నేను గురువుకి దగ్గరై ఆ ప్రేమని పొందితే నేను గురువుని వీడను



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !

బాబా నాకు శరత్ బాబూజీ గారిని గురువు గారిగా ఇద్దామనుకున్నట్టు నాకు అర్థమైంది.

నా అల్లరి భరించలేకనే నను వేరే వాళ్ళ దగ్గరికి పంపుతున్నావ్ కదా.నేను నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టానా,ఒకవేళ ఆలా పెట్టిన కూడా చిన్న పిల్లలే అని ఊరుకోకుండా ఆలా పంపించేద్దాం అనుకుంటున్నావా.నాకు తెలియదు నేను అటు సైడ్ వెళ్ళను.అనుకున్నాను.

రాత్రి కలలో మా నానమ్మ వాళ్ళ ఊరిలో ఒక ఇంటి గోడకు బాబా ది పెద్ద ఫోటో ఉంది.నేను బాబా ఫోటో చూసి హే బాబా ఫోటో ఇక్కడ ఉంది అని వెళ్లి బాబాకి నమస్కారం చేసుకుంటూ బాబా నాకు జాబ్ కావాలి. అది ,ఇది అన్నీ కోరికలు వరుసగా కోరుకుంటున్నా.

అప్పుడు ఒక వాయిస్ ఇప్పుడు నా బిడ్డ బాధ్యతలన్నీ మరొకరికి అప్పగించాను.ఇక నీ అన్నీ బాధ్యతలు తానేచూసుకుంటాడు.కొన్ని రోజుల తరువాత ఒకవేళ తన పట్ల నీకు సంతృప్తి కలగకపోతే అప్పుడు మళ్లీ,నేనే నీ బాధ్యతలు తీసుకుంటాను కానీ,అప్పటి వరకు నీ బాధ్యతలు తనవే.అని స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించింది.

అంత స్ట్రాంగ్ గా బాబా వాయిస్ వినగానే నేను ఏమి మాట్లాడకుండా ఉండిపోయా.ఉదయం అనిపించింది.సరే బాబా ఇంతగా చెపుతున్నాడు కదా.నేను బాబా ని ఇష్టపడుతూ తాను చెప్పింది వినకపోతే ఇక బాబాని ఇష్టపడినట్టు ఎలా అవుతుంది?అయినా బాబా చెప్పాడు కదా కొన్ని రోజుల తరువాత బాబూజీ గారు నచ్చకుంటే మళ్లీ నా బాధ్యత బాబానే తీసుకుంటారు అని.

సో కొన్ని రోజులు బాబూజీ గారిని గురువు అనుకుంటాను.తరువాత,బాబా తాను నాకు నచ్చలేదు మీ దగ్గరికే వస్తాను అని అంటాను.అప్పుడు బాబా ఎలాగూ చెప్పాడు కాబట్టి మళ్లీ నా బాధ్యత బాబానే తీసుకుంటారు అని అనుకున్నాను .

గురువు గారిని మనసులో శరత్ బాబూజీ గారు మీరు నేను ఇలా అనుకుంటున్నాను అని ఏమి అనుకోవద్దు నాకు మీరంటే ఇష్టం లేదు అని కాదు కానీ, నాకు బాబా అంటే ఇష్టం.మిమ్మల్ని గురువుగా అనుకోవడం నాకు ఇష్టం లేదు.బాబానే నాకు గురువు,దైవం అన్నీ .

ఆరోజు సత్సంగం తరువాత కలలో పాపం మీరు కూడా వాళ్లందరికీ చెప్పారు.తనే మొత్తం చేస్తుంది కదా తననే ఆరతి ఇవ్వనివ్వండి అని. కానీ అందరు మీరు ఇవ్వాలని అడిగితేనే మీరు ఆరతి ఇచ్చారు.సో మీకు కూడా నన్ను శిష్యు రాలిగా చేసుకోవడం ఇష్టం లేదు.

కానీ మీకు బాబా అంటే ఇష్టం,నాకు బాబా అంటే ఇష్టం.అందుకోసం మనం బాబా మాట వింటున్నాం అంతే,సో కొన్ని రోజుల తరువాత నేను బాబాకి మీరు అంటే ఇష్టం లేదని చెపుతాను.మీరుకూడా నేనంటే ఇష్టం లేదని చెప్పండి సరేనా. అప్పుడు మనం బాబా మాట విననట్టు కాదు కదా అని అనుకున్నా.ఇక ఇప్పటినుండి బాబా చెప్పినట్టు కొన్ని రోజుల వరకు మేరె నాకు గురువు అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు కొంచం హ్యాపీ గా అనిపించింది.

ఇక్కడ నేను,బాబా మీద ఇష్టం తో బాబా ప్రేమగా, ఇస్తున్న గురువుని నేను అజ్ఞానంగా వద్దు అనుకుంటున్నాను.కానీ బాబా కి, నాకు గురువుని ఇచ్చి అయన మార్గం లో నడిపించి నన్ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లాలని తాపత్రయ పడుతున్నారు.అది నాకు అర్ధం కాకా బాబా ఇచ్చే వరాన్ని తిరస్కరిస్తున్నా,కానీ బాబా కి నా మనసు తెలుసు,కాబట్టి నా మీద ప్రేమతో అన్నీ సార్లు వివరంగా చెప్పి చూసారు.

మెల్లి మెల్లి గా గురువు ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేసి లాస్ట్ కి నేను కొంచం స్ట్రాంగ్ గా చెప్పారు.అప్పటికి కూడా నా మనసుకి,బాధ కలగకుండా నాకు తగినట్టు చెప్పారు.కొన్ని రోజులు అక్కడ ఉండు నచ్చకుంటే మళ్లీ నా దగ్గరికే వద్డువులే అని.

ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళాక ఎవరికైన ఇక ఆ గురువే సర్వస్వం అనిపిస్తుంది.గురువుని వదిలి వద్దామనుకున్నా రాలేరు.ఆ విషయం బాబాకి బాగా తెలుసు కానీ,మొరాయిస్తున్న నన్ను గురువు వైపు నడిపించడానికి ఆలా ఆశ చూపించారు అంతే .

బాబాకి బాగా తెలుసు ఒకసారి నేను గురువుకి దగ్గరై ఆ ప్రేమని పొందితే నేను గురువుని వీడను అని అందుకే చిన్న పిల్లను బుజ్జగించి బడికి పంపిన తల్లిలాగే నన్ను గురువు వద్దకి పంపించారు.

ఇక్కడ బాబా నన్ను గురువుగారికి దగ్గర చేయడానికి చూపించిన శ్రద్ద,సహనం చూస్తుంటే గురువు గారు చెప్పింది గుర్తుకు వస్తుంది.బాబా మననుండి శ్రద్ధ, సబూరి అడుగుతారు కానీ,మనం ఇవ్వం.మనం ఇవ్వకుంటే ఆయనైనా ఇవ్వాలి కదా అందుకే ఆయన మనలో మార్పు కోసం శ్రద్దగా సహనంగా వెయిట్ చేస్తారు.ఏది ఏమైనా ,ఎప్పటికైనా తాను అనుకున్నది సాధిస్తారు .అది బాబా అంటే అని,నాకు నిజమే అనిపించింది.

బాబా కావాలంటే నన్ను మొదట్లోనే ఇతను నీ గురువు .తన దగ్గరికి వేళ్ళు,అని ఆర్డర్ లాగా వేయొచ్చు,నేను మొండికేస్తే కోప్పడవచ్చు కానీ బాబా ఎప్పుడూ ఆలా చేయలేదు.

తల్లికన్నా ఎక్కువ ఓపికతో నా మనసుకి తగ్గట్టు అనుభవాలు ఇస్తూ నాలో మార్పు తెస్తూ,చిన్న పిల్లలకి చోక్లెట్స్ ఆశ చూపించినట్టు,చూపిస్తూ నన్ను నా గురువు దగ్గరికి చేర్చడానికి ఎంతో కష్టపడ్డారు బాబా.ఆ ప్రేమని యెంత అని చెప్పగలం.ఆ ప్రేమని అనుభవించవలసిందే కానీ ఎన్ని మాటలు,ఎన్నో ఉపమానాలు,మరెన్నో భావాలూ కూడా దిగడుపే బాబా ప్రేమ ముందు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నేను గురువుకి దగ్గరై ఆ ప్రేమని పొందితే నేను గురువుని వీడను

సాయినాథుని ప్రణతి

All are very nice experiences.బాబా ,గురువుగార్ల ప్రేమలోని మాదుర్యాని మిరు ఆస్వాదించడమె కాకుండ మాకు share చేసి ఆ మాదుర్యాని మేము అనుభవించేలా చెస్తునారు .చాలా ఆనందంగా వుంది.

prathibha sainathuni

thank u pranathi garu..

Maruthi.Velaga

Chala happy ga vundi akka nea anubhavalu chaduvuthunte. Saibaba saibaba saibaba saibaba..

prathibha sainathuni

tnq sis…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles