హేమద్‌పంత్ – 1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

హేమద్‌పంత్- 1

మానవుడు తరించడానికి ఎన్నో మార్గాలు ఉండవచ్చు. ఈ మానవ జీవితం ఎన్నో లక్షల జన్మల తరువాత మనకు సంప్రాప్తించ వచ్చని మన శాస్త్రాలు చెప్తాయి. ఈ వచ్చిన జీవితాన్ని సార్ధకం చేసుకోమని ఎందరో మహానుభావులు బోధించారు.

పరమాత్మే గురువుగా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహానుభావుల చరిత్రలు చదవడం అనేది ఒక తేలికైన మార్గం. వీరి గురించి తెలుసుకుని ఆ గ్రంథాలు పారాయణం చేయడం ముక్తికి సోపానం.

సాయి పరమాత్ముని చరిత్ర ఎందరి జీవితాలలోనో మార్పులు తీసుకువచ్చి వారిని ముక్తి మార్గంలో నడిపించడం జరిగింది. అటువంటి చరిత్రను రాయడానికి సాయినాధుడు స్వయంగా హేమడ్‌పంత్‌ని ఎన్నుకోవడం అనేది ఆయన పూర్వ జన్మల పుణ్యఫలం. మనకు ఒకసారి పారాయణం చేస్తేనే ఫలితం వ్యక్తమవుతుంటే, హేమద్‌పంత్ గారు సాయి సచ్చరితను అందరికి అందించడం వలన ఆయనకు తప్పక బాబా సద్గతిని ప్రసాధించి ఉంటారు.

సచ్చరితలాంటి ఉత్తమ గ్రంథాలను పారాయణం చేయడమే కాకుండా దాన్ని ఇతరులకు సాయి ప్రసాదంగా పంచగలిగితే ఎంత అదృష్టమో మనం వేరే చెప్పనక్కరలేదు. మనం ఎంతో ధనాన్ని మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాము. కాని ఇటువంటి మంచి పనులకు మన ధనాన్ని ఉపయోగించగలగడం కూడా అదృష్టమే.

మనం కావ్యాలు, గ్రంథాలు రాయలేకపోవచ్చు, కాని వాటిని మనం పారాయణం చేయవచ్చు. అలాగే వాటిని వేరే ఎవరికైనా బహుకరించవచ్చు. ఇటువంటి కోవకే చెందిన ఈ సాయి సచ్చరితను మనకిచ్చిన ఆ మహానుభావుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జననం, కుటుంబ వివరాలు, ఉధ్యోగ వివరాలు

హేమద్‌పంత్ గారి అసలు పేరు అన్నాసాహేబ్ దాబోల్కర్. ఆయన 1859 లో పేద ఆర్యగౌడ కుటుంబంలో జన్మించారు. ఆయన ధానా జిల్లాలో ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తాత, తండ్రి ఇంకా ఇతర తరాలవారు ఆచార సంపన్నులు. మిక్కిలి దైవభక్తి గల కుటుంబం. ఆయన ప్రాథమిక విద్య వారి గ్రామంలోనే అయ్యింది. తరువాత పూనాలో 5వ తరగతి వరకు చదివి ఇంగ్లీషు (ఆంగ్ల భాష) నేర్చుకున్నారు.

ఆయన ఆర్ధిక పరిస్థితి సరిగా లేక ఇక ఆ పైన చదువు చడవడం కష్టం అయింది. తరువాత బడిపంతులుగా వాళ్ళ ఊరిలోనే ఉధ్యోగంలో చేరారు. కాని ఆయనలో కష్టపడే మనస్థత్వం, పట్టుదల ఉండదంతో ఆయన స్వంతంగా మరాఠి భాషలో, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సంపాధించారు. ఆయన తెలివితేటలు చూసి ఆయనకు గ్రామాధికారి ఉద్యోగం ఇచ్చారు.

 తరువాత ఒక గుమస్తాగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి ఒక మెజిట్రేట్‌గా రిటైర్ అయ్యారు. ఇలా ఎంత మందికి సాధ్యపడుతుంది. ఉన్నత విద్య లేకుండా ఉన్నత అధికారిగా ఎదగడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయనకు ఒక కుమారుడు, 5 గురు కూతుళ్ళు ఉన్నారు. అందరికి చక్కగా పెళ్ళిళ్ళు అయి సాయికృపతో సుఖ సంతోషాలతో ఉన్నారు.

తొలిదర్శనానికి అడ్డంకులు

మనలో కొంతమందికి రజో గుణము ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. మనకి జీవితంలో పైకి ఎదగాలి అనే పట్టుదల ఉంటుంది. అలానే మనము చేసే పనులలో కూడా, మన అహంకారము బయటపడుతూ ఉంటుంది. నేను దీన్ని కష్టపడి చేసాను. నా చేతుల మీదగానే ఇది జరగాలి అన్న భావనలు స్పష్టంగా వ్యక్తమవుతాయి.

హేమద్‌పంత్ జీవితాన్ని చూస్తే ఆయన కేవలం 5వ తరగతి వరకు చదివినా కష్టపడి ఉన్నత అధికారి పదవికి ఎదిగారు. తనలో పాతుకు పోయిన ఆలోచనలే బాబా తొలి దర్శనానికి అడ్డుగా నిలిచాయి.

ఆయన పూర్వజన్మ పుణ్యం వల్ల నానా చందోర్కర్ మరియు ధీక్షిత్ ఆయనకు స్నేహితులు అయ్యారు. నానా బాబా గురించి ఎన్నోసార్లు హేమద్‌పంత్‌కు చెప్పారు. ధీక్షిత్ కూడా బాబా యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. కాని హేమద్‌పంత్‌లో ఏమి చలనం లేదు. బాబా పట్ల నమ్మకం రాలేదు. కాని వాళ్ళు చెప్పడంతో షిర్డి వెళ్దామని నిర్ణయించుకున్నాడు.

అంతలో ఒక స్నేహితుడి కుమారుడు జబ్బునపడ్డాడు. ఎంత వైద్యం చేయించినా ప్రయోజనం లేక చివరకు ఆ స్నేహితుడు తన గురువు దగ్గరకు వెళ్తాడు. ఆ గురువు సమక్షంలో ఆయన కుమారుడు ప్రాణాలు వదులుతాడు. ఇదంతా చూసి హేమద్‌పంత్ షిర్డి ప్రయాణాన్ని నిలిపివేస్తాడు.

కొన్ని రోజుల తరువాత మరల వెళ్దామని అనుకుంటే దీక్షిత్ కుమార్తె చనిపోతుంది. ఇది చూసి బాబా తన స్నేహితుడి కుమార్తెను రక్షించలేదని గురువుల వల్ల ఏమి ఉపయోగం అని నిరుత్సాహ పడతాడు. ఈ విధంగా రెండోసారి కూడా షిర్డి వెళ్ళలేక పోతాడు.

మనలో ఉన్న వాసనలు ఒక జన్మలోనివి కావు. ఎన్నోజన్మల నుండి మనల్ని వెంటాడి వేదిస్తాయి. వాటికి మనం బానిసలు అవుతాము. మనము జీవితంలో ఖచ్చితంగా ఉన్నామని భావిస్తాము. కాని ఈ భావాల వెనుక అహంకారం ఉంటుంది. ఇవి మనల్ని మోసం చేస్తాయి.

మనం ఆదర్శంగా, ధర్మంగా ఉన్నామని భావిస్తాము. కాని దీనిలో రజో గుణం మెండుగా ఉంటుంది. ఈ రజో గుణమే మన ప్రగతికి అడ్డుపడుతుంది. గురుకృపకు దూరం చేస్తుంది. మనము సత్వ గుణంతో మసలుకొని గురువులకు శరణాగతి చెయ్యనిదే వారి అనుగ్రహం మనకు లభించదు.

ఒకవేళ వారు మనల్ని కరుణించినా మనము తప్పులు చేస్తూనే ఉంటాము. కాని గురువు మాత్రము ఓపికగా మన వెంట ఉండి మనల్ని రక్షిస్తారు. కాని మన మూర్ఖత్వంతో మన పయనానికి మనమే అడ్డుగా నిలబడతాం. హేమద్‌పంత్ సదాచార సంపన్నుడు. నిత్యము భక్తితో దైవాన్ని పూజిస్తారు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణం చేసారు. గురు చరిత్రను కూడా చాలాసార్లు చదవారు కాని గురువుల పట్ల అవగాహన ఏర్పడలేదు.

ఇక మూడోసారి నానాచందోర్కర్ స్వయంగా హేమద్‌పంత్‌కు హిత బోధ చేసారు. ఒకసారి నానా బొంబాయి వెళ్ళి కొంచెం సమయం ఉండడంతో హేమద్‌పంత్‌ని కలిసారు. ఆయన షిర్డి వెళ్ళడానికి ఎందుకు సంశయిస్తున్నాడో తెలపమని ఒత్తిడి చేస్తాడు. అప్పుడు హేమద్, గురువు పట్ల తన ఆలోచనలు వ్యక్తం చేస్తాడు. అప్పుడు నానా ఈ విధంగా చెప్తారు.

నేను నీ లాగే దేన్ని గుడ్డిగా నమ్మేవాడిని కాదు. కాని సాయి అందరిలాంటి వాడు కాదు. సాయి చేసిన లీలలు, మహిమలు నన్ను పూర్తిగా మార్చాయి. ఆయన సమక్షంలో అమితమైన ఆనందం కలుగుతుంది. మన కర్మలు అడ్డుపడితే మనము మహాత్ముల దర్శనం చేసుకోలేము. కాని నీవు తప్పకుండా బాబాని కలవాలి అని ప్రేరేపించారు. ఇది కూడా బాబా లీలే.  నానా ద్వారా హేమద్‌పంత్‌లో మార్పు తీసుకువచ్చారు.

రేపు తొలి దర్శన అనుభూతి

ఈ సమాచారం ఈ  లింక్ http://saiarathi.blogspot.com/2015/09/1.html ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles