Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి నొకప్రక్క సీతారామలక్ష్మణులును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబా కిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్చి ఊదీ ప్రసాదముతో తన కివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసి కొనెను. శ్యామా, నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు, దానిని తిరగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా యిట్లనెను. “దీని నేల అతని కివ్వవలెను? దీనిని మనమే యుంచుకొందుము. అతడు 25 రూపాయ లిచ్చినచో, తిరిగి వానిది వాని కిచ్చెదము.” ఆ రూపయికొరకు, వామనరావు 25రూపాయలు వసూలుచేసి, బాబా ముందర బెట్టెను. బాబా యిట్లనెను. “ఆ నాణేము విలువ 25 రూపాయల కెంతో హెచ్చైనది. శ్యామా! యీ రూపాయిని దీసికొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ మందిరములో బెట్టి పూజించుము.” బాబా యెందులకీ మార్గము నవలంబించిరో యడుగుట కెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో వారికే తెలియును.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట (ఏకనాథ భాగవతమును – శ్యామా)
- భావూ సాహెబు ధుమాళ్ (ప్లీడర్)
- శ్రీ సాయిబాబా నివేదన శివనేశన్ స్వామికి భోజనమగుట.
- పులి
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments