బాలాసాహెబు మిరీకర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలా సాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలత్ దారుగా నుండెను. చితిలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. ఆతని యోగ క్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. “నీకు మన ద్వారకామాయి తెలియునా?” బాలా సాహెబునకు బోధపడక పోవుటచే అతడూరకుండెను. “నీ విప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరయితే యామె తొడపయి కూర్చొనెదరో యామె వారిని కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబరభక్తులకు తల్లి. వారిని కష్టములనుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో, వారి కష్టము లన్నియు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీప్రసాద మిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా యిట్లనెను. “నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము” ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాముపడగవలె వంచి, “అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకా మాయిబిడ్డల నేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా, ఆ సర్పమేమి చేయగలదు?” అనెను.

అక్కడున్న వారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహల పడుచుండిరి. కాని బాబా నీవిషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితళీవెళ్ళి యానందించు మనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామ కూడ తనవెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన, రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను. బాబా యిట్లనెను. “సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు.”

ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంట రమ్మనెను. శ్యామా బాబావద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముపామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామాకూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles