Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (19)జ్యోతిష్య శాస్త్రం (2వ.భాగం)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నాసిక్ నివాసి మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడయిన సద్రాహ్మణుడు. షట్ శాస్త్రాలు అభ్యయసించాడు. జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి దిట్ట. ఒకసారి అతను బాపూ సాహెబ్ బుట్టీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చాడు. బాబాను దర్శించుకోగానే అత్యంత పరమానందాన్ని పొందాడు.
హస్త సాముద్రికంలో మంచి నైపుణ్యం ఉండటం వల్ల బాబా అర చేతిలోని రేఖలను పరీక్షిద్దామన్న ఉత్సాహం కలిగింది. శాస్త్రిబువా మూలేకు , బాబా పాదాలు చూసి అత్యంతాశ్చర్యం కలిగింది. బాబా చేతిలోని ధ్వజ, వజ్రాంకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది.
ఆ ఉత్సాహంతో మూలే కాస్త ముందుకు జరిగి “బాబా మీ హస్తాన్నివ్వండి. నాకు సాముద్రికం వచ్చు” అన్నాడు. కాని బాబా అతని మాటలను పట్టించుకోకుండా తన హస్తాన్నివ్వలేదు. మూలేశాస్త్రి చేతిలో నాలుగు అరటిపళ్ళు ఉంచారు. ఆవిధంగా చేయడంలో చేయి చూడటానికి తాము మానవ మాత్రులు కామని, నాలుగు పురుషార్ధాలు ప్రసాదించే దైవ స్వరుపాలమని బాబా తెలియజేసారు.
ఆవిధంగా బాబా జోశ్యాలు తప్పని, భవిష్యత్తును తెలుసుకోవడానికి జ్యోతిష్యాన్ని, సాముద్రికాన్ని నమ్ముకో వద్దని తన భక్తులకు తరచూ చెబుతూ ఉండేవారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే కష్టపడి శ్రమించమని చెప్పారు. విధి వ్రాతను తప్పించలేనపుడు వగచి ప్రయోజనం లేదని తన భక్తులను ఓదారుస్తూండేవారు.
కాకాసాహెబ్ దీక్షిత్ కూతురు చనిపోవడంతో అతను చాలా ఖిన్నుడయి ఉన్నాడు. ఆసమయంలో బాబా, భావార్ధ రామాయణం పుస్తకం తెరచి అందులో, వాలి చనిపోవడంతో వాలి భార్య తారను ఓదారుస్తూ శ్రీరామచంద్రమూర్తి అన్న మాటలను చూపించారు.
జి.పి. బెంద్రె పెద్దకొడుకు నాలుగు రోజులలో చనిపోతాడని చెప్పారు బాబా. బెంద్రె ను “ప్రశాంతంగా ఉండు. అధైర్యపడకు” అని ముందుగానే ఓదార్చారు.
గ్రహబలం గూడ గురుని అనుగ్రహ బలానికి లోకువే! ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, “ఏమిటీ, నీకు గండమున్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను” అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైందిగాని ఏమీ చేయలేదు.
టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహల దశ బాగాలేదని, కనుక పరీక్షలో క్రుతర్ధాడు కాలేడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ ిసంవత్సరం పరిక్షకే వెళ్లనని పట్టుబట్టారు. అతని తల్లి బాబాతో చెప్పుకున్నది. బాబా “నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు, జ్యోతిష్కులు చెప్పిన పలితాలు అవతల పారేసి బుద్ధిగా చాడువుకోమను. దైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పక పాసవుతాడు” అన్నారు. అతదలాగే చేసి, పరీక్షా పాసయ్యాడు.
అలానే దామోదర్ రాస్నేకు చాలాకాలం సంతానం కలుగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తిలేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగారు.
నా ఉద్దేశ్యం ప్రకారం సాయిభక్తులకి నేను చెప్పేదేమిటంటే గ్రహాలను శాంతి పరచడానికి సాయిబాబాను పూజిస్తే చాలు.
ముఖ్యమయిన పని ఏది ప్రారంభించాలన్నా గురువారమే మంచి శుభదినం. ఒకవేళ ఏకారణం చేతనయినా ఆరోజు ప్రారంభించలేకపోయినట్లయితే ఇంకొక రోజు ఎప్పుడయినా సరే పని ప్రారంభించే ముందు ఊదీని నొసట ధరించి, బాబాను స్మరించుకుని, ప్రార్ధన చేసి ప్రారంభిస్తే ఆపని దిగ్విజయంగా పూర్తవుతుంది.
ఒకవేళ మనం అనుకున్న ఫలితాలు రాకపోయినా, లేక విచారకరమయిన సంఘటనలు జరిగినా నిరాశ పడకుండా ప్రశాంతమయిన మనసుతో ఉండాలి. బాబా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అంతా బాబా నిర్ణయంమీదనే ఆధారపడి ఉందని, ఆయననే స్మరిస్తూ ఉండాలి. మనకేది ఎప్పుడు ఇవ్వాలో మనకేది శ్రేయస్కరమో అంతా బాబాకే తెలుసుననే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
“సాయికి చేసిన సేవ ఎన్నటికి వృధా కాదు. మన కోరికలు అవి ఐహికమయినవయినా, ఆధ్యాత్మికమయినవయినా సాయి నెరవేరుస్తారు. చివరికి మనలని కృతార్ధులను చేస్తారు.” (ఓ.వి. 15 అధ్యాయం – 45)
(రేపటి సంచికలో వేరు వేరు మతాలు)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (19)జ్యోతిష్య శాస్త్రం (1వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (12)సత్ప్రవర్తన (2వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (18)గురుభక్తి (2వ.భాగం)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (10)అహంకారం (2వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments