తుంగభధ్ర తట వాసినే నమః …..సాయి@366 మే 10….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


శ్రీ బి.వి.నరసింహ స్వామిగారు సాయిబాబాను ”ఓం గోదావరి తట షిరిడీ వాసినే నమః ” అని కీర్తిస్తారు అష్టోత్తర శత నామావళిలో.

మహాసమాధి అనంతరం సాయి తెలుగు ప్రాంతాలలో మందిరాలు నిర్మింపచేసుకున్నాడు.

తొలినాటి సాయి మందిరాలలో ఒకటి తుంగభద్ర నదీ తీరం వద్ద గల కర్నూలులోనిది.

అసలు తుంగభద్ర నదీ తీరానికి సాయిబాబా రావటం ఒక విశేషం కాదు. సాయి ఆరతులలో ”నిర్మల నది తుంగ జల ప్రాసి” అని కీర్తించటం ఈనాటిది కాదు.

ఈ ఆలయ కర్త శ్రీ కె. వీరాస్వామిగారు ఆయన శ్రీమతి అన్నపూర్ణమ్మగారు 1949లో షిరిడీ వెళ్ళి, ఆ తరువాత అప్పటి కర్నూలు బస్‌స్టాండ్‌ వద్ద చిన్న పాకవేసి సాయి పూజ చేయటం ప్రారంభించారు.

ఒక రోజు పూజ చేసే సమయంలో శ్రీ సమర్థ నారాయణ స్వామి అనే మహనీయులు అటువైపు వచ్చారు.

ఆయన ఒక చోటును చూపి అచ్చట సాయి మందిరాన్ని నిర్మింపుమని శ్రీ వీరాస్వామిని కోరారు.

1949లో ఆలయ నిర్మాణం మొదలైంది. సాయి సహచర విద్యార్ధిగా చెప్పబడే బ్రహ్మశ్రీ హిమవత్‌ పర్వత ఋషి బాల సన్యాసి మే 10, 1949న ఆలయానికి శంకుస్థాపన చేశారు.

ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహం ఆగ్రాలో తయారై పాకిస్తాన్‌కు వెళ్ళి అక్కడ నుండి నాగర్‌కర్నూలుకు వెళ్ళి తరువాత కర్నూలుకు చేరింది.

ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ మందిరం దక్షణ షిరిడీగా ఖ్యాతి పొందింది.

ఈ ఆలయాన్ని గూర్చి పలువురు పలుగాథలు చెబుతారు.

1954లో తెలుగు ప్రఖ్యాత రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్‌గారు కర్నూలులో పనిచేసేవారు.

ఆయనకు నాస్తిక భావాలుండేవి. ఒకసారి ఆయన భార్య శకుంతల దేవి ప్రసవం నిమిత్తం కర్నూలు ఆసుపత్రిలో చేరింది.

ప్రసవం కష్టమవుతున్నది. సాయి మందిరం ప్రక్కనుండి వెళ్తూ అప్రయత్నంగా ”సాయిబాబా సర్వ శక్తిమంతుడైతే నా భార్య ప్రసవం వెంటనే జరగాలి” అనుకున్నారు.

ఆయన ఆసుపత్రి చేరేలోగా ఒక ఫకీరు వచ్చి గోపీచంద్‌గారి భార్యను ” బిడ్డా! భయం లేదు. సుఖ ప్రసవమవుతుంది” అని దీవించారు.

ఆమె నుదుట ఊదీపెట్టి, నీరు త్రాగించారు. సుఖ ప్రసవమైంది. ఆ బిడ్డడికి సాయిచంద్‌ అనే నామకరణం చేశారు.

నేడు మే 10. ఆ తుంగభద్ర తటవాసిని ధ్యానించెదము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles