మహానుభావ కరుణతో …. మహనీయులు – 2020… సెప్టెంబరు 13
- ఓం కర్మ ధ్వంసినే నమః…..సాయి@366 సెప్టెంబర్ 3….Audio
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
- ఏమి నీ కోరిక? …..సాయి@366 సెప్టెంబర్ 4…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments