Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఇప్పుడు మనము సాయిలీల పుస్తకంలో పి.యు.జయశ్రీ , బెంగళూరు వారు వ్రాసినది. సెప్టెంబరు 1986, లో ప్రచురింపబడిన ఊదీ ఘనతను గూర్చి చెప్పుకుందాము.
బాబా గారు చెప్పిన మాటలు: “నన్ను నమ్మండి. నేను లేనని ఆందోళణ చెందవద్దు. నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయి. నా సమాధి మీకు, నమ్మకాన్ని, ఆశను ఇస్తుంది.”
బాబా గారి చరణాలకు నమస్కరిస్తూ ఈ అనుభవాన్ని మీకు చెపుతున్నాను.
ఈ సంఘటన 1974 లో జరిగింది. అప్పుడు నా తమ్ముడు సాయినాథ్ వయసు ఒక సంవత్సరము. మేము అందరము మధ్యాహ్నము భోజనాలు చేసిన తరువాత విశ్రాంతి తీసుకుంటున్నాము. చిన్న పిల్లవాడయిన సాయినాథ్, ఒక బకెట్లో నిండుగా ఉన్న నీటితో ఆడుకుంటున్నాడు. కొంతసేపయిన తరువాత మా అమ్మగారు వాడి కోసం వెళ్ళి చూసేటప్పటికి బకెట్లో పడిపోయి ఉన్నాడు. వాడి కాళ్ళు మాత్రమే పైకి కనబడుతున్నాయి. శరీరం లోపలికి మొత్తం నీరు వెళ్ళిపోయింది. మేము అన్నివిధాలుగా కృత్రిమ శ్వాస కల్పించాము. కాని యేమి ఫలితం యివ్వలేదు. మేమంతా ఆశ వదులుకున్నాము.
అప్పుడు, మా తాత గారు, అమ్మమ్మగారు వాడిని బాబా ఫోటో ముందు పడుకోబెట్టి, నోటిలో కొంచెం ఊదీ వేసి, వళ్ళంతా ఊదీ పూసారు. వెంటనే వాడు ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు మేమంతా ఎంత సంతోషించామో మీరే ఊహించుకోండి.
ఇప్పుడు సాయినాథ్ ఆరవ స్టాండర్డ్ చదువుతున్నాడు. మేమంతా 1980 లో షిరిడీ వెళ్ళాము.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఊదీతో లక్ష్మణరేఖ
- చనిపోయిన బిడ్డ తిరిగి వచ్చింది–Audio
- శ్రీ సాయి సచ్చరిత్రను చదువుతూ ప్రాణం విడిచేలా వరమివ్వు నాకింకేమి వద్దు
- బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి–Audio
- బాబా “స్లీపెర్ బెర్త్ ఏర్పాటు చేసారు” మరియు “మరణం తలుపు తట్టిన భక్తుని తల్లికి తిరిగి జీవం పోసారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments