బాబా లాకెట్ మరలా బాబాయే బహుమతిగా ఇచ్చుట .. అమిత్–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

 ఈ రోజు శ్రిమతి  ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగులోని బాబా లీలను తెలుసుకుందాము.

బాబాయె మన అంతిమ గమ్యం. ఆయన అన్ని ప్రాణుల జీవితాలకి భద్రత కలిగిస్తారు అప్పటికీ దేనినీ కూడా తన స్వాథీనంలోనే ఉందని భావించలేదు. బాబా తన భక్తులకి నిస్వార్థమైన ప్రేమని అందించారు.

సాయి భక్తులందరూ సాయి సచ్చరిత్రను యెంతో భక్తితోను, ప్రేమతోను చదివారని నాకు ఖచ్చితంగా తెలుసు. కాని మీ కెప్పుడైనా బాబా సశరీరంగా ఉండగా యెలా జీవించారో ఆలోచించారా.. అవును, ఆయన మనతో ఉన్నపుడు బాబా ఈ ప్రపంచంలో యెలా ప్రవర్తించారో మనం తెలుసుకోవాలి.

కాని అప్ప్డప్పుడు మనం మన రోజువారీ కార్యక్రమాలలో నిండిపోయి ఆయన చెప్పిన బోధనలని ఆచరించడానికి మనం శ్రథ్థ కనపరచం.

బాబా పూర్తిగా అహంకార రహితుడు. ఆయనెప్పుడు సుఖాన్ని, బాథను పట్టించుకోలేదు.

ముఖ్యంగా ఆయనను నిందించినా కూడా వాటికెపుడు ప్రభావితం కాలేదు. ఆయన ఆలోచనలో స్థిరంగా ఉంటారు

నేనిప్పుడు సోదరుడు అమిత్ పంపిన వాస్తవమైన బాబా లీలను ప్రచురిస్తున్నాను. , ఇప్పుడాయన  సాయిలీలను మనతో పంచుకోవడానికి ముందుకు వచ్చారు.

యింతకుముందు నేను పంపిన లీలను ప్రచురించినందుకు నా ధన్యావాదములు. మీరు మంచి సేవ చేస్తూ మేము మంచి మానవులుగా ఉండటానికి,  మాలో నమ్మకాన్ని పెంచి, బాబాకు దగ్గరవడానిని సరియైన మార్గాన్ని సూచిస్తున్నారు.

బాబా మన సాయి భక్తులందరినీ దీవించుగాక. ఈ కింద ఇస్తున్న లీలని ప్రచురించవలసిందిగా కోరుతున్నాను.

తన భక్తులు కష్టాలలో ఉన్నప్పుడెల్లప్పుడూ ఆదుకుంటూ దయ కురిపించే మన సాయిబాబాకి కోటి కోటి ప్రణామాలు.  2010 లో నా తల్లిదండ్రులు షిరిడీ వెళ్ళారు.

షిరిడీ నుంచి రెండు సాయిబాబా లాకెట్లు, ఒకటి మా అబ్బాయికి, యింకొకటి మా అమ్మాయికి తెమ్మని వారికి చెప్పాను. వారు సింగపూర్ వచ్చినప్పుడు వాటిని మాకందచేశారు.

ఆరోజు మా అమ్మాయి పుట్టిన రోజు. ఉదయం పూజ అయిన తరువాత వాటిని తాడులో గుచ్చి మా అమ్మాయి, అబ్బాయి మెడలో వేశాము.

సాయంత్రం మా కుటుంబమంతా సాయి దర్శనానికి బాబా గుడికి వెళ్ళారు. నేను ఒక గంట ఆలశ్యంగా వారిని కలుసుకున్నాను.

అక్కడికి వెళ్ళాక మా అమ్మాయి మెడలో బాబా లాకెట్ యెక్కడొ పడిపోయి తాడు మాత్రమే మిగిలి ఉందని గమనించాను.

గుడి బాగా రద్దీగా ఉంది, లాకెట్ కూడా చాలా చిన్నదవడం వల్ల, నా భార్య, తల్లిదండ్రులు యెంతవెతికినా కనిపించలేదు, బహుశా గుడి బయటే పడిపోయి ఉండచ్చనుకున్నారు.

ఆరోజు మా అమ్మాయి పుట్టిన రోజు కూడా కావడంతో మేమంతా చాలా విచారించాము. నేను దర్శనం లైనులో ఉన్నాను,

ఏకధాటిగా బాబా ని మనసులో బాబా నువ్వెప్పుడు మంచి కోసం సహాయం చేస్తూనే ఉంటావు .. నాకు తెలీదు నువ్వు పోయిన లాకెట్ ని మాత్రం నాకు తిరిగి తెచ్చివాలి సాయి ..అని ప్రార్థించాను.

బాబా కి వంగి నమస్కారం చేసుకుని ఆరతిని కళ్ళకద్దుకున్నాను. ఒక పెద్ద విచిత్రం..

నా ముందే ఒక భక్తుడున్నాడు..అతను కింద తివాసీ మీద నుంచి ఏదో తీసి దానిని తన బొటన వేలు/వేళ్ళతో పట్టుకుని ఉన్నాడు (నాకిస్తున్నట్లుగా ఉంది భంగిమ) . బాబా దయకి కృపకి నేనమితానందాన్ననుభవించాను.

సాయినాధ్ మహరాజ్ కి జై ఆయనెప్పుడూ తన భక్తుల మొఱలను ఆలకిస్తూ ఉంటాడు.

సద్గురు సాయినాధ్ మహరాజ్ కి

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles