Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 వ అధ్యాయములు.
బ్రహ్మజ్ఞానము మూడవ భాగము.
ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు తిరిగి “అయ్యా! నీ జేబులోబ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్ల రూపముతో (250)నున్నది.దయచేసి దానిని బయటకు దీయుము” అనెను.
ఆ పెద్ద మనుష్యుడు తన జేబునుంచి నోట్ల కట్టను బయటకు దీసెను.
లెక్కపెట్టగా సరిగ్గా 25 పది రూపాయల నోట్లుండెను.అందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.బాబా సర్వజ్ఞతను జూచి అతని మనస్సు కరిగెను.
బాబా పాదములపైబడి వారి యాశీర్వాదమునకై వేడెను.
అప్పుడు బాబా యిట్లనెను.”నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము.నీ పేరాసను,లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు.ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్మమైయున్నదో,వాడా యభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లు పొందగలడు?అభిమానమనె భ్రమ,ధనమందు తృష్ణ,దుఖమను సుడిగుండము వంటిది.
అది యసూయ యహంభావమను మొసళ్ళతో నిండియున్నది.
ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు.
పెరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధృవముల వంటివి.అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి.
ఎక్కడ పేరాస గలదో యక్కడ బ్రహ్మము గూర్చి యాలోచించుటకు గాని,దాని ధ్యానమునకు గాని తావులేదు.అట్లయినచో పేరాసగలవాడు విరక్తిని,మోక్షమును ఎట్లు సంపాదించగలడు?లోభికి శాంతిగాని సంతుష్టిగాని,ధృడ నిశ్చయముగాని యుండవు.మనస్సునందేమాత్రము పేరాసయున్నను సాధనలన్నియు (ఆధ్యాత్మిక ప్రయత్నములు) నిష్ప్రయోజనములు.
ఎవడు ఫలాపేక్షరహితుడు కాడో,ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వానియందు విరక్తి లేదో యట్టివాడు గొప్ప చదువరియైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది.ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు.
ఎవరహంకారపూరితులో , ఎవరింద్రియవిషయములగూర్చి యెల్లప్పుడు చింతించెదరో ,వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు.
మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము.అదిలేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును.
కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసికొనవలెను.
నా ఖజానా నిండుగా నున్నది.ఎవరికేది కావలసిన దానిని వారికివ్వగలను.కాని వానికి పుచ్చుకొను యోగ్యత గలదా లేదా?యని నేను మొదట పరీక్షించవలెను.
నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు.ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను!”
ఒక యతిథినిఇంటికిబిలిచినప్పుడు,ఇంటిలోనివారు,అక్కడున్నవారు,స్నేహితు లు, బంధువులు గూడ అతిధితో పాటు విందులో పాల్గొందురు.కావున నప్పుడు మసీదులో నున్న వారందరు బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసిన యీ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి.
బాబా యాశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట నున్నవారందురును ,ఆ పెద్దమనిషితో సహ,మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందినవారై వెళ్ళిపోయిరి.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- బ్రహ్మజ్ఞానము ఒకటవ భాగము.
- బ్రహ్మజ్ఞానము రెండవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
- భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-మూడవ భాగము(గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments