Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ఒకరోజు భక్తుడు ఒకరు బాబాని దర్శించుకునేందుకు పొద్దున పొద్దునే ద్వారకామాయికి చేరుకున్నాడు. అతని పేరు ఆయు.
తెల్లారింది కాని, ఇంకా సూర్యోదయం కాలేదు. తొందరగా బాబాని దర్శించుకుని, వెళ్ళిపోవాలని ఆయు ఆలోచన. ద్వారకామాయికి చేరుకున్నాడతను.‘‘బాబా! బాబా’’ అంటూ లోనికి ప్రవేశించాడు. లోపల అంతా చల్లగా ఉంది. కనుచీకటిగా ఉంది. ఎవరూ ఉన్నట్టుగా కనిపించలేదు. కొద్దిగా భయపడ్డాడతను.‘‘బాబా’’ అని మళ్ళీ పిలిచాడు. సమాధానం లేదు.
ఇంత పొద్దున్నే బాబా ఎక్కడికి వెళ్ళారు? ఏమయ్యారు? అనుకుంటూ అటూ ఇటూ వెదకసాగాడు. ఆ వెదుకులాటలో అతని కాలు దేని మీదో పడ్డట్టుగా అనిపించింది. మెత్తగా తగిలింది. కాలు తీసి, కిందికి చూశాడతను. చేయి! పరీక్షగా చూశాడు. అది బాబా చేయి! అనుమానం లేదు. తెగిపడ్డట్టుగా ఉంది.‘‘బాబా’’ అని గొల్లుమన్నాడు ఆయు.
ఆసరికి కొంచెం వెలుతురు పారాడిందక్కడ. అప్పుడు చూస్తే బాబా శరీరావయవాలన్నీ ఖండించి పారేసినట్టుగా అక్కడక్కడా పడి ఉన్నాయి.
బాబాని ఎవరో చంపేశార నుకున్నాడతను. ముక్కముక్కలుగా చేసేశారనుకున్నాడు. ‘అమ్మో’ అని భయపడ్డాడు. పరుగుదీసి ఆ విషయాన్ని మిగతా భక్తులకు చెబుదామనుకున్నాడు. అంతలోనే బాగా ఆలోచించి, చెప్పకూడదనుకున్నాడు. చెబితే సాక్షిగా తను నిలబడాలి. పోలీసుల ఆరాలకు ఆధారం కావాలి. లేనిపోని ఇబ్బందిని కొని తెచ్చుకున్నట్టే! ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడు ఆయు.
గబాగబా అక్కణ్ణుంచి కదిలి, తనని ఎవరూ గమనించలేదు కదా అని చుట్టుపక్కల చూసి బయటపడ్డాడు. బాగా పొద్దెక్కింది.
భక్తులు ద్వారకామాయికి వెళ్ళి వస్తున్నారు. వచ్చిన వారెవరూ బాబా చనిపోయాడని, అతన్ని ఎవరో హత్య చేశారని…ఇలాంటి మాటలేవీ చెప్పుకోవడం లేదు. చెప్పుకుంటారని వేచి చూసిన ఆయుకి, వాళ్ళలా చెప్పుకోకపోవడంతో అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు మళ్ళీ ద్వారకామాయికి బయల్దేరాడు.
దారిలో అతనికి శ్యామా కనిపించాడు.‘‘బాగున్నారా?’’ పలకరించాడు శ్యామా.‘‘బాగున్నాను కాని, బాబా…’’ అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఆయు.
గమనించాడది శ్యామా.‘‘ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. చెప్పండి, బాబా…’’ అడిగాడు.‘‘ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు బాబాని దర్శించుకోవచ్చా? అని చిన్న అనుమానం.’’
‘‘దేవుణ్ణి దర్శించుకునేందుకు వేళలు ఉండవు. సమయాసమయాలు మనం నిర్ణయించుకున్నవే!’’ అన్నాడు శ్యామా. ఆయుని తోడుకుని ద్వారకామాయిలో ప్రవేశించాడు.
ద్వారకామాయిలో అడుగు పెట్టడానికి గత అనుభవంతో భయపడ్డాడు ఆయు. లోనికి వెళ్దామా? వద్దా? అని సందిగ్ధంలో పడ్డాడు. ఎటూ తేల్చుకోక గుమ్మంలో నిల్చున్నాడు. కేకేశాడు శ్యామా.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- “దేవుణ్ణి నమ్మడానికి ఋజువులూ, సాక్ష్యాలూ కావాలా? తప్పుకాదూ?’’
- ప్రమాదం అంతా మానసికమైన అవిటితనంతోనే! దాన్ని ఎవరికి వారే తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే సుఖసంతోషాలు
- ‘‘ముల్లోకాల్లోనూ మీరే! ముమ్మూర్తులూ మీరే’’
- నా భర్తని పాము కరిచిందయ్యా!
- నన్ను ఎవరూ చంపలేదు. నేను చనిపోలేదు…సాయిబాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments