Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఆ దినం రంజాన్ పండుగ. చున్నీలాల్ హిందువు. అయినా ఆ రంజాన్ నెలంతా ప్రార్ధనలలో గడిపాడు.
పగలు ఉపవాసం ఉండి, రాత్రి మాత్రం పాలు తాగే వాడు. ఆయనకు ఈశ్వరుడొక్కడే, వివిధ మతాలన్నీ ఒకటే అని తెలుసు.
ఆయనకు సాయిబాబా గురువు. అప్పటికే సాయి మహాసమాధి చెంది 20 సంవత్సరాలు దాటింది.
ఈ సంఘటన జరిగిన సంవత్సరం 1938, నవంబరు నెల, 3వ తారీకు. చున్నీలాల్ అప్పుడే నమాజును ముగించి మసీదు బయటకు వచ్చాడు. సాయిబాబా సాక్షాత్కరించాడు. వెంటనే తన గురువు అయిన సాయిబాబాకు మొక్కాడు.
”ఇంటికి నగ్నంగా పో” అన్నాడు సాయి.
అది కరాచీ మహానగరము, పైగా ఆ దినం ముస్లింలకు పర్వ దినం. ఆ రోజున, ఆ మధ్యాహ్నపు సమయంలో నగ్నంగా ఇంటికి పొమ్మని సాయి ఆదేశం.
నగ్నంగా తిరిగినందులకే త్రిలింగస్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారు కటకాలపాలైనారు. ఇటువంటి విషయములను చున్నీలాల్ పరిగణించలేదు.
గురువు ఆదేశం ఇచ్చాడు. దానిని తల తెగినా పాటించాలి. అప్పుడే శిష్యుడవుతాడు.
ముందు వెనుకలు ఆలోచించకుండ బయలు దేరాడు దిగంబరంగా. ఆయనకు నడుస్తున్నట్లు స్పృహే లేదు. ఏదో ఆనందంలో నడుస్తున్నట్లు అనిపించింది.
కాస్త దూరమా! 7 మైళ్లు.
దారిలో ఎవరూ తనను ఆపినట్లు జ్ఞాపకం లేదు. ఎవరో ఒక పోలీసు ఆగమన్నాడు. పెద్ద స్వరంతో చున్నీలాల్ ”క్యా హై” అన్నాడు. ”కుచ్ నై” అన్నాడు పోలీసు.
”సాయిబాబా ఈద్ ముబారక్” అని ఆ పోలీసు చెప్పి వెళ్లిపోయాడు. రెండు గంటలు నడచి ఇల్లు చేరాడు. బట్టలేసుకున్నాడు.
సాయిబాబా అప్పుడు చున్నీలాల్‌కు 5 రూపాయలు ఇచ్చాడు. అది డబ్బు కాదు. ఆధ్యాత్మిక ధనం. సాయి సంతుష్టి చెందినట్లున్నాడు.
రామనవమినాడు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తానన్నాడు సాయి. సాయి 29 మార్చి, 1939న ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు.
చున్నీలాల్ పూజ్యశ్రీ మోటాబాబాగ పిలువబడ్డాడు. అయితే చున్నీలాల్‌కు గతంలో అనేకానేక గురువులతో పరిచయం ఉంది, కాని ఆధ్యాత్మిక పథంలో తుది మెట్టును ఎక్కించింది సాయిబాబానే, అదీ సాయి మహాసమాధి అనంతరం.
మోాటా మహరాజ్‌కు ఇష్టమైన నామస్మరణ చేద్దాం,
”హరి ఓం, హరి ఓం”.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి స్పీడ్ పోస్ట్…..సాయి@366 జూన్ 27…Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- సాయీ రమణీయం….. సాయి@366 మార్చి 3….Audio
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- చేజారని బహుమతి…..సాయి@366 నవంబర్ 12….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments