Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై!! శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)
తేలు :– బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి రెండు గ్రంధములు భాగవతమును, భావార్థరామాయణమును నిత్యము పారాయణ చెయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు గూడ శ్రోత యయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించుభాగము చదువునపుడు వినువారందరు మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపయి కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్ధముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండ తన యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి తోటలో పారవైచెను.
పాము :– ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి. అది యెటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- హేమడ్ పంతు అను బిరుదునకు మూలకారణము—audio
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము
- భక్త పంతు
- శనగల కథ (హేమాడ్ పంతు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments