Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక రోజు నేను అభిషేకానికి గుడికి వచ్చి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మీద బాబా కనపడ్డాడు. ”నువ్వు షిరిడి నుండి ఎప్పుడు వచ్చావు?” అని అడిగాను.
”నేను అన్ని చోట్లా ఉంటాను. అన్ని జీవరాశులలోను ఉంటాను. ఆకాశంలోనూ, చెట్టులోనూ, అందరిలోనూ నేను ఉంటాను” అని నా నెత్తిన తన చెయ్యి ఉంచి, ”సాధన బాగా చెయ్యి” అని ఆశీర్వదించి, తల నిమిరాడు.
ఇంతలో ఒక మెరుపు లాగా వచ్చింది, అందులో బాబా మాయం అయిపోయారు. నాకు కళ్ల నీళ్లు ఆగలేదు. మనసు నిండా సంతోషం, దుఃఖం, భయం, బాధ, ఆశ్చర్యం, అన్ని రకరకాలుగా కలిగాయి.
బాబా ఎంత గొప్ప మహిమాన్వితుడు. బాబా ఎప్పుడు నాతోటే ఉంటాడు. బాబా భజనలు జరుగుతుంటే, ఆయన కూడా అందులో ఉండి, భజనలు పాడతాడు.
బాబా విగ్రహాన్ని చూసిన కొద్దీ, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఆయన సుందర రూపం చూసిన కొద్దీ, ఆకలి డప్పులుండవు. ఆనంద పారవశ్యంతో ఒళ్ళు పులకరించి పోతుంది.
ఒక రోజు ఒకావిడ గుడికి వచ్చి గుడికి వచ్చే కొందరు ఆడవాళ్ళూ కలిసి సాయి నామం భజన జరుగుతూంటే మమ్మల్ని అందర్నీ అక్కడికి తీసుకువెళ్ళింది.
మాకు ఆ ఏరియా అంతగా తెలియదు. వాళ్ళింటికి వెళ్ళాక భజనలు చేసారు. బాబా నామం చేసారు. అంతా బాగా జరిగింది.
తీర్థ, ప్రసాదాలు (భోజనాలు) అయిపోయిన తర్వాత, మేము ఇక్కడ నుండి వెళ్లిన వాళ్ళం దారి తప్పిపోయాం, ఏటో సందులన్నీ తిరుగుతున్నాము, ఒక మలుపు తిరుగుతూంటే, ఒక ముసలాయన, గడ్డం ఉంది, ఒక ఎడ్ల బండితో వచ్చి, ఆపి నన్ను, రంగనాయకమ్మ గారిని బండి ఎక్కమన్నాడు.
మేము ఎటుపోవాలో చెప్పాము, నేను బండిని అటే తీసుకుపోతున్నాను, ఎక్కమన్నాడు.
సరే అని ఇద్దరమూ ఎక్కాము, ఒక రెండు కిలోమీటర్లు వచ్చాము, ముందు రంగనాయకమ్మ గారి ఇల్లు వచ్చింది, మమ్మల్ని ఇద్దరినీ దించేసాడు, మేము బండి దిగి పది అడుగులు వేసి, వెనక్కి చూసాము, ఒక మెరుపులాగా వచ్చి, అందులో బండితో సహా ఆ ముసలాయన మాయం అయిపోయాడు.
దారి తెలియక తిక మక పడుతున్న మమ్మల్ని ఇంటి దగ్గర దింపడానికి ఆ బాబాయే స్వయంగా వచ్చి మమ్మల్నిద్దరినీ ఇంటి దగ్గర దింపాడు.
ఒక రోజు గుడిలో కొంతమంది ఎప్పుడూ చదువుతున్నట్లే ”శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం” చేస్తున్నాము. నేను కళ్ళు మూసుకున్నాను, అంతే! బాబా నా కళ్ల ముందు ప్రత్యక్షమైనాడు.
ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఆయన్ని చూస్తున్నాను. ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాను.
ఆయన్ని అలా చూసేసరికి, నాకు దుఃఖం ఆగలేదు. ఆనందంతో దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది, నాకు ఈయన తోడు లేకపోతే నేనేమై పోదును.
నాకన్నీ ఆయనే, తల్లి, తండ్రి, గురువు, దైవం, అక్క, అన్న ఇంతెందుకు నాకన్నీ ఆయనే. మా ఫామిలీ మెంబెర్ బాబా,
ఈ ఆలోచనలతో పారాయణం అయిపోయినా కూడా నేను అక్కడ నుండి లేవలేదు, కనీసం కదలటం కూడా లేదు. ఏడుపు ఆపటం లేదు.
అప్పుడు రంగనాయకమ్మ గారు, మరో అక్క అందరూ నన్ను లేపి ఓదార్చారు.
అప్పటినుండి బాబా అంటే మరింత ప్రేమ, మరింత నమ్మకం కలిగింది.
అప్పటినుండి బాబా విగ్రహంలో వైపు చూస్తుంటే ఆయన విగ్రహంలో నుండి నన్ను చూడటం, నవ్వటం నాకు తెలుసు. నాకు కొండంత అండగా బాబా ఉన్నాడన్న ఊహే నాలో కొత్త శక్తి వస్తున్నట్లుగా ఉండేది,
బాబా పాదాలని పట్టుకుంటే, పాదాల నుండి పైకి ముఖం వరకు చూస్తుంటే, అటు ఇటు షేక్ అయినట్లు అయి, మెరుపులు వైబ్రేషన్స్ వస్తాయి.
బాబా సర్వాంతర్యామి. అణువణులో నిండి నిమిడీకృతం అయి ఉంటాడు. బాబా తన గుడిలో అటు ఇటు తిరుగుతూ అందర్నీ గమనిస్తూంటాడు.
బాబా ఉన్న చోట సుగంధం వాసనలు, పరిమళాలు వెదజల్లుతాయి. ప్రేమతో మనం బాబాని చూస్తుంటే, బాబా మనల్ని చూస్తారు.
నా ప్రతి అడుగులోను, బాబానే స్మరిస్తాను. ప్రేమ స్వరూపుడు సమర్ధ సద్గురువు బాబా మన కుటుంబంలో ఒక సభ్యుడుగా ఉంటాడు.
మనకి బాబా, ఒక ఇంటి పెద్దగా అన్ని పనులు బాబాయే చూసుకుంటాడు. మనచేత చేయిస్తాడు.
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- కలలో బాబా నిజ సమాధి దర్శనం
- భక్తురాలకి కలలో ద్వారకామాయి దర్శనం చేయించిన బాబా వారు
- బాబా స్వప్న దర్శనం….
- పారాయణ ఫలం బాబా స్వప్న దర్శనం
- సామాన్యుడు కి VIP దర్శనం ఇచ్చిన బాబా ;
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “సశరీరులుగా బాబా దర్శనం …………సాధనతో సాధ్యం ……..!”
Sai Baba
May 2, 2020 at 7:40 pmAbsolutely, this miracle resembles jammer miracle.
Baba assured Ramgirbuva that you need not worry, as everything would be provided for you.
Then Baba came with tanga and helped him to reach the jamner.
Likewise in the above miracle also, Baba came in the form of old man with bulls cart and gave the lift to them.
Since Baba is completely sit in her heart. So she can see Baba in every movement. This fortune is only available to very few devotees.
Sai Baba
May 2, 2020 at 7:48 pmఖచ్చితంగా, ఈ అద్భుతం జమ్నార్ లీలని తలపిస్తుంది.
రామ్ గిరి బువా ని బాబా ఆందోళన చెందవద్దు, ప్రతిదీ నేను సమకూరుస్తాను అని అభయం ఇచ్చారు.
అన్నట్లుగానే టాంగా వాని రూపము లో వెళ్లి బువాని జమ్నార్ చేరుస్తారు.
అలాగే ఫై లీలలో భక్తురాళ్లను కూడా, ముసలి వాని రూపం లో వచ్చి, ఎద్దుల బండిలో వారిని గమ్యాన్ని చేర్చారు.
బాబా ఆమె లో అంతర్లీనము అయ్యారు కాబట్టి, ఆమె ప్రతి కదలికలో బాబా ని చూడ కలుగుతుంది. ఈ అదృష్టము చాల కొద్దిమంది భక్తులకి మాత్రమే లభిస్తుంది.