Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ధుని వెలిగిన మరుక్షణం నుంచే షిరిడి వాసుల్లో కలరా, ప్లేగు గురించిన భయాలు అంతరించాయి.
సాధారణ జీవితానికి అలవాటు పడ్డారంతా.రోగాలతోనూ, గాయాలతోనూ వచ్చిన భక్తులకు, వాటిని నయం చేసేందుకు ఒకప్పుడు బాబా అడవిలోని మూలికల్నీ, పసరుల్నీ ఇచ్చేవారు. ఇప్పుడవి ఇవ్వడం లేదు.
సర్వరోగ నివారిణి ‘ఊదీ’ ఇస్తున్నారందరికీ.మూలికలూ, పసర్లూ అంటే ఆయుర్వేదం. వాటి వల్ల రోగాలు పోయే అవకాశం ఉంది.
ధునిలోని బూడిదతో రోగాలూ రొచ్చులూ పోతాయా? నమ్మశక్యంగా లేదు అనుకున్నాడు శ్యామా.
అన్నీ అనుమానాలే! అయినా బాబాకి దూరంగా ఉండలేకపోతున్నాడతను.బాబాని సందర్శించేందుకు ఎప్పటిలా ద్వారకామాయికి వస్తున్నాడు శ్యామా.
అతన్ని దాటుకుంటూ ఏడుస్తూ పరుగుదీస్తోంది ఓ స్త్రీ. తనూ పరుగుదీసి ఆ స్త్రీని చేరుకున్నాడు శ్యామా.‘‘ఏంటమ్మా, ఏమయ్యింది?’’ అడిగాడు.
‘‘నా భర్తని పాము కరిచిందయ్యా!. చనిపోయాడు. బతికించమని బాబాని వేడుకుందామని వెళ్తున్నాను.’’ అన్నదామె.
కాలు విరిగిందంటే కట్టు కడతారు. కన్ను కనిపించలేదంటే పసరు పోస్తారు. ప్రాణమే పోయిందని అంటూందీమె. బతికించగలరా? బాబా బతికిస్తాడా? జరగని పని అని ఏదో చెప్పబోయాడు శ్యామా.
వినిపించుకోలేదామె.పరుగు పరుగున ద్వారకామాయికి చేరుకున్నదామె. ఆమెతో పాటు శ్యామా కూడా చేరుకున్నాడక్కడికి.
పాము కరిచి, భర్త చనిపోయిన సంగతి బాబాకి ఏడుస్తూ చెప్పిందామె.
‘‘నా పసుపు కుంకుమల్ని మీరే నిలబెట్టాలి బాబా! నా భర్తని మీరే బతికించాలి బాబా’’ అని ప్రార్థించింది.
కాటేసిన పాముని వెతికి పట్టుకుని, విషాన్ని తీసుకోమని బాబా హెచ్చరించడం, గాయాన్ని మానిపించడం తను కళ్ళారా చూశాడు. అప్పుడు పాము కాటేసిన బాలుడు బతికి ఉన్నాడు.
ఇప్పుడు? పాము కాటేసిన వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని బాబా బతికించగలడా? సాధ్యమా?పదే పదే అవే ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు శ్యామా.
‘‘కాలం తీరింది, వెళ్ళిపోయాడు. కావాలంటే ఎలా తల్లీ, వస్తాడా మళ్ళీ?’’ అని అడిగారు బాబా.
‘‘మీరు తలచుకుంటే వస్తాడు బాబా! నా భర్త బతికి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది.’’ అన్నదామె.
‘‘జనన మరణాలు మనం శాసించగలమా?’’ అని అన్నారు బాబా .
‘‘మీరు శాసించగలవు బాబా! దయచేసి నా భర్తని బతికించు.’’ బాబా పాదాలపై పడిందామె.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పాము కాటునుండి బాబా వారు కాపాడుట.
- సాయి పాము, కుక్క రూపాలలో దర్శనం
- ‘‘నీ నమ్మకాన్ని వమ్ము చేయలేను. లే’’ అన్నారు బాబా
- నీటి దీపాలతో నిండిపోయిన ‘ద్వారకామయి’ – (1వ. భాగం)
- మసీదు పుట్టిల్లు…..సాయి@366 ఏప్రిల్ 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments