తల్లివి నీవే! …. మహనీయులు – 2020… జూన్ 9



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబాను “సాయి మా”గా పూజిస్తారు. భగవంతున్ని భక్తుడు ఏ వరసతో పూజిస్తాడో, అలాగే కరుణిస్తాడు.

బాలానంద బ్రహ్మచారి పూర్వ నామం పీతాంబరు. ఈయన తండ్రి బన్సిలాల్. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని ఆలయంలో పూజారి. తల్లి పేరు నర్మదా దేవి.

పీతాంబరునకు ఉపనయనమైంది. ఆధ్యాత్మిక చింతనతో తొమ్మిది ఏండ్ల వయసులో దైవాన్వేషణ కోసం వెళ్ళిపోయాడు. తండ్రి గతించాడు. తల్లి కుమారుని కోసం బెంగ పడ్డది.

బరోడాకు దగ్గరలో నున్న గంగోనాథ్ కు చెందిన బ్రహ్మానంద మహారాజ్, ఆ కుర్రవానిని చూచి బాలానంద బ్రహ్మచారిగా దీక్షానామము ఇచ్చాడు.

ఆ బాలుడు ఖేరీఘాట్ చేరాడు. అది నర్మదా నదికి ఉత్తరాన ఉంది. ఆ నర్మదా మాతను చూడగానే ఏడ్వసాగాడు ఆ బాలుడు.

చుట్టుపక్కల ఉన్నవారు వింతగా చూచారు. ఎవరో ఒక ముదుసలి మహిళ వచ్చి ఏడ్పుకు కారణం అడిగింది.

“నాకు ఇల్లు, వాకిలి లేదు. నాకు ఏమీ అక్కరలేదు. నర్మదా మాత కావాలి” అని జవాబిచ్చాడు. ఆ మహిళ బుజ్జగించి వెళ్ళిపోయింది. ఆమె ఎవరో కాదు, నర్మదా మాతయే అంటారు బాలానందులు.

ఒకసారి బాలానందుడు పంచకౌరిపూరితో అరణ్యంలో నడకసాగిస్తున్నాడు.

అకస్మాత్తుగా ఒక బందిపోటు దొంగల గుంపు వారిని ఆపి వారివద్ద నున్న ప్రతి వస్తువును తీసుకుని వెళ్ళిపోయారు.

పంచకౌరిపూరికి ప్రతి దినం కొద్దిగా నల్లమందు తీసుకునే అలవాటుంది. ఆ నల్లమందున్న డబ్బాను కూడా దొంగలు ఎత్తుకుపోయారు.

నల్లమందు పడనిదే ఆయన నడవలేడు. ఆయనను తన భుజాన వేసుకుని ఆ అడవిలో నడకసాగించాడు.

అంత బరువును ఎంతసేపని మోయగలడు బాలానందుడు. ఎదురుగా ఏదో పొట్లం కనిపిస్తే తీశాడు బాలానందు. అది నల్లమందు.

అది  ఆ దినానికి మాత్రమే సరిపోయేంత దొరికింది. వెంటనే ఆ నల్లమందును పూరికి ఇచ్చాడు. ఆ రోజు చక చకా నడిచాడు పూరి.

మరునాడు కూడా బాలానందునకు ఆ దినానికి సరిపోయేటంత నల్లమందు పొట్లం దొరికింది. దానిని సేవించి నడకసాగించాడు పూరి.

ఇలా ఎన్ని దినాలు ఆ అడవి దాటటానికి నల్లమందు అవసరమో అన్ని దినాలు నల్లమందు పొట్లాలు దొరికేవి.

అడవి దాటిన తరువాత పట్నం వచ్చింది. నల్లమందు పొట్లం దొరకలేదు. ఈ పొట్లాలను నర్మదా మాత కాక ఎవరు ఆ అడవిలో ఇవ్వగలరు? అంటారు బాలానందులు.

ఇంకొకసారి అడవిలో దారితప్పాడు. దిక్కుతోచక దిగాలు పడ్డాడు.

ఇంతలో ఎవరో గొల్ల మహిళ నెత్తిన తట్టను పెట్టుకుని పోతుంటే, ఆమె వెనకనే పోయాడు. గ్రామానికి చేరాడు. ఆ గొల్ల వనిత నర్మదా దేవి.

కొడుకు కోసం 60 ఏండ్లుగా ఎదురు చూసిన బాలానందుల తల్లికి కుమారుని జాడ తెలిసింది. కుమారుని వద్దకు వెళ్ళింది. అంతిమ దినాల్లో కుమారుని వద్ద సంతోషంగా కన్ను మూసింది కన్నతల్లి నర్మదామాత.

నర్మదా పరిక్రమను 50 ఏండ్లు చేసిన బాలానందులు, జూన్ 9, 1937న దేహాన్ని విడిచాడు.

నేడు జూన్ 9, బాలానందుల సమాధిదినం. బాలానందులను, నర్మదామాతను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles