కష్టమొచ్చినా సాయిని మరవద్దు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈ రోజు నెల్లూరు నించి సుకన్య గారు సేకరించి పంపిన బాబా లీలని తెలుసుకుందాము. ఈ లీల సాయి భక్తురాలయిన రియా గారు అమెరికానించి పంపించారు.

సాయి సిస్టర్ రియా అమెరికా నించి తమ అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.

కష్టమొచ్చినా సాయిని మరవద్దు

సాయి భక్తులందరి అనుభూతులను ఎన్నిటినో నేను చదువుతున్నాను. మొట్టమొదటిసారిగా నాకు నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. 12 సంవత్సరాలనించి నేను బాబాని సేవిస్తున్నాను. నా జీవితంలో ఆయన చూపించే లీలలు కూడా వృధ్ధి చెందుతున్నాయి. నేను వాటినన్నిటినీ వివరించలేను గానీ,  2010 సంవత్సరంలో నాకు కలిగిన అనుభూతులని వివరిస్తాను.

అమెరికాలో రెసిషన్ వల్ల నాకు ఉద్యోగం పోయింది. 8 నెలలుగా ఉద్యోగం లేకుండా గడిపాను. ఫిబ్రవరి, 2010 లో నా ఉద్యోగం పోయినప్పుడు నేనంతగా బాధ పడలేదు. కారణం సాయి నాతోనే ఉన్నారని నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా. కాని సాయి నా ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నారనుకున్నాను.. మరలా కొత్తగా ఉద్యోగాలకి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నెలలు గడుస్తున్నా నాకు యెవరినించీ కూడా పిలుపు రాలేదు. పిలుపు వచ్చినా గాని ఎటువంటి ఉద్యోగమూ రాలేదు. జూన్/జూలై కల్లా వర్క్ పెర్మిట్ కూడా ఒక సమస్య గా మారింది. నాకు చాలా నిరాశ ఎదురయింది. ఆ సమయంలో గురువార వ్రతము కూడా చేశాను గాని ఏమీ ఫలితం కనిపించలేదు. పరిస్థితులన్నీకూడా దుర్లభంగా మారి, బిల్లులు కట్టడానికి, కారు మీద తీసుకున్న అప్పు తీర్చడానికి కూడా చాలా కష్టమయింది. ఆ సమయములో నా స్నేహితులే నాకు సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాను గాని అవేమీ కూడా నా అవసరాలను తీర్చలేకపోయాయి. ఒకానొక సమయంలో నేనెంతగా కృంగిపోయానంటే అసలు సాయి ఉన్నారా అని అనిపించింది. నా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. కాని ఏమీ ఫలితం కనపడలేదు. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు రావడంతో నేను పూర్తిగా నాశనమయిపోయినట్లుగా అనిపించింది. ఒకనొక సమయంలో పూర్తి నిస్సహాయ స్థితిలో నేను సాయిని కూడా ప్రార్థించడం మానేసాను.  వ్రతాలను చేయడం మానేశాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మానేసాను. కాని నన్ను నేను సమాధాన పరచుకుని సాయినే ప్రార్థించడం మొదలుపెట్టాను. నాకింక సహనం నశించి సాయిని సహాయం చేయమని అర్థించాను. ఆన్ లైన్లో బాబా ప్రశ్నలు సమాధానలలో ప్రశ్నలు అడగసాగాను. అందులో జవాబులో ఏది వస్తే అది అన్నీ చేశాను. ఉదాహరణకి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాను. గుడికి వెళ్ళమంటే గుడికి వెళ్ళాను. ఏది చేయమని వస్తే అదే విధంగా అన్నీ చేశాను.

భాబా సచ్చర్తిత్రలో చెప్పారు, ఏది యెలా జరగాలో అది జరుగుతుంది. తన భౌతిక దేహానంతరము తాను తన భక్తులకు సహాయం చేస్తానని చెప్పారు. సెప్టెంబరు నెల వచ్చేటప్పటికి నాకు ఇక సహనం పోయింది. చిన్న ఆశాకిరణం, నమ్మకం మాత్రమే మిగిలి ఉన్నాయి. నేనెంతగా విసిగి పోయానంటే నేను ఉద్యోగప్రయత్నాలను కూడా మానేశాను. నేనిక ఒకటే చేసాను. సాయి ప్రశ్నలు జవాబులలో ఏది వస్తే అది చేయడానికి సిధ్ధమయ్యాను. నాకెప్పుడూ ఒకే సమాధానం వస్తూ ఉండేది. నవంబరు/డిసెంబరులలో పర్తిస్థితులలో మార్పు వస్తుందని. నాకు నమ్మకం ఉంది. కాని కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అక్టోబరు వరకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అక్టోబరు చివరలో నాకు పెద్ద ప్రమాదం జరిగి (వివరాలను నేను చెప్పదలచుకోలేదు) ప్రాణాపాయాన్నుండి బయటపడ్డాను. నాకివన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి, సాయి నా మొఱ ఎందుకని ఆలకించటంలేదని బాధపడుతూ ఉండేదాన్ని. మెల్లగా, రెండు రోజుల తరువాత సాయి నామీద తన అనుగ్రహాన్ని చూపడం మొదలుపెట్టారు. నన్ను చావునుంచి తప్పించినది సాయే అని నాకు అర్థమయింది. ఆ క్షణంలో నేను, నన్ను రక్షించమని సాయి నామాన్నే స్మరించాను, అప్పుడు నన్ను సాయె కాపాడారు. నవంబరు చివరి వారంలో నాకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కాని దానికి నేనెప్పుడూ అప్ప్లై చేయలేదు. వారు ఆన్ లైన్ లో నా రెజ్యూం చూసి నన్ను యింటర్వ్యూకి పిలవడం జరిగింది. ఇంటర్వ్యూ చాలా కఠినంగా జరిగింది. నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా అని సందేహం వచ్చింది. అయినప్పటికీ నేను సాయిని ప్రార్థించాను. నాకు మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. నా వర్క్ పెర్మిట్ కూడా తిరిగి రెన్యూ చేయబడింది.

నేనిప్పుడు ఇక్కడ పనిచేస్తున్న చోట చాలా సంతోషంగా ఉన్నాను. నేనెప్పటి నుంచో సాయిని పూజిస్తున్నప్పటికీ, ఈ చివరి నెలలలో ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నాను. వాటిని నేను మీతో పంచుకోదలచుకున్నాను.

జీవితంలో మనకందరికీ ఎన్నో సమస్యలు ఉంటాయి. అందరి జీవితాలూ వడ్డించిన విస్తరి కాదు. ఇప్పటికే మనకిచ్చిన వాటిని గురించి మనం సంతోషించి, హృదయాంతరాళలోనించి భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితే మనలో మంచి శక్తి పెంపొందుతుంది. అదే మనకు జీవితంలో మంచిని కలగచేస్తుంది.

నాకేది జరిగినా అది భగవంతుని వల్ల జరిగినదే అని నేను భావించాను. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు నేను విచారిస్తూ ఉండేదానిని. ఇప్పుడు నా దృక్పధంలో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న విషయానికైనా భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు పునర్జన్మ.

నువ్వేదయినా పని జరగాలని కోరుకున్నప్పుడు అది జరగకపోతే, సాయి సహాయం చేయటంలేదు అని భావించద్దు. దానర్ధం మనం అనవసరంగా ఆందోళనపడుతూ ఉంటాము. కాని సమయం వచ్చినప్పుడు సాయి తప్పకుండా సహాయం చేస్తారు. సాయి మీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆయన మృత్యుకోరల నుండి కూడా రక్షిస్తారు.

పరిస్తితులు ఏమయినా కానివ్వండి, మనకోరికలు స్వచ్చమైననవి, తగినవి అయితే సాయి మనవెంటే ఉంటారు. సాయి మనలనెపుడు నిర్లక్ష్యం చేయరు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles