స్నానాల గదిలో సత్ చరిత్ర పారాయణ మొదటి భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులోని ఒక సాయిభక్తురాలి బాబా అనుభవాన్ని పంచుకుందాము. దానిని ఈ రోజు మీముందు ఉంచుతున్నాను. తన పేరును వెల్లడించవద్దని ఆమె కోరినందువల్ల ఆమెను “సాయి కీ బేటీ” అని ఆమె కోరిక ప్రకారం సంబొధించడం జరిగింది.

ఈ లీల చదివితె మనకి బాబా మీద శ్రధ్ధ ఉండాలనీ, అపరిమితమైన నమ్మకం ఉండాలని తెలియచేస్తుంది. సరియైన స్థలంలో సత్ చరిత్ర పారాయణకు మనకు అవకాశం లేనప్పుడు ఎక్కడ చదివినా గాని మనసులో గాఢమైన శ్రధ్ధ ఉంటే చాలు అని కూడా మనకి తెలియచెస్తుంది.

యదార్ధమైన ఈ సాయి లీలను చదివిన తరువాత, మంత్ర తంత్రాలు ఏమీ లేకుండా నిర్మలమైన మనసుతో బాబాని పూజిస్తే, ఆయన శక్తి ఎటువంటిదో మీకు కూడా అవగతమౌతుందని నాకు బాగా తెలుసు. యిక చదవండి.

శ్రీమతి ప్రియాంకా గారు ప్రచురించిన విధం గానే అనువాదం చేస్తున్నాను.

పాఠకులందరికీ సాయిరాం

ప్రియమైన ప్రియాంకా,

నేను నీకు గుర్తుండే ఉంటాననుకుంటున్నాను. అతి దుర్భరమైన పరిస్తితులలో నేను నిరాశలో ఉన్నప్పుడు నీతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేదానిని. ఆమెనే నేను. అటువంటి సమయంలో నువ్వు నాకు ఎంతో ధైర్యాన్నిచ్చావు. నీకెంతో కృతజ్ఞురాలిని. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు.

నేను బాధలనుభవించిన రోజులలో నా పెద్ద సోదరిలాగా ఉండి నన్నాదుకుని నా వైవాహిక జీవితాన్ని రక్షించినందుకు, బాబా మీద నమ్మకం ఎలా ఉంచుకోవాలో తెలియ చేసినందుకు, నువ్వే కనక నాముందుంటే లేక నేనే కనక భారతదేశంలో ఉండి ఉంటే నేను నీవద్దకు వెంటనే పరిగెత్తుకుని వచ్చి నీకు కృతజ్ఞతలు చెప్పుకునేదానిని.

ప్రియాంకా, మీ పాఠకులందరితోనూ నా ఈ అనుభవాన్ని పంచుకుందామనుకుంటున్నాను. ఇటువంటి లీలను చదివినప్పుడు జీవితంలో ఆశతో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. దయచేసి పాఠకులెవరికీ నా పేరునుగాని, మైల్ ఐ.డీ.ని గాని వెల్లడించవద్దు. నన్ను “సాయి కీ బేటీ” (సాయి కుమార్తె) అని పిలు. వాస్తవంగా చెప్పలంటే నాలుగు సంవత్సరాలుగా నేను నాతల్లి తండ్రులతో మాట్లాడలేదు, వారిని చూడలేదు.

ఆ సమయంలో బాబాయే నాతండ్రి. కొన్ని కొన్ని సమయాలలో ఆయనే నా తల్లిగా నన్నాదుకుని నా కన్నీటిని తుడిచారు. ఆరతిలో చాలా చక్కగా సరిగా చెప్పారు, “ఆప్ మజే ఆయీ, ఆప్ మాజె బాబా” అని. నా అనుభవాన్ని నా మనసులోకి వచ్చిన మాటలతో రాస్తున్నాను. దానిని నువ్వు అవసరమైన చోట సవరించు.

మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబం మాది. బయటి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా, నా తల్లితండ్రులు నాకు చదువుకి, తరువాత ఒక ఆడపిల్లగా యింటి బాధ్యతలు ఎలా నిర్వహించాలో దానికి ఎంతో ప్రాముఖ్యాన్నిచ్చారు. నాకు వివాహమైన తరువాత అమెరికాకి వచ్చాను. అప్పటి నుండే నాకు కష్టాలు మొదలయ్యాయి.
నా భర్త 15 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉన్నారు. తను చిన్నతనంలోనే అమెరికా వచ్చారు. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో ఆయన నమ్మకాలు చాలా బలీయంగా ఉండేవి. ఆయన తల్లి తండ్రులు తనని చాలా క్రమశిక్షణతో పెంచారు. చిన్న చిన్న తప్పులకి కూడా తనని కొడుతూ ఉండేవారు. అందుచేత అదే సరైన పధ్ధతి అనే భావంలో ఉండిపోయారాయన.
వారి కుటుంబాలలో ఈరోజుకీ ఆడదానికి ఏవిధమైన గౌరవం లేదు. కోడళ్ళని చాలా పనికిమాలిన వాళ్ళలాగా చూసేవారు. అందరూ ఇప్పటికీ కూడా పూర్వకాలపు పధ్ధతులనే ఆచరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. వివాహం అయిన తరువాత నేను నా అత్తమామలతో సుమారు సంవత్సరం ఉన్నాను. అప్పటి నుండే నాకు కష్టాలు మొదలయ్యాయి.
నా అత్తగారు నా భర్తకి నన్ను మరొక విధంగా చిత్రీకరించి చెప్పింది. నేను పని తొందరగా చెయ్యననీ, చాలా నెమ్మదిగా చేస్తానని, నేను సోమరిననీ యింకా చాలా చాలా చెప్పింది. యిటువంటి చిత్రీకరణతో నేను అమెరికాకి వచ్చాను. ఒక వారం వరకూ బాగానే ఉంది. అనేక విషయాలలో మాయిద్దరి మధ్య గొడవలూ, యుధ్ధాలు జరగడం ప్రారంభమయింది.
భారత దేశంలో ఉన్న నాతల్లితండ్రులకి, నేను సోమరిననీ, పని చాలా నెమ్మదిగా చేస్తాననీ యిలా నేరాలు చెబుతూ ఉండేవారు. నాకు కొంత సమయం ఇవ్వమని నా తల్లి తండ్రులు సమాధానం చెపుతూ ఉండేవారు. కాని పరిస్తుతులన్నీ క్లిష్ట దశ నుండి అతి క్లిష్టదశకి చేరుకున్నాయి. ఆయన నా తల్లితండ్రులతో దెబ్బలాడుతూ వారిని దూషిస్తూ ఉండేవారు. నా అత్త మామలు కూడా నా భర్త పక్షమే వహించి, తప్పంతా నాదేనన్నట్లుగా మాట్లాడేవారు. అందుచేత నేను వారితో చెప్పడం, మాట్లాడటం మానేశాను.
ఈక్రమంలో రెసిషన్ వచ్చి నాభర్త ఉద్యోగం పోయింది. ఉద్యోగం లేకుండా ఒక సంవత్సరంపాటు యింట్లోనే ఉన్నారు. ప్రతీ చిన్న విషయానికీ కూడా నాతో దెబ్బలాడుతూ నామీద నేరారోపణ చేస్తూ ఉండేవారు. అయ్యో! పనిచేసి అలసిపోయి వచ్చింది తనకీ కొంత విశ్రాంతి కావాలి అని కూడా కనీసం ఆలోచించేవారు కాదు.
పరిస్థితులు బాగా ముదిరిపోయి ఒకరోజు ఆయన నా తల్లితండ్రులతో దెబ్బలాడి, నాకు నా తల్లితండ్రులు కావాలో లేక భర్త కావాలో తేల్చుకోమన్నారు. లేకపోతే విడాకులు ఇచ్చేస్తామన్నారు. ఆరోజు నాహృదయం బాగా గాయపడింది. ఏంచేయాలో తోచలేదు. ఆయనని ఒప్పించడానికి ప్రయత్నం చేశాను కాని వినలేదు.
రేపు తరువాయి భాగం…..

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles