భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-రెండవ భాగము(నిష్ఠ,సబూరి).



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను.

రాధాబాయి యను యొక ముసలమ్మ యుండెను.ఆమె ఖాశాబా దేశ్ ముఖ్ గారి తల్లి.బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి శిరిడీ కి వచ్చెను.బాబాను దర్శించి మిక్కిలి తృప్తిచెందెను.ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను.బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను.

ఆమెకింకేమి తెలియకుండెను.బాబా యామె సంకల్పమును ఆమెదించక తనకు మంత్రోపదేశం చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను.

ఆమె తన బసలో యుండి భోజనము,నీరు మానివేసెను.అట్లు 3 రోజులు గడిచెను.

ఆమె పట్టుదలకు(శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని. “దేవా! మీరేమి ప్రారంభించితిరి? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు.ఆ ముదుసలిని నీవు వెరిగియే యుందువు.ఆమె మిక్కిలి పట్టుదల గలది.ఆమె నీపైన ఆధారపడియున్నది.ఆమె చచ్చువరకు ఉపవసించ నిశ్చయించుకొని యున్నది.నీవు ఆమె ననుగ్రహించి ఉపదేశమిచ్చునంతవర కామె తన నిరాహారదీక్షను మానదు.ఆమె కేమైన హాని జరిగినచోఆమె చచ్చినదని లోకులనెదరు.కాబట్టి యామెను కరుణించుము,ఆశీర్వదించుము,ఆమెకు తగిన దారి చూపుము!”

ఆమె మనోనిశ్చయమును జూచి,బాబా యామెను బిలిపించి,ఈ క్రింది విధంగా బోధించెను:

“ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి;నేను నీ బిడ్డను.

నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము!నాకు నా వృత్తాంతమును చెప్పెదను.నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. 

నాకొక గురువుండెను.వారు గొప్ప యోగీశ్వరులు;మిక్కిలి దయార్ద్రహృదయులు.వారికి చాలా కాలము శుశ్రూష చేసితిని.

కాని వారు నా చెవిలో వారేమంత్రము నూదలేదు.నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను.

నేను వారితోనే యుండుటకు,వారి సేవ చేయుటకు,వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని.

కాని వారి మార్గము వారిది.వారు నా తల గొరిగించిరి;నా నుండి రెండు పైసలు దక్షిణ యడిగిరి.నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని.

‘మీ గురువుగారు పూర్ణకాలమైనచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల?’ అని అడుగవచ్చును.దానికి సమాధానము సూటిగా చెప్పగలను.వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు.ధనముతో వారు చేయునదేమున్నది?

వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ,రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి! నేనీ రెంటిని వారి కర్పించితిని.వారు ప్రసన్నులైరి.

“నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని.వారే నన్ను పెంచిపోషించిరి.భోజనమునకు గాని వస్త్రములకుగాని నాకు లోటులేకుండెను.వారు పరిపూర్ణులు.వారు ప్రేమావతారమని చెప్పవచ్చును.ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను?వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు.ఆ విధమైన గురువే యుండరు.నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగా జూచుచుండెడి వాడను.మేమిద్దరమానందములో మునిగెడివారము.రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టి నిగిడ్చితిని.వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను.వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను.వారే నా యాశ్రమము.నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది.ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస.
‘సబూరి’(సంతోషస్థైర్యములతో కూడిన ఓరిమి)యనునది రెండవ పైసా.నేను మిక్కిలి సంతోషముతో చాలాకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని.
ఈ ప్రపంచమనే సాగరమును సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును.సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము.అది పాపములన్నిటిని తొలగించును;కష్టములను పారద్రోలును.తుదకు జయమును కలుగజేయును.
సబూరి యనునది సుగుణములకు గని,మంచి యాలోచనకు తోడువంటిది.

నిష్ఠ,సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి.

“నా గురువు నా నుండి యితరయేమియు ఆశించియుండలేదు.

వారు నన్ను ఉపేక్షించక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడివారు.నేను వారితో కలిసి యుండెడివాడను.

ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను,వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు.వారు తమ దృష్టి చేతనే నన్నుకాపాడుచుండెడివారు.తల్లితాబేలు,పిల్లతాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు.తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును.పిల్లలెదిగి పెద్దవి యగును.అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిల్పి,నన్ను ప్రేమతో గాపాడిరి.

ఓ తల్లి! నా గురువు నాకు మంత్రం మేమియు నుపదేశిoచలేదు.అటువంటపుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను?గురువుయొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము.మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుండిగాని పొందుటకు ప్రయత్నించకుము.

నీ యాలోచనలు,నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము.నీవు తప్పక పరమార్థమును పొందెదవు.

నావైపు సంపూర్ణహృదయముతో చూడుము.నేను నీవైపు అట్లనే చూచెదను.

ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను.నిజము తప్ప మరేమియు మాట్లాడను.

ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు.

నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము.గురువే సర్వమును చేయువాడనియు,కర్తయనియు పూర్తిగా నమ్ముము.ఎవరయితే గురువు యొక్క మహిమను,గొప్పదనమును గ్రహించెదరో,ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు!”

ఈ ప్రకారముగా ఉపదేసించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను.ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదులుకొనెను.

ఈ కథను జాగ్రత్తగాను,శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును,సందర్భమును గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను.

ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను.సంతోషముతో నుప్పొంగెను.గొంతుక యారిపోయెను.ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను.

శ్యామా అతని నీ స్థితిలో జూచి “ఏమి జరిగినది?ఏల యూరకున్నావు?అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను?”అని అడిగెను.అదే సమయంలో మసీదులో గంట మ్రోగెను.

మిగతాది తరువాయి భాగములో పొందుపరచితిమి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles