Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
బ్రహ్మజ్ఞానము రెండవ భాగము.
శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 వ అధ్యాయములు.
అట్లనుచు బాబా యీ విషయమునకు సంబంధించిన సంగతులన్నియు జెప్పెను.వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరచితిమి:
బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునునకు యోగ్యత.
అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు.దానికి కొంత యోగ్యత అవసరము.
1.ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక
ఎవరయితే తాను బద్ధుడనని గ్రహించి బంధనములనుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వారు ఆధ్యాత్మికజీవితమున కర్హుడు.
2.విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందినగాని పారమార్ధికరంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.
3.అంతర్ముఖత(లోనికి జూచుట)
మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు.కనుక మనుష్యుడెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని ఆత్మసాక్షాత్కరము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడవలయును.
4.పాప విమోచన పొందుట
మనుష్యుడు దుర్మార్గమార్గమునుండి బుద్ధిని మరలించనప్పుడు,తప్పులు చేయుట మాననప్పుడు,మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడ ఆత్మసాక్షాత్కరమును పొందలేడు.
5.సరియయిన నడవడి
ఎల్లప్పుడు సత్యమును పలుకుచు,తపస్సు చేయుచు,లోన జూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మసాక్షాత్కరము లభించదు.
6.ప్రియమైనవాని కంటె శ్రేయస్కరమైన వానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి.ఒకటి మంచిది ;రెండవది ప్రీతికరమైనది.
మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది.
రెండవది ప్రాపంచికవిషయములకు సంబంధించినది.
ఈ రెండును మానవుని చేరును.
వీనిలో ఒకదానినే అతడెంచుకొనవలెను.
తెలివిగలవాడు మొదటిదానిని అనగా శుభమైనదానిని కోరును.
బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.
7.మనస్సును ఇంద్రియములను స్వాదీనమందుంచుకొనుట
శరీరము రథము;
ఆత్మ దాని యజమాని ;
బుద్ధి ఆ రధమును నడుపు సారధి;
మనస్సు కళ్ళెము;
ఇంద్రియములు గుఱ్ఱములు;
ఇంద్రియ విషయములు వాని మార్గములు.
ఎవరికి గ్రహించు శక్తీ లేదో ,ఎవరి మనస్సు చంచలమయినదో,ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱముల వలె)వాడు గమ్యస్థానమును చేరలేడు.చావుపుట్టుకల చక్రములో పడిపోవును.
ఎవరికి గ్రహించుశక్తి గలదో ,ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో , ఎవరి యింద్రియములు స్వాదీనమందుండునో(బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు; విష్ణుపదమును చేరగలడు.
8.మనస్సును పావనము చేయుట
మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ,ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని యెడల నతని మనస్సు పావనము కాదు.
మనస్సు పావనము కానిదే యతడు ఆత్మసాక్షాత్కరము పొందలేడు.
పావనమైన మనస్సులోనే వివేకము(అనగా సత్యమైనదానిని యాసత్యమైన దానిని కనుగొనుట)వైరాగ్యము(అసత్యమైన దానియందభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కరమునకు దారితీయును.
అహంకారము రాలిపోనిదే,లోభము నశించనిదే,మనస్సు కోరికలను విడచిపెట్టనిదే,ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు.
దేహమే ‘నేన’ నుకొనుట గొప్ప భ్రమ.ఈ యభిప్రాయమందభిమాన ముండుటయే బంధమునకు కారణము.నీవాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో యీ అభిమానమును విడువవలెను.
9.గురువు యొక్క యావస్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమునైనది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాసించలేరు.
కనుక ఆత్మసాక్షాత్కరము పొందిన యింకొకరి(గురువు)సహాయము మిక్కిలి యవసరము.
గొప్ప కృషి చేసి,శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువు నుండి పొందవచ్చును.వారా మార్గమందు నడచియున్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీదనుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.
10.భగవంతుని కటాక్షము
ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది.
భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమునుండి తరింపజేయగలడు.
“వేదము లభ్యసించుటవల్ల గాని మేధాశక్తి వల్లగాని పుస్తక జ్ఞానమువల్ల గాని యాత్మానుభూతి పొందలేరు.ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే యాత్మ స్వరూపమును తెలియజేయు”నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.
ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా యా పెద్దమనుష్యుని వైపు తిరిగి “అయ్యా! నీ జేబులోబ్రహ్మము యాబదింతలు 5 రూపాయల నోట్ల రూపముతో (250)నున్నది.దయచేసి దానిని బయటకు దీయుము” అనెను.
మిగతాది తరువాయి భాగము లో పొందుపరచితిమి.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
[catlist name=”శ్రీ సాయిసచ్చరిత్రము”]
Latest Miracles:
- బ్రహ్మజ్ఞానము మూడవ భాగము.
- బ్రహ్మజ్ఞానము ఒకటవ భాగము.
- భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-రెండవ భాగము(నిష్ఠ,సబూరి).
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “బ్రహ్మజ్ఞానము రెండవ భాగము.”
kishore Babu
September 21, 2017 at 6:14 amWe are very thankful to Maruthi ji…..please give elaborated explanation about the topics in Sai satcharitra so that Baba devotees can enjoy,
Maruthi Sainathuni
September 21, 2017 at 12:31 pmIt’s my pleasure.sure kishore gaaru. Sai Baba…Sai Baba