Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా కీర్తనకారులలో దాసగణు ప్రసిద్దుడైనట్లు,
వేంకటేశ్వరుని కీర్తనకారులలో తాళ్ళపాక అన్నమయ్య సుప్రసిద్ధుడు.
అన్నమయ్యగారి వార్ధక్యంలో పురందరదాసువారు వచ్చి “మీరు సాక్షాత్తు వేంకటేశ్వరుని అవతారము” అన్నారు.
అన్నమయ్య వెంటనే “మీరు సంధ్యవార్చుకోవటానికి ఆ స్వామితోనే నీళ్ళు తెప్పించుకున్న భాగ్యశాలురు” అన్నారు పురందరదాసును.
వెంకటేశ్వరునిపై భక్తిభావం నెలకొన్న తరువాత ఆయన రోజుకొక్క కీర్తన చొప్పున వేంకటేశ్వరస్వామి మీద వ్రాయాలని నియమం పెట్టుకున్న అంకిత భక్తుడు అన్నమయ్య.
ప్రతి కీర్తన భగవద్భక్తి ప్రతిపాదకమే. అవి విశిష్టాద్వైతపరంగా ఉన్నా, సాంఘిక, సామాజిక సమభావన కానవస్తుంది.
అనేక క్షేత్రాలను ఆయన దర్శించాడు. భగవదనుగ్రహంతో వాక్సుద్ధి కలిగింది.
ఒకనాడు వేంకటేశ్వరస్వామికి నైవేద్యంగా పెట్టిన మామిడిపండ్లు పుల్లగా ఉండటం గమనించి, ఆ చెట్టుపండ్లు తియ్యనివగుగాక అనగానే తియ్యని పండ్లయినాయి.
ఒక వ్యక్తి తన కూతురు వివాహానికి అన్నమయ్యను ధనం యాచిస్తే ఒక మహారాజు ఇవ్వగలిగినంత ధనాన్ని సమకూర్చాడు.
అన్నమయ్య వేంకటేశ్వరుని నిద్రనుండి మేల్కొల్పుతాడు. ‘పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా’ అని వేడుకుంటాడు.
ఎందుకంటే వేంకటేశ్వరుడు వింత వింతలైన విన్నపాలు ఆయన వినాలి కదా!
పండితులనే కాదు పామరులను, జానపదులను ఆకట్టుకునేట్టు ఉంటాయి అన్నమయ్య కీర్తనలు.
‘వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని” అనే కీర్తనలో జానపద శైలిలో ఒకరితో ఒకరు మాట్లాడుకునేట్లు ఉంటుంది.
“పొడగంటి పొడగంటి మిమ్ము పురుషోత్తమా….” అనే కీర్తనలో అన్నమయ్య “పొడగంటి పొడగంటి మిమ్ము పురుషోత్తమా” అంటారు వేంకటేశ్వరుని.
దైవం మన కంటికి కనిపించే విగ్రహరూపంలో, మంత్ర రూపంలో, యంత్ర రూపంలో ఉంటాడు. “ఓం నమో వెంకటేశాయా” సిద్ద మంత్రము.
కొండలలో నెలకొన్న కోనేటిరాయునిపై వేల కీర్తనా పుష్పాలతో కైంకర్యం చేశాడు అన్నమయ్య.
కేవలం వినటంకాదు చేయవలసినది. “దేవుని మీద 18 సెకండ్లు మన మనస్సు ఏకాగ్రంగా నిలబడితే, మనకు ముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు.
ఒక్క అన్నమయ్య కీర్తనను తాదాత్మ్యంగా వింటే ఎప్పుడో ఒకప్పుడు ఆ 18 సెకండ్లు యోగం లభిస్తుంది” అంటారు డా II తాడేపల్లి పతంజలి గారు.
అన్నమయ్య గారి జయంతి మే 9 , 1408. నేడు మే 9, అన్నమయ్య జన్మదినం.
అన్నమయ్య సంకీర్తనలను వీనులారా విందుము గాక – వినరో భాగ్యము విష్ణుకథ….
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రాజగురు …. మహనీయులు – 2020… మార్చి 8
- వాడే వీడు! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 2
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- రారా కృష్ణయ్య… .మహనీయులు – 2020… అక్టోబరు 9
- ఒక్కడూ రాడు!! … …. మహనీయులు – 2020… ఆగస్టు 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments