పదవి – సాధన . …. మహనీయులు – 2020… నవంబర్ 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బెంగాలీ బాబా ఆజ్ఞ ప్రకారం భోలే బాబా నర్మదా నాదీ తీరానికి బయలు దేరాడు. వైరాగ్యంతో ఉండాలని, కఠిన సాధన చేసి ఫలాలను సద్వినియోగం చేయలని సూచన ఇచ్చారు.

నర్మదా తీరాన్ని చేరే ప్రయత్నంలో ఆయనకు దుర్వాసుని దర్శనం లభించింది. నర్మదా తీరాన, పశ్చిమ భాగాన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకున్నాడు.

ఆ కుటీరానికి అతి సమీపంలో ఉన్న గ్రామం ఆరు మైళ్ల దూరంలో ఉంది.

ఆ సాధకుడైన భోలే బాబా వద్ద నీళ్ల కుండ, దుప్పటి, రెండు అంగ వస్త్రాలు తప్ప వేరేమీ లేవు. అక్కడ అయన ఆరు నెలలపాటు సుదీర్ఘ సాధన చేసిన కాలమిదే.

కుటీరాన్ని కట్టుకున్న తరువాత భోలే బాబాకు ఒక విషయం తెలిసింది.

ఉదయం, సాయంత్రం కూడా ఆ నర్మదా నదిలోని మొసళ్లు బయటకు – అంటే నదీ తీరానికి వచ్చి ఉండేవి.

ఈ సంగతి దగ్గరలో ఉన్న గ్రామ వాసులకు కూడా తెలుసు. ఆ సాధకుడు నిజమైన సత్యాన్వేషి అయితే, ఏ అపదా రాదని, కపటి అయితే వెంటనే అక్కడ నుండి జారుకుంటాడని ఆ గ్రామస్తుల అంచనా.

భోలే బాబాకు భయం కలగలేదు. ఇంకా తీవ్రంగా ఆలోచించాడు. మొసలి గంగా నది వాహనం, ఆ తల్లి కరుణను ప్రసాదిస్తుంది.

ఆ తల్లి దీవనలే శ్రీరామ రక్ష. అవి ఎట్టి హాని కలిగించవనే నమ్మకానికి వచ్చాడు.

మరొక సంఘటనలో కూడా భోలే బాబాకు మొసళ్లు తారస పడ్డాయి.

తన గురువు శిష్యులందరిని దగ్గరకు పిలిచాడు. “చూడండి, ఈ తుంగభద్రలో ఈదుకుంటూ ఆవలి తీరానికి చేరండి” అన్నాడు గురువు.

ఎవరూ ఆ నదిని ఈదటానికి సాహసించలేదు, ఎందుకంటే, తుంగభద్ర నిండా మొసళ్లు ఉన్నాయి.

ధైర్యం చేసి భోలే బాబా ఆ మొసళ్లు ఉన్న నదిని సునాయాసంగా దాట గలిగాడు – కారణం – గురువుపైన నమ్మకమే.

నర్మదా తీరంలో మొసళ్లు భోలే బాబా ధ్యానం చేసుకుంటుండగా అన్ని వైపులా ఉండేవి. చూచే వారికి ఆ దృశ్యం ఆశ్చర్యకరము, భయంకరంగానూ కూడా ఉండేది.

ఒకేసారి భోలే బాబా చుట్టూ ఉన్న మొసళ్లను ఎవరో ఫోటో తీసి పేపరును పంపారు.

ఆ దృశ్యం కరవీర పీఠంలో ఉన్న అప్పటి గురువు డాక్టర్ కుర్ట్ కోటి (Dr. Kunt Koti) దృష్టిలోపడి, తన తదనంతరం గురువుగా భోలే బాబాను నియమించి జగద్గురు శంకరాచార్య సదా శివ భారతి అనే నామకరణాన్ని ఇచ్చాడు.

కానీ, శిష్యుడు భోలే బాబా జగద్గురువైనా, ఆ పదవిని వదలి మరింత తీవ్ర తపశ్చర్యకు వెళ్లిపోయాడు. ఆయనే అనంతరం స్వామి రామాగా కీర్తి గడించారు.

“Living with Himalayan Masteres” అనే అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు.

నేడు నవంబరు 13. ఆయన జయంతి.

పదవి కన్నా సాధన మిన్న అనే స్వామి రామాను స్మరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles