సాయిని తెలుసుకో



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయిని తెలుసుకో

ఈ రోజు సుమిత్ జీ గారి బాబా లీలను తెలుసుకుందాము. బాబా వారు యెవరిని యెప్పుడు యెలా అనుగ్రహిస్తారో, యేరూపంలో వస్తారో మనకి తెలియదు. సచ్చరిత్ర పారాయణ చేసి అందులోని సారాన్ని బాగా జీర్ణించుకున్నవారికే బాగా అర్థమవుతుంది. అందుకనే బాబా వారు సకల ప్రాణులలోను తనని చూడమన్నారు. మనం మన విచక్షణని కూడా కొంత ఉపయోగించాలి.

సుమిత్ జీ గారి లీల వారు చెప్పిన మాటలలోనే……..

నేను శ్రీ సాయిబాబాకు కొత్త భక్తుడిని. మన చుట్టూ సాయిబాబా ఉంటారనటానికి నిదర్శనంగా నేను నా మొదటి అనుభూతిని మీకు చెపుతున్నాను. ఈ రోజులలో నేను చాలా తీవ్రమైన నొప్పితో బాథ పడుతున్నాను. నేనున్న చోటికి గుడి చాలా దూరంలో ఉండటం వల్ల యెప్పుడు అవకాశం వస్తే అప్పుడు బాబా గుడికి వెడుతూ ఉండేవాడిని, అంటే వేరే పట్టణంలో ఉండేది, కాని నేను ప్రతీరోజు బాబాని దర్శనం ఇవ్వమని నాకు మార్గం చూపమని అర్థిస్తూ ఉండేవాడిని.

ఒక రాత్రి బాగా ఉరుములు, మెరుపులతో పెద్ద గాలి వాన వచ్చింది. బయట ఒక కుక్క అరుస్తూ ఉండటం విన్నాను. అది ఒక వీథి కుక్కలా అనిపించింది, కాని ఆస్ట్రేలియాలో యెక్కడా వీథి కుక్కలు కనపడవు. నేను బయటకు వెళ్ళి చూశాను అది ఒక నల్లటి కుక్క అది నావైపు వస్తోంది, 

కాని నేను దానిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి పడుకున్నాను. మరలా పడుకునే ముందు నాకుదర్శనం ఇవ్వమని బాబాని ప్రార్థించాను. నాకు కలలో ఒక నల్లటి శివలింగం 5 సెకండ్లు కనపడింది.

నాకు మెలకువ వచ్చి లేచాను. నేను ఆఫీసుకు వెళ్ళి తిరిగి వచ్చి, ఈ జరిగినదంతా సాయి భక్తురాలయిన నా కాబోయే భార్యకి చెప్పాను. అప్పుడామె, “ఆ చిన్న కుక్కని నిర్లక్ష్యం చేయడం వల్ల నువ్వు బాబాకి సేవ చేసే అవకాశాని పోగొట్టుకుని వుండవచ్చు, యెందుకంటే బాబా గారు యెప్పుడు యేరూపంలో వచ్చి దర్శనం ఇస్తారో నీకు తెలియదు” అంది.

అది వినేటప్పటికి నాకుకొంచెం విచారం వేసింది. కాని ఈ రోజు పూజ అయిన తరువాత నేను బాబా వారిని ఒక ప్రశ్న అడిగాను, పుస్తకంలో వచ్చిన సమాథానం ఇలా ఉంది రెండు వాక్యాలలో “యిద్దరు వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి వస్తారు, నీ జబ్బు నయమవుతుంది”.

నేను మాయింటినించి ఆఫీసుకు వెళ్ళడానికి బయటకు వచ్చాను, రాత్రి నేను చూసిన కుక్క యింకొక చిన్న కుక్కతో నావైపుకు వచ్చింది. ఇది చూడగానే నాకు చాలా సంతోషం వేసింది, కాని పుస్తకంలో నాకు వచ్చిన సమాథానానికి ఈ రెండుకుక్కలకి మథ్యవున్న సంబంథం యేమిటొ నేను అర్థం చేసుకోలేకపోయాను.

లోపలికి వెళ్ళి కొంచెం రొట్టె తీసుకుని వచ్చి వాటికి పెట్టాను, నాకు తృప్తిగా అనిపించింది. నేను ఆఫీసుకు వెళ్ళి కూర్చున్నాక, ఉదయం పుస్తకం లో నాకు వచ్చిన సమాథానానికి, ఈ రెండు కుక్కలు కనపడటానికి యేదో సంబంథం ఉండవచ్చని నాకు తోచింది. ఆ రెండు కుక్కలూ మా పొరుగింటి వారివని కనుక్కున్నాను, కాని నేను వాటినెప్పుడూ ఇంతకు ముందు చూడలేదు.

కొంతమంది దీనిని కాకతాళీయం అనుకోవచ్చు, కాని నేను దీనిని లీల అనే గట్టిగా నమ్ముతున్నాను. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల నేను బాబా అనుగ్రహాన్ని పొందాను. బాబా అనుగ్రహంతో నా చింతలు, అనారోగ్యం నివారింపబడతాయనే మంచి ఆలోచనలో ఉన్నాను.

శ్రీ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

నిరంతరం సాయి చరణాల మీద
సుమిత్

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయిని తెలుసుకో

Maruthi

SaiBaba…SaiBaba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles