అమీరు శక్కర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

కోపర్ గాం తాలుకాలో కొరేలా గ్రామనినాసి అమీరు శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్ళవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషదము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా యనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. ఆందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగ 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్ గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్ళు కావలెననగా, అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీని కావిషయ మేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను, పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని యారాత్రియే యచటనుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా “ఓ అబ్దుల్! నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది.” యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యమువలన, బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. (బాబా అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను.) అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles