Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
దీప గర్భవతి అయింది. మాది ప్రేమ వివాహం అందుకని పెద్దవాళ్ళు తనని రానివ్వలేదు. కడుపుతోటి ఉంటూ తను ఏడుస్తూ ఉండేది.
ఎందుకంటే మా పెళ్లి అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా దీప వాళ్ళ వాళ్ళు వాళ్ళింటికి రానీయలేదు, తనూ వెళ్ళలేదు.
ప్రెగ్నెంట్ గా ఉంది కాబట్టి తానుగా పనులు చేసుకోలేక అవస్థ పడుతూ ఉండేది. ముందు ఒకసారి 4, 5 నెలల తర్వాత గర్భం పోయింది.
అందుకని ఈ సారి జాగ్రత్త అవసరమని డాక్టర్ చెప్పగా వారానికి 2000 రూపాయల ఇంజక్షన్ (హార్మోన్స్) వాడాల్సి వచ్చింది.
నా పరిస్థితి అప్పులతో ఉండగా, వారానికి 2000 కట్టాల్సి రావడంతో నాకు మరింత కష్టం గా మారింది. దానికి కూడా దీప చాల బాధ పడుతుండేది.
నేను నా స్టూడెంట్ దగ్గర (వాళ్ళ అమ్మ గారు నాకు బాగా తెలుసు) 2 లక్షలు అప్పు తీసుకున్నాను, దానికి వడ్డీ గా నేను వాళ్ళకి 3000 రూపాయలు ఇచ్చేవాడిని.
వాళ్ళ కిదే ఆధారం, ఇంకేమి లేదు. ఆ స్తూడెంట్ ఒక సారి రెండు రోజుల సెలవులకి మా ఇంటికి వచ్చింది.
3 రోజులు, వారం రోజులు, 15 రోజులు అయినా కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లడం లేదు.
నాకే ఏంటో మొహమాటం అనిపించి ” ఎమ్మా ! ఇంటికి వెళ్లు ఇన్ని రోజులు ఇక్కడ వుంటే మీ మావయ్య వాళ్ళు ఏమైనా అంటారేమో పద నిన్ను దింపేస్తాను అని కారులో తీసుకు వెడుతున్నాను.
ఆ అమ్మాయి సడన్ గా ఏడవడం మొదలు పెట్టింది . ” ఎందుకమ్మా ఏడుస్తున్నావు ? అంటే ” అన్నయ్యా! బాబా చెప్పొద్దన్నాడు కాని నేను చెప్పేస్తున్నాను.
నువ్వు నాకు ఒక బాబా విగ్రహం ఇచ్చావు కదా! (నేను విగ్రహాలు నా స్టూడెంట్స్ కి తెలిసిన వాళ్లకి ఇవ్వడం అలవాటు) ఆ విగ్రహానికి బట్టలు వేసి, అన్నం పెట్టి సేవ చేస్తున్నాను . ”నీకు ఉద్యోగం అవసరమా” అన్నాడట బాబా (ఆ అమ్మాయి ఉద్యోగ ప్రయత్నం లో ఉంది) బాబా ముందు కళ్ళు తెరిచాడు అన్నా!” అంది . నేను అవునా ! కళ్ళు తెరిచాడా అన్నాను.
తర్వాత ”నోరు తెరిచాడు అంది” అవునా ” నోరు తెరిచాడా ” అన్నాను.
సరే !ఉద్యోగం అవసరమా అని అంటే మరి నువ్వేమి అన్నావు” అని అడిగాను. నాకు భయం వేసి మరి నన్నేమి చేయమంటావు ? అన్నాను.
వాడి (భాను) వెంటపడి అంతా తిరుగుతారు, వాడు మీకు ఏం కావాలంటే అది పెట్టిస్తాడు, వాడు మీ బాగోగులు చూస్తుంటాడు మరి వాడికి సాయం చేయరా! మీరు అన్నాడు.
”నన్నేమి చేయమంటావు ? అందట” ఈ అమ్మాయి, వెళ్లు! వాడికి సాయం చెయ్యి ! ఈ విషయం ఎవరికీ చెప్పకు అన్నాడు బాబా.
భానన్నా! అందుకే నేను వచ్చాను. అమ్మకి చెప్పే వచ్చానన్నా! అంది.
అంతే! నాకింక ఏడుపు ఆగలేదు ఎందుకు బాబా నా మీద అంత ప్రేమ నీకు, తల్లి కంటే కూడా ప్రేమ! అంతే, బండి వెనక్కి తిప్పేసాను.
ఇంటికి వచ్చేసాము, దీపకి విషయం చెప్పాను. తను ఏడుపు బాబా ఇంతలా చేస్తాడా! అంటూ. ఆ అమ్మాయి మాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఆలా మాకు చేస్తూ ఉండిపోయింది.
”నీకు ఉద్యోగం నేను చూస్తాను ముందు వాడికి సేవ చెయ్యి అన్నాడు” బాబా, ఆ అమ్మాయితో. పని మనిషి బట్టలు ఉతకడానికి గొడవ చేస్తుంటే వాషింగ్ మెషిన్ తెస్తానంటూ బయలుదేరాను ఓ రోజు.
ఆ రోజు బయట అరుగు మీద ఒక అతను కాగితాలు ఏరుకుంటూ కనపడ్డాడు,”సాయి రామ్ బాబా ”అన్నాను. ( నా కెందుకో ఆలా ఎవరైనా కనపడితే వెంటనే ఆయన బాబానే అనిపిస్తుంది) సాయి రామ్ అన్నాడతను.
”మీరు ఎక్కడుంటారు ?” అన్నాను. ఎక్కడైనా ఉంటాను అన్నాడు. ”మా ఇంటికి వస్తారా బాబా” అన్నాను. దూరమా? అన్నాడు,
”దూరమో దగ్గరో నిన్ను నడిపిస్తానా బాబా రా వచ్చి కారులో కూర్చో” అన్నాను.
ఆయన తన మూటలన్నీ సర్దుకొని నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ”దీపా మీకో surprise” అంటూ దీపకి ఫోన్ చేశాను, వాషింగ్ మెషిన్ తీసుకు వస్తున్నానని అనుకున్నారట ఇంట్లో, ఇంటికి ఈయన్ని తీసుకువెళ్లాను.
అప్పుడు దీపకి 3 వ నెల నువ్వు భజన చేస్తావు కదా భజనలు చేస్తూ పో !, మంచి కొడుకు పుడతాడు, ఇంట్లో అంతా బాగా జరుగుతుంది. నువ్వు భజనలు చేస్తూ పో అన్నాడు.
ఎమన్నా తినమంటే టీ కావాలన్నాడు. టీ ఇచ్చింది దీప, టీ తాగాడు, వెడతానన్నాడు, ఎక్కడ వదలమంటావు అన్నాను. ఎక్కడ నుంచి తెచ్చావో అక్కడే వొదులు అన్నాడు .
మాకు నెలకు 30,000 రూపాయల ఖర్చు వస్తుంది మందుల వల్ల. షిరిడి లో బాబాకి బట్టలు ఇచ్చి రమ్మనమని ఒకాయన నన్ను పంపాలనుకున్నారు.
నేను బయలుదేరుతుంటే దీప నేను వస్తానంది. అప్పటికి తనకి 6 వ నెల, వద్దు అన్నాను.
కానీ వినలేదు, సరే రమ్మన్నాను. రైల్లో ఒక బెర్త్ దొరికింది, అది దీపకి ఇచ్చి నేను రెండు బెర్తుల మధ్యలో దుప్పటి పరుచుకొని పడుకున్నాను, ఆలా షిరిడి చేరాము.
శిరిడి లో ఆటో ఎక్కాము, నిలబడి కళ్ళు తిరిగి పడిపోయిందట, బయటికి వచ్చాక చెప్పింది.
”ఏం కాదులే దీపా! ఆటో లో ఎత్తి కుదేసినప్పుడు ఎదో జరిగి ఉంటుంది, అది కాస్తా బాబా రిపేర్ చేసి ఉంటాడు ” అన్నాను .
ఇంటికి వచ్చాక హాస్పిటల్ కి వెళ్ళాము నేను కూడా లోపలికి వెళ్లి (గుమ్మంలో నన్ను ప్రతిసారి ఒక డాక్టర్ అడ్డంపడి ఆపుతుంటుంది. ఈ సారి దాటుకొని లొపలకి వెళ్ళాను) ” ఏమయింది ?ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా? అని అడుగుదామని ” నేను వెళ్ళాను .
” మేము మొన్న శిరిడి” అంటూ నేను చెప్పబోయాను, ఆవిడ చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చి ”ఎక్సలెంట్ ” అంటుంది, ఇంకా ఆవిడా ఆలా అనేసరికి నా నోరు మూతపడిపోయింది.
” ఎలా ఉందండి ” అన్నాను, చాలా బావుంది అంటూ ”ఇందాకేదో శిరిడి” అంటున్నారు అంది.
నేను జరిగింది చెప్పాను నన్ను ఎప్పుడు అడ్డగించే డాక్టర్ కూడా వచ్చి గుమ్మంలో నిలబడి వింటోంది.
బాబా గురించి చాలా సేపు మాట్లాడుకున్నాము. ”ఏమైనా లీలలు జరిగాయా” అంటూ గుమ్మంలోని డాక్టర్ అడిగింది.
”మొన్ననే బాబా మా ఇంటికి వచ్చి మీకు అబ్బాయి పుడతాడు అంటూ చెప్పాడు. మరి మీరు ఇప్పుడు చెప్పాలి అవునో , కాదో ”అన్నాను .
”చెప్పకూడదు కదా” అంది నవ్వుతూ. ఆవిడ భర్త కూడా పిల్లల డాక్టర్.
మేము ఇంటికి వచ్చాక ఆ గుమ్మంలో నిలబడ్డ డాక్టర్ నాకు ఫోన్ చేసి ” మీ ఇల్లు ఎక్కడ” అంది.
నేను చెప్పాను, అంతే ముగ్గురు డాక్టర్స్ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు బాబా భక్తులు, వాళ్ల జీవితాలలోని బాబా చేసిన చమత్కారాలన్నీ చెప్పారు.
నన్ను ఇంకా బాబా లీలలు గురించి అడిగారు. నేను చెప్పాను, చాలా సేపు మాట్లాడుకున్నాక వెళ్లిపోయారు.
రాత్రి 10 : 30 కి ఆ గుమ్మం డాక్టర్ ఫోన్ చేసింది ,”భానూ గారు మీకో సంగతి డాక్టర్ గారు చెప్పామన్నారు , ఇప్పటి నుండి డెలివరీ అయ్యేదాకా మీ దగ్గర నుండి ఒక్క పైసా కూడా తీసుకోవద్దు అని చెప్పామన్నారు” అన్నారు.
అంతే !మేమిద్దరమూ ఏడ్చేసాము. అప్పటికి 7 వ నెల వచ్చింది , ” బాబా మన మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నాడు.
నువ్వు బాబా ని తండ్రి అంటావుకదా, ఇప్పుడు నీకు 7 వ నెల వచ్చింది, సహజంగా 7 వ నెల వచ్చాక ఆడపిల్ల పుట్టింట్లో ఉండాలి, అంటే ఖర్చంతా తండ్రి భరించాలి కదా!
నీకు తండ్రి బాబాయే అంటావుగా అందుకని ఆయనే ఖర్చంతా భరించాలి అనుకుంటున్నాడులా ఉంది” అని చెప్పాను దీపకి.
9 వ నెల నిండాక సిజేరియన్ అయ్యింది, పండంటి బాబు పుట్టాడు. అంతా బాబా దయ.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni.
Latest Miracles:
- నీ సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి, బాబాయే నీకు అన్నీ చూపిస్తాడు, అని భక్తున్ని దీవించిన కృపా నిధి గురువు గారు
- పాలరాతి విగ్రహం కావాలనుకుంటే, పంచలోహ విగ్రహం గా ఇంటికి వచ్చిన బాబా …!
- “సాయి, ఆ వుంగరాలు అన్ని మీరే తీసేసుకున్నారా! నేను ధన్యురాలను తండ్రి”
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “నీకు తండ్రి బాబాయే అంటావుగా అందుకని ఆయనే ఖర్చంతా భరించాలి అనుకుంటున్నాడులా ఉంది”
Sai Baba
February 13, 2020 at 8:59 amఈ బాబా వారి లీల మనస్సుని కుదిపేస్తోంది …Thank you for your collection Lakshmi Narasimha Rao garu