Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 వ అధ్యాయములు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బతిమాలెను.ఆ కథ యిచ్చట చెప్పుదును.
సకలైస్వర్యముల ననుభవించుచున్న ధనికుడొకడుండెను.అతడిండ్లను ధనమును , పొలమును, తోటలను సంపాదించెను.అతనికి అనేకమంది సేవకులుండెడివారు.
బాబా కీర్తి అతని చెవుల పడగనే శిరిడీకి పోయి బాబా పాదములపైబడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను.తనకు వేరేమియు వలదనియు,బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియు చెప్పెను.
ఆ స్నేహితుడిట్లనెను: “బ్రహ్మజ్ఞానమును సంపాదించుటఅంత సులభమైన పని కాదు.ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము.ధనము, భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటివానికి బ్రహ్మజ్ఞానము నెవరిచ్చెదరు? నీవొక పైసయయిన దానము చేయనివాడవే! నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు?”
తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక, రానుపోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు శిరిడీకి వచ్చెను.
మసీదుకు పోయి , బాబాను జూచి వారి పాదములకు సాస్టాంగ నమస్కారము చేసి యిట్లనెను: “బాబా! ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును జూపెదరని విని నేనంత దూరము నుంచి వచ్చితిని.ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని .మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును”.
బాబా ఇట్లు బదులు చెప్పెను :”నా ప్రియమైన స్నేహితుడా! ఆతుర పడవద్దు.త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును జూపెదను .నాది నగదు బేరమే గాని యరువు బేరము కాదు.అనేకమంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగానివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు.నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును నివ్వుమని అడుగువారు చాల తక్కువ.ప్రపంచ విషయములు కావలెనని అడుగువారికి లోటు లేనే లేదు.పారమార్ధికవిషయమై యోచించువారు మిక్కిలి యరుదు.కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని యడుగు సమయము శుభమైనది; శ్రేయోదాయకమైనది.కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించినవాని నన్నింటిని జూసెదను.”
ఇట్లని బాబా అతనికి బ్రహ్మమును జూపుటకు మొదలిడెను.అతనిని అక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దించెను.అప్పటి కాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను.ఒక బాలుని బిలిచి నందుమార్వాడి వద్దకు బోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను.కుఱ్ఱవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటివద్ద లేడనియు వాని ఇంటి వాకిలికి తాళము వేసి యున్నదని చెప్పెను.
కిరాణాదుకాణాదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను.ఈసారి కూడ కుఱ్ఱవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను.
ఇంతకిద్దరుముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను.
సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతరామేయని మనకు తెలియును.అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్నమొత్తముతోనేమి పనియని ఎవరైనా అడుగవచ్చును.వారికి ఆ డబ్బు అవసరమే లేదు.నందు మరియు బాలా ఇంటివద్ద లేరని వారికి తేలిసియేయుండును.ఇది యంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చినవాని కొరకై జరిపించి యుందురు.
ఆ పెద్దమనిషి వద్ద నోటుల కట్ట యుండెను.అతనికి నిజముగా బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలసి యున్నచో ,బాబా యంత ప్రయాసపడుచున్నప్పుడు అతడూరకనే కూర్చుండడు.బాబా యా పైకమును తిరిగి యిచ్చి వేయునని కూడ అతనికి తెలియును.అంత చిన్న మొత్తమయినప్పటికిని అతను తెగించి యివ్వలేకపోయెను.అట్టివానికి బాబా వద్దనుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట! నిజముగా బాబా యందు భక్తి ప్రేమలు కలవారెవరైనను వెంటనే 5 రూపాయలు తీసి యిచ్చియుండునే కాని ప్రేక్షకునివలె ఊరకే చూచుచు కూర్చుని యుండడు.ఈ పెద్దమనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను.
అతను డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వుమని తొందరపెట్టుచుండెను.
అప్పుడు బాబా యిట్లనెను: “ఓ మిత్రుడా! నేను నడుపుచున్నదానినంతటిని గ్రహించలేకుంటివా యేమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును జూచుటకై యిదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయ మిది .బ్రహ్మమును జూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి యేవన: –
1. పంచప్రాణములు;
2. పంచేంద్రియములు;
3. మనస్సు;
4. బుద్ధి;
5. అహంకారము.
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు బోవు దారి కఠినమైనది.అది కత్తివాదరవలె మిక్కిలి పదునైనది.
అట్లనుచు బాబా యీ విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను.వానిని క్లుప్తముగా తరువాయి భాగములో పొందుపరచితిమి:
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బ్రహ్మజ్ఞానము మూడవ భాగము.
- బ్రహ్మజ్ఞానము రెండవ భాగము.
- భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-ఒకటవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ ఒకటవ భాగం.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బ్రహ్మజ్ఞానము ఒకటవ భాగము.”
kishore Babu
September 20, 2017 at 7:25 amసాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా.