Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మాత ఆనందమాయిని దర్శించటానికి ఎందరో వచ్చేవారు. వారిలో ఒక ధనికురాలు సేవకురాలైన గంగను బయట ఉంచి తాను మాత్రం అమ్మను దర్శించి, సేవించేది.
సేవకురాలు గంగ, మాతను దర్శించాలని తపించిపోయేది. ఒక రోజున ఒక కిటికీలో నుండి అమ్మను దర్శించి పొంగిపోయింది గంగ.
అదే సమయంలో గంగ తన లాకెట్ ను పారవేసుకుంది. యజమానురాలు మరునాడు గంగను బయటనే ఉంచి, మాతను దర్శించింది.
“ఎవరో ఈ లాకెట్ ను పారేసుకున్నారు ఇక్కడకు వచ్చి తీసుకోండి” అంది ఆనందమాయి ఆ లాకెట్ ను చూపిస్తూ.
గంగ యజమానురాలు ఆ లాకెట్ గంగదని గ్రహించి, ఆమెను లోపలకు పిలిపించింది.
ఆనందమాయి గంగను తన దగ్గర కూర్చోపెట్టుకుని ఆత్మీయంగా మాట్లాడసాగింది.
“ఏం చదువుకున్నావ్?” అడిగింది అమ్మ. “ఏమీ చదువుకోలేదు” అని బదులిచ్చింది గంగ, “ఐతే నువ్వు, నేను ఒకటే అన్నమాట” అంది అమ్మ చనువుగా.
గంగ యజమానురాలు అమ్మకు తన గృహంలో ఎన్నో పూజలు చేసేది. అమ్మ “పూజను చేసేవారేకాదు, పూజ చేయటానికి తోడ్పడినవారు కూడా భక్తి ఫలాలను పొందుతారు” అంది. గంగకు ఎంతో సంతోషమైంది.
సాయిబాబా కూడా శ్రీరామనవమినాడు ఒక ముదుసలి భక్తురాలిని తనవద్దకు రప్పించుకుని దీవించారు. మాతాజీ సిద్ధులను, అద్భుతాలను గూర్చి ఎంతగానో చెప్పుకుంటారు.
ఒక కుటుంబంవారంతా మాతాజీ భక్తులు. ఆ కుంటుంబంలో ఒక బాలిక మాతాజీని పరీక్షింపదలచుకున్నది.
ఆ బాలిక సంగీతం నేర్చుకుంటున్నది. మాతాజీ ముందు పాటలు పాడాలని, అనేక గీతాలతో పాటు ఒక పాటను ఎంతో కృషితో సాధనచేయసాగింది.
ఆ కుటుంబంవారు మాతాజీని దర్శించినప్పుడల్లా మాతాజీ ఆ బాలికవైపు చూచేదికాదు. ఆ బాలిక ఎంతోకాలం నిరీక్షించింది.
తాను మాతాజీముందు పాటపాడదామని, ఆ పాటలను నేర్చుకుంటోందని మాతాజీకి తెలియదా? మాతాజీ ఆ పట్టణం నుండి వెళ్ళిపోయే చివరి రోజు వచ్చింది.
ఆ బాలికతోపాటు కుటుంబమంతా అమ్మ దర్శనానికి వచ్చింది. ఈసారి మాతాజీ ఒక్కక్కరినే వేలు చూపి, వారినివచ్చి పాట పాడమంది. వారు పాడారు.
ఆ పాటల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. మాతాజీ సామాన్యురాలే, ఆమెకు శక్తులు మహిమలు లేనేలేవు అనుకుంది.
అందరూ మాతాజీకి పాదనమస్కారం చేసుకుంటున్నారు. ఆ బాలికవంతు రాగానే మాతాజీ “అప్పుడే పోనక్కరలేదు. కాసేపుండు” అని “నువ్వు నా దగ్గర పాడదామని నేర్చుకుంటున్నవే, ఆ పాటపాడు” అని ఆ బాలికవంక చూచి నవ్వింది.
ఆ బాలిక నివ్వెరపోయింది. ఈ అకస్మాత్తు సంఘటన ఆ బాలిక కన్నుల వెంట నీరు తెప్పించింది. ఆనందంతో కూడిన పశ్చాత్తాపధారలు ఆనందమాయి పాదాలను కడిగాయి.
మాతా ఆనందమాయి పోస్టల్ స్టాంపు విడుదలైన దినం నేడే మే 1 (1987).
అమ్మను స్మరిద్దాం…ఆమె మాటను అనుసరిద్దాం. “కొత్తగా ఇంతకన్నా మేలుగా ఉండే ప్రపంచాన్ని సృష్టించాలనే ఆకాంక్షవద్దు”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎన్నటికీ వీడని బంధం …..సాయి@366 డిసెంబర్ 19….Audio
- బాబావారు యిచ్చిన లాకెట్లు–Audio
- నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో! …. మహనీయులు – 2020… జూన్ 24
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- నల్లని వాడ! నేను ఫ్రెంచ్ మహిళనోయ్! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments