Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతుల బాల్యనామం శివరామకృష్ణయ్య.
త్యాగయ్య పూర్వీకుల వలె ఆంధ్ర దేశము నుండి తమిళనాడు చేరినవారే.
ఈయన కాంచీ జగద్గురువు పరమశివేంద్రుల శిష్యుడు. ఈయన కాంచీపురం వచ్చే నానా దేశ పండితులను వాదంలో ఓడించేవాడు.
గురువులు “నీవు వాక్ నియమం ఎప్పుడు చేసుకుంటావు?” అన్నారు సదాశివునితో. “ఇప్పటినుండే మౌనం పాటిస్తాను” అని శపథం చేసి జీవితాంతం మౌనం పాటించారు.
సాయి కూడా వాదనలకు దిగవద్దని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను హెచ్చరించేవారు.
పుదుక్కోట మహారాజు ఈయనను అర్ధించాడు. ఈయన ఇసుకపై దక్షిణామూర్తి మంత్రం ఉపదేశించారు. రాజుగారు ఆ ఇసుకలను ఎత్తించి బంగారు పెట్టెలో భద్రంచేసాడు.
ఈయనను ఒకసారి పిల్లలు అక్కడికి వందమైళ్ళ దూరంలో ఉన్న మధురలో జరిగే ఉత్సవాలను చూపించమని కోరారు.
ఆ పిల్లలను కనులు మూసుకొమ్మన్నారు. కొన్ని క్షణాల తరువాత ఆ పిల్లలు మధురలో జరిగే ఉత్సవాలను చూసారు. తిరిగి ఊరు చేరుకొని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు.
వారు కూడా సంతోషించారు. ఈ విషయాన్ని ఒక యువకుడు నమ్మలేదు. సదాశివబ్రహ్మేంద్రులవద్దకు ఆ యువకుడు వచ్చాడు.
తనకు కూడా ఆ ఉత్సవం చూపమని అడిగాడు. మరుక్షణమే అతడు మధురలో ఉన్నాడు. ఉత్సవాలను చూశాడు.
అయితే సదాశివబ్రహ్మేంద్ర సరస్వతి ఎక్కడున్నాడు గుర్తించలేకపోయాడు. కాలినడకన తిరిగి రావలసివచ్చింది. నమ్మినవారికి ఫలముంది.
ఒకసారి సదాశివబ్రహ్మేంద్రులవారు సంచారం చేస్తూ ఒక పంటపొలం దగ్గరకు వచ్చారు.
ఆయనను దొంగగా భావించి స్వామిపై కర్ర ఎత్తాడు ఒకడు. కర్ర ఎత్తిన వాడు కర్ర ఎత్తినట్లే ఉండిపోయాడు.
సదాశివబ్రహ్మేంద్రులు ధ్యానం ముగిసిన తరువాత సంగతి తెలుసుకుని చిరునవ్వు నవ్వాడు. ఆ మనిషి మామూలు మనిషి అయ్యాడు, సదాశివబ్రహ్మేంద్రులకు క్షమాపణ చెప్పాడు. సదాశివబ్రహ్మేంద్రులకు క్షమాపణలు అవసరమా?
బ్రహ్మముతప్ప ఏదీ పట్టని ధ్యాన స్థితిలో దిగంబరిగా శారీరక స్పృహలేకుండా ఉండేవారాయన.
సదాశివబ్రహ్మేంద్రులు ఇష్టపడి నేరూరులో సజీవ సమాధి చెందారు. ఆ దినం వైశాఖ శుద్ధ దశమి (సామాన్యంగా మే మాసంలో వస్తుంది).
అయన చెప్పినట్లుగా 9వ దినాన తన సమాధిపై బిల్వ వృక్షం పొటమరించింది.
12వ దినాన కాశీ నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగం తెచ్చి ఇచ్చాడు. సమాధికి అతి సమీపంలో దానిని ప్రతిష్టించారు.
“అజము, అక్షరము, అద్వైతము, అనంతము, నిశ్చలమైన పరబ్రహ్మను ధ్యానించేవారికి, దుఃఖ తాపాలను త్యజించిన వారికి, సచ్చిదానంద బ్రహ్మను భజించువారికి, వేద వేదార్థ సహితమైన సదాశివ పరమహంస గీతాలు పాడుకునే వారికి సందేహమూ, ద్వైదీ భావము ఉండవు” .
“పిబరే రామరసం, రాసనే! పిబరే రామరసం…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- యోగ కళాప్రపూర్ణ …. మహనీయులు – 2020… జూన్ 16
- భయభక్తులు…. మహనీయులు – 2020… మార్చి 2
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
- సువాసనలంటే మక్కువా! …..సాయి@366 మే 4….Audio
- దొంగల్లో దొంగ…. మహనీయులు – 2020… నవంబర్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments