Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
డాక్టర్ విజయకుమార్, ఆయన భార్య సీత ఇరువురు సాయి భక్తులు. ఆయన కేరళలో మెడికల్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.
మరో డాక్టరు అయిన దేవకీ వాసుదేవ్, సీతగారిని పరీక్షించి గర్భిణి అని నిర్ణయించింది. ఇంకా సుమారు సెప్టెంబరు 15, 1979 ప్రాంతాలలో ప్రసవం అవుతుందని చెప్పింది.
విజయకుమార్ కుటుంబం జూలై 1979లో బెంగళారు వెళ్ళారు. అది వారి స్వస్థానం.
శ్రీమతి సీతా బెంగుళారులో సుప్రసిద్ధ సాయి భక్తులైన సాయి పాదానందను దర్శిద్దామనుకుని వెళ్ళింది. ఆయన ఆ సమయంలో అక్కడ లేరు. నిరుత్సాహంతో వెనుతిరిగింది.
మరునాడు విజయకుమార్ సాయి పాదానందను కలవటానికి వెళ్ళారు. సాయి పాదానందగారు అప్పటికి బెంగుళారు వచ్చారు.
సాయి పాదానందగారు విజయకుమార్‌ను చూసి ”అబ్బాయి, గాబరాపడకు, సాయి కటాక్షం నీ మీద ఉన్నది. అన్ని కష్టాలనుండి గట్టెక్కుతావు” అన్నారు.
ఇక వియజకుమార్ దంపతులు కేరళకు చేరారు. 25 ఆగస్టున సీత కడుపు నొప్పిగా ఉన్నదని భర్తకు చెప్పింది. ప్రసూతి తారీకు 15 సెప్టెంబరుగదా అని ఆయన అంతగా పట్టించుకోలేదు.
ఎందుకో సాయిబాబా పటం వైపు చూస్తే, వెంటనే ఆసుపత్రికి పొమ్మని సందేశం ఇచ్చినట్లయ్యింది. వెంటనే ఆ దంపతులు ఆసుపత్రికి చేరారు.
అక్కడి డాక్టరు పరీక్షించి ఇబ్బంది ఏమీ లేదన్నది. అయినా ఆమెను ఆసుపత్రిలోనే ఉంచారు. రాత్రి 9 గంటలైంది.
సీతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. డాక్టరు మరల పరీక్షించి పరిస్థితి చేజారి పోతోందని, సిజేరియన్ ఆపరేషన్ చేయాలని, అప్పటికైనా తల్లి, లేక బిడ్డ మాత్రం జీవించవచ్చు అని చెప్పింది.
డాక్టరు విజయకుమార్ కలత చెందాడు. అదీకాక, ఆ డాక్టరు ఎనస్తీషియా ఇచ్చే డాక్టరు ఏదో పనిమీద వెళ్ళిందని ఎప్పుడు వస్తుందో తెలియదని చెప్పింది.
డాక్టర్ విజయకుమార్ తాను ఎనస్తీషియా ఇవ్వగలనన్నాడు. అంతలోనే ఎనస్తీషియా ఇచ్చే డాక్టరు వచ్చింది. ఎదో శక్తి తిరిగి ఆసుపత్రికి వెళ్ళమని ఆదేశించటం వలన వచ్చానని తెలిపింది.
ఆమె ఎనస్తీషియా ఇచ్చింది. బయట కూర్చున్న డాక్టర్ విజయకుమార్‌కు డాక్టరు వచ్చి తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పింది. ఆ రోజు 26 ఆగస్టు వినాయకచవితి కూడా.
ఇలా ఉంటాయి సాయి లీలలు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తెలియగలేరే నీ లీలలు …..సాయి@366 డిసెంబర్ 2….Audio
- సింహపురిలో సాయికి భోజనం…..సాయి@366 సెప్టెంబర్ 27….Audio
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- నేనున్నాను…! …..సాయి@366 ఆగస్టు 23….Audio
- విద్యా ప్రదాత!…..సాయి@366 నవంబర్ 17…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments