Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. jeevani
సాయి సాహిత్యంలో నానా సాహెబ్ చందోర్కరుది ఒక ప్రత్యేకమైన పాత్ర. అనేక బోధలు, సూచనలు నానాను పాత్రధారిగా చేసుకుని సాయి అందరకూ తెల్పినాడు.
నానా సాహెబ్ చందోర్కరు శ్రీమంతుడు, ధార్మికుడు, ప్రజ్ఞావంతుడు. అతి చిన్న వయసులోనే ఉన్నత ప్రభుత్వ పదవులు పొందిన వ్యక్తి.
ఒకనాడు రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన రామచంద్ర దత్తా నరేంద్రుని రామకృష్ణ పరమహంసను దర్శింపుమని సలహా ఇచ్చాడు.
”నాకు తెలుసు ఆయనను గురించి వాకబు చేశాను. ఆయన విద్యా గంధం లేనివాడు.
స్పెన్సర్, హేమిల్టన్, లాకే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శి కాగలడు?” అని ఎదురు ప్రశ్న వేశాడు నరేంద్రుడు.
నానా సాహెబ్ విషయంలోను దాదాపు అదే, వేదాంతం నానాకు ఐచ్చిక విషయం. గీత, ప్రత్యేకించి శంకర భాష్యం ఆయనకు అభిమానం.
ఇంకా అత్యున్నత పదవిని అలంకరించిన నానాను అప్పా సాహెబ్ అనబడే ఒక గ్రామ కరణంతో తన దర్శనానికి రమ్మని నానాకు కబురు పంపాడు సాయి.
కుగ్రామంలో పాడుబడిన మసీదులోని ఫకీరు, డిప్యూటీ కలక్టరును తన వద్దకు పిలిపించుటయా? అని ఆ విషయాన్ని తీసిపారేశాడు నానా.
రామకృష్ణ పరమహంస నరేంద్రుని తన వద్దకు రమ్మని కబురు పెట్టలేదు కాని, స్వయంగా రామకృష్ణులే నరేంద్రుని ఆహ్వానించారు.
సాయి, రామకృష్ణుల సంఘటనలు మినహాయింపులా ఉంటాయి. ఎందుకంటే గురువులే శిష్యులను ఆహ్వానించటంలో. ఎలాగైతేనే గురువును కలిసారు. గురువే లోకం అయ్యింది వారిరువురికి.
షిరిడీలో సాయిని దర్శించే భక్తులకు మూడు వాడాలు నిర్మించబడనప్పుడు నానాయే సాయి సందర్శకుల కోసం డేరాలు వేయించి, భోజన వసతులు ఆయన స్వంత డబ్బుతో ఏర్పాటు చేసాడు.
కోపర్గాం నుండి భక్తులను తెప్పించేదుకు ఒక టాంగా, గుర్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. సాయి నానాను ఆధ్యాత్మికంగానే కాదు, లౌకికంగా కూడా కాపాడే వాడు.
పిచ్చుక కాలికి దారం కట్టినట్టు నా భక్తులను నేను రప్పించుకుంటానన్న సాయి మాటలకు నిజమైన ఉదాహరణ నానా.
సాయి వ్యాసుడనదగిన శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు నానా సేవా కార్యక్రమములను శ్లాఫిుస్తూ ఎంతో సవివరముగా సాయి భక్తులకు ”ది లైఫ్ ఆఫ్ సాయి బాబా” అనే గ్రంథములో పొందుపరిచారు.
నానా సాయిలో ఐక్యమయినది ఆగస్టు 21, 1922.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఔనా! నిజమేనా?…..సాయి@366 జూన్ 17….Audio
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
- దాహం! దాహం!!…..సాయి@366 మే 24….Audio
- అది మాత్రం అడగకూడదు …..సాయి@366 డిసెంబర్ 30….Audio
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments