Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కళ్యాణి , శ్రీధర్ అని మా ఫ్రెండ్స్ వున్నారు. వాళ్ళది విశాఖపట్టణం,
వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, పైగా కులాంతరం కావటంతో వాళ్ళ వాళ్ళ ఫామిలీస్ వీళ్ళని దూరంగా వుంచారు.
వీళ్ళిద్దరూ కూడా బాబా భక్తులు. వీళ్ళు ఎంత భక్తులంటే వీళ్ళ ఊపిరే బాబా అన్నట్లుగా వుంటారు.
అతను హెల్త్ ని బాగా చూసుకుంటారు. కొంచెం నూనె ఎక్కువైనా కూడా ఆ పదార్ధం తినటం మానేస్తారు. అటువంటి వాడు.
ఒకరోజు కళ్యాణి వరలక్ష్మి వ్రతం నోము చేసుకుంటుంటే తను కడుపులో నొప్పి అంటూ కూలిపోయాడు.
ఆ సమయంలో మేము ఊరిలో లేము అతన్ని వెంటనే అపోలో కి తీసుకెళ్లారు.
అన్నీ టెస్ట్స్ చేసాక, అతని పాంక్రియాస్ లో 200 రాళ్లున్నాయి అని, మూడు నెలల పాటు హాస్పిటల్లో అతని కోసం ఒక ‘ ఐస్ ‘ క్యాబిన్ లాగా తయారుచేసి అందులో వుంచారు.
డాక్టర్ చూసిన ప్రతిసారి కళ్యాణితో ” నువ్వు ఆశ వదిలేసుకో నీకు మీ ఆయన ఎట్టి పరిస్థితులలో దక్కడు ” అని చెబుతుండేవాడు.
చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. 30 లక్షలు కట్టమన్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళు మేము 30 లక్షలు ఇవ్వము అన్నారు.
ఆలా ఇవ్వము అనేసరికి అందులో ఒక బెంగాలీ ఎంప్లాయ్ ‘ లా ‘ అంతా వెతికి పట్టుకుని ఎందుకివ్వరు? గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ని కల్పిస్తుంది,
ఆ డబ్బు అంతా ఒకళ్ళిద్దరు మాత్రమే వాడుకుంటున్నారు మిగతాది అంతా అలాగే వుంటుంది. ఎవరూ దాన్ని వాడుకోవడం లేదు. ఆ డబ్బంతా గవర్నమెంట్ కి మిగులుతుంది.
ఏం చేస్తోందా డబ్బు? మా ఇన్సూరెన్స్ డబ్బులోనుంచి మేము వాడుకోనప్పుడు, అందులోనుంచి 1% , 2% మా అనుమతితో అతనికి పనికి వచ్చేటట్లు చెయ్యమంటూ కోర్టుకెక్కాడు.
కోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తీసుకువచ్చి హాస్పిటల్లో ఇచ్చాడు.
మూడు నెలలు పాటు అతను హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆ శ్రీధర్ తండ్రి వచ్చారు. కానీ కళ్యాణి వైపు వారు ఎవరూ రాలేదు.
మా వారికి హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు నా కుటుంబం అంతా ఎలా మాకోసం నిలబడిందో, నేను నా భర్త వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ లాగా నిలబడ్డాము.
ఇలాంటి సమయంలో అలాంటి సపోర్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు, అప్పుడు నాకు డబ్బు అవసరం అంతగా లేదు. కానీ నా కుటుంబం అంతా నా కోసం మా వారి కోసం నిలబడ్డారు. అలాంటి సపోర్ట్ ఇప్పుడు కల్యాణికి అవసరం.
అందుకే నేను తన తోనే వుండేదాన్ని. ఇందులో మరో మిరాకిల్ ఏంటంటే కళ్యాణి శ్రీధర్ లకి ఇద్దరు పిల్లలు. ఒక్కరోజు కూడా వాళ్ళ నాన్న కోసం కంట తడి పెట్టుకోలేదు.
కళ్యాణి తన భర్తని ఆలా చూస్తూ ఏడ్చేది. తనని చూసి నేను కూడా ఏడ్చేదాన్ని. సహజంగా ఎవరైనా కష్టంలో బాధపడుతూ ఏడుస్తుంటే మనకీ ఏడుపు వస్తుంది.
కానీ వాళ్ళబ్బాయి మాత్రము ఇదంతా చూస్తూ, ” ఎందుకు ఆంటీ బాధపడతారు, నాన్నకేం కాదు బాబా వున్నారు ఆంటీ! అనవసరంగా ఎందుకేడుస్తారు ” అనే వాడు. వాళ్ళమ్మాయి ఎగ్జామ్స్ కి చదువుకుంటుంది.
నేను ఉన్నంత సేపు వుండి బయటకి వెడుతూ, ఆ పాపని ” అమ్మా! అమ్మ ఒక్కత్తే వుంది కదా! నువ్వు వెళ్లి అమ్మ దగ్గర కూర్చో ” అంటే, ” ఆంటీ ఏం కాదాంటీ! ఎందుకు భయం, కంగారు, మా నాన్నకి ఏం కాదు బయటకి వచ్చేస్తారు.బాబా వున్నారుగా ” అంది.
డాక్టర్స్ తో మాకెంతో వాదనలు జరిగేవి. ” No chance, he almost dead , kalyani don’t keep hope ” (మీ వారు బ్రతికే అవకాశం లేదు, అనవసరం గా ఆశలు పెట్టుకోకండి, అతను దాదాపు చనిపోయాడు) అనేవాడుడాక్టర్ కళ్యాణితో.
మీరు డాక్టర్ అయివుండి కూడా ఇలా మాట్లాడితే పేషెంట్ ను చూసుకుంటూ వున్న వాళ్ళు ఇంకా క్రుంగి పోతారు అని నేను అన్నాను.
మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఆ పిల్లల నమ్మకాన్ని మీరు పాడుచేస్తున్నారు అన్నాను. నన్ను శ్రీధర్ చెల్లిగా పరిచయం చేసింది కళ్యాణి.
చివరకి నన్ను, మా వారిని పిలిచి మీ అందరి నమ్మకం గెలిచింది, అతను ప్రమాదం నుండి బయట పడ్డాడు అని డాక్టర్ అన్నాడు.
మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఏమో కానీ ఇతనికి జీవితాన్నిచ్చి మీరందరిని బ్రతికించాడు ఆ దేవుడు అని అన్నాడు.
అయన పేరు భట్ (ఉడిపి బ్రాహ్మణుడు) ఆయనిప్పుడు బాబా భక్తుడు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసాక, ‘ job ‘ అంటూ ఏమి ఉండదు.
కానీ శ్రీధర్ పని చేస్తున్న కంపెనీ వాళ్ళు ఇంటికి వచ్చి శ్రీధర్ పరిస్థితిని గమనించి ” work at home ” చెయ్యి, నీకా అవకాశం ఇస్తాము శ్రీధర్ ” అన్నారు.
ఇప్పటికీ అతను work at home చేస్తున్నాడు. ఎందుకంటే అతని పొట్టలో మూడు రంధ్రాలు ఓపెన్ గా అలాగే వున్నాయి. ట్యూబ్స్ వేసారు. ఇప్పటికి అదే ఉద్యోగం చేస్తున్నారు.
బాబా అంటే అదే నమ్మకం, అదే సంతోషం, అదే భక్తి. నార్మల్ గా అయ్యాడు.
బాబా అతన్ని మృత్యువు నుండి తప్పించటమే కాకుండా అప్పుల పాలు కాకుండా ఉద్యోగం నిలబెట్టి, మరల ఆరోగ్యాన్నిచ్చి భార్య పిల్లలతో సంతోషం గా గడిపేటట్టు చేసి రక్షించి కాపాడాడు.
The above Telugu text has been typed by : Mr. Sai Krishna
Latest Miracles:
- భక్తులు మరిచిపోయిన బాబా మరవరు
- ఏ దేవుడు ఉన్నాడో కానీ అతను ఇంత దూరం వచ్చి మేము ఇంజక్షన్ ఇచ్చేదాకా ఎలా బ్రతికాడో మాకు అర్ధం కావడం లేదు.
- శ్రీధర్ జె. డిఘే
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- దర్శనం – నిదర్శనం …..సాయి@366 మార్చి 24…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments