Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను.మధ్యాహ్నహారతి పూజ ప్రారంభయ్యెనని గ్రహించిరి.
కనుక శ్యామా,హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి.బాపూసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను.స్త్రీలు మసీదు నిండిరి.దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి.
అందరూ బాజా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి.
బాబాకు కుడివైపు శ్యామా;ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి.వారిని జూచి బాబా హేమాడ్ పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను.
శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు,శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చు ననెను.
బాబా యిట్లనెను: “సరే,మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా?అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము”
గంటల చప్పుడును,మద్దెల శబ్దమును,పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పుటకు ఆతురపడెను.
తాము ముచ్చటించిన దంతయు తనకు చాల ఆనందము కలుగచేసినదనియు ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగచేసినదనియు,దానిని విని బాబాలీలలు అగోచరములని తెలిసికొంటిననియు ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను.
అప్పుడు బాబా “కథ చాలా అద్భుతమైనది.నీవెట్టుల ఆనందించితివి?నాకా విషయమై వివరములన్నియు చెప్పుము”అనిరి.
అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి,యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను.ఇది విని బాబా మిగుల సంతసించెను.
“ఆ కథ నీకు నచ్చినదా?దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?”యని బాబా హేమాడ్ పంతునడిగెను.
“అవును బాబా నా మనశ్చాoచల్యము నిష్క్రమించినది.నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది.సత్యమార్గమును కనుగొనగలిగితిని”అని హేమాడ్ పంతు బదులిచ్చెను.
బాబా యిట్లు చెప్పెను.“నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది! ఈ ఒక్క కథ జ్ఞప్తియందుంచుకొనుము.అది మిక్కిలి యుపయోగించును.
ఆత్మసాక్షాత్కారమునకు ధ్యాన మవసరము.దాని నలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును.
కోరికలన్నియు విడచి నిష్కామివై,నీవు సమస్త జీవరాశియందు గల భగవంతుని ధ్యానింపుము.
మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును.సదా నా నిరాకారస్వభావమును ధ్యానింపుము!అదియే జ్ఞానస్వరూపము,చైతన్యము,ఆనందము.
మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు.అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును.
ధ్యాత,ధ్యానము,ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై,బ్రహ్మముతో నభిన్నమగును.
తల్లి తాబేలు నదికి ఒక యొడ్డున నుండును.దాని పిల్ల లింకొక యొడ్డున నుండును.తల్లి వానికి పాలిచ్చుటగాని,పొదువుకొనుటగాని చేయదు.దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది.చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును.తల్లి తాబేలు చూపు చిన్నవానికి యమృతధారవలె పనిచేయును.అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము.గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే.”బాబా యీ మాటలు పూర్తి చేయుసరికి,హారతి పూర్తియాయెను.అందరు ‘శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై’యని జయజయధ్వానములు చేసిరి.
ఓ ప్రియపాఠకులారా! యీ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి యున్నట్లు భావించి,మనము కూడ ఆ జయజయధ్వనులలో పాల్గొందము.
హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచి పెట్టిరి.బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను.
బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి యిట్లనెను: “ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞాప్తియందుంచుకొనినచో,నీ స్థితి కలకండవలె తియ్యగా నుండును.నీ కోరికలన్నియు నెరవేరును.నీవు సుఖముగా నుందువు.”
హమాడ్ పంతు బాబాకు సాష్టాంగనమస్కారము చేసి, “ఇట్లు ఎల్లప్పుడు నన్ను అనుగ్రహించుము,ఆశీర్వదించుము,కాపాడుము!”అని ప్రార్థించెను.
అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. “ఈ కథను వినుము.దీనిని మననము చేయుము.నిధి ద్యాసనము చేయుము.అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తి యందుంచుకొని ధ్యానించెదవు.భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును.”
ఓ ప్రియమైన చదువరులారా! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను.ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము.దానిని హృదయపూరితముగా సేవించి,ధ్యానించి,మనస్సున నిలిపెదము.ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము.తథాస్తు!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-ఒకటవ భాగము.
- భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-రెండవ భాగము(నిష్ఠ,సబూరి).
- హేమడ్ పంతు (తేలు – పాము)
- హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము
- పాముకాటునుండి శ్యామాను కాపాడుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments