Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“లోభికి విరక్తి, ముక్తి ఎలా సాధ్యం?” అంటారు సాయి గుల్జార్ ను గూర్చి.
శ్రీనివాస నాయక్ రత్నాల వ్యాపారం చేస్తూ ‘నవకోటి నారాయణ’ అనే ప్రశంసలందుకున్నాడు.
ఆ ధన సంపద అతనిలో మానవత్వపు విలువలు లేకుండా చేసింది. అటువంటి వ్యక్తిని విరాగిగా, భక్తునిగా, సంగీత పితగా, అత్యుత్తమ మానవతావాదిగా, హరిదాసు శ్రేష్టునిగా చేయటానికి పాండురంగడు ఎంతో కష్టపడ్డాడు.
నాయక్ పురందర దాసు అయ్యాడు. జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేయదలచాడు.
“ఒక్క భార్య వెయ్యి గురువులకు సమానం. తంబుర, వీణలను పట్టుకునేట్లు చేసింది.
భర్త (తాను అంటే పురందరదాసు) భిక్షాపాత్రను పట్టుకుని భిక్షించటానికి అభిమానం అడ్డువస్తుందని గ్రహించి, జోలెను ఆయన చంకకు తగిలించింది” అంటారాయన. జీవితమంతా భిక్షాటనే.
భర్త తెచ్చిన భిక్షను అతిధులకు పెట్టి, మిగిలిన దానినే ఆ కుటుంబం భుజించేది. ఏ దినం భిక్ష ఆ దినమునకే. మరునాటికి దాచుకునే ప్రసక్తేలేదు.
వ్యాసరాయలు ఈయనకు దీక్షనిచ్చి మధ్వ మతములో చేర్చుకున్నారు. కీర్తనలను పురందర విఠలుడు అనే నామంతో వ్రాశాడు.
అవి వేద ప్రమాణానికి దీటైనవి అన్నారు ఆయన గురువు. పురందరదాసోపనిషత్తు అయ్యాయి.
ఇంకా ప్రస్తుతం పిల్లలకు సంగీత పాఠాలు బోధించేటప్పుడు వాడే తోలి పాఠాలు, జంతి స్వరాలు, అలంకారాలు, గీతాలు, లంబోదర లకుమికరా – ఇవన్నీ పురంధరునివే.
పాండురంగనికి భక్తుల గృహాలలో మరువేషాలతో సేవలు చేయటం అలవాటే. అప్పన్నగా పురందర గృహంలో పనిచేసిన పాండురంగడు పురంధరుని చేతిలో దెబ్బలు తిన్నాడు.
అప్పన్నే పాండురంగడని పురందరునికి తెలిసేటప్పటికి. అప్పన్న మాయమయ్యాడు.
కోపం ఎంత అనర్థహేతువో గ్రహించాడు పురందరుడు. పాండురంగడు తనకెంతటి ఉన్నత స్థాయి కల్పించారో గ్రహించాడు పురందరుడు.
“నీవంటి వాడు నాకు తండ్రి – నీకు తండ్రి లేడు
నీవంటి దైవం నాకున్నాడు – నీకో? లేడు!
నీవంటి పాలకుడు నాకున్నాడు – మరి నీకో? లేడు!
నీవు పాపం అనాథుడివి, నేను నా లోకంలో ఉన్నాను
నీ భార్య లక్ష్మీదేవి నా తల్లి
ఓ పురందర విఠలా! నాకున్నటువంటి తల్లిదండ్రులు నీకున్నారా?” అంటాడు పురందరుడు.
భారత ప్రభుత్వం జనవరి 14, 1964న పురందర స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. మనం కూడా భక్తి ప్రేమలతో మన తల్లిదండ్రులను చూచి పులకరించిపోదాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దైవలిఖితం…. మహనీయులు – 2020… జూలై 18
- అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు…. మహనీయులు – 2020… ఏప్రిల్ 4
- భక్తి శిఖరం .. …. మహనీయులు – 2020… ఆగస్టు 10
- మోక్షం ఎందుకు?…..సాయి@366 నవంబర్ 27….Audio
- రాజగురు …. మహనీయులు – 2020… మార్చి 8
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments