ప్రేమ …. మహనీయులు – 2020… జూలై 13



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి రామకృష్ణ పరమహంస తన పాదాలను శశిభూషణ చక్రవర్తిని తాకనీయకుండా వెనక్కు లాక్కున్నారు. సాయిబాబా కూడా అదేవిధంగా కాకా సాహెబ్ విషయంలో చేశారు.

శశిభూషణ, కాకా సాహెబ్ లు తమ గురువులు అట్లా చేయటానికి కారణం ఉంటుందని ఊహించుకున్నారు. ఆ శిష్యులు (భక్తులు) తమ లోటును దిద్దుకున్నారు.

శశిభూషణ మధ్యతరగతికి చెందిన వాడు. గురుదేవులకు మంచు ముక్కలు ఇష్టమని గ్రహించాడు.

ఒకరోజు అతడు ఒక పెద్ద మంచు ముక్కను కలకత్తాలో కొన్నాడు, కలకత్తాకు గురుదేవుల నివాసానికి 6  మైళ్ళ దూరం.

ఆరు మైళ్ళ దూరాన్ని, ఎండలో, కాలినడకన ఆ మంచుగడ్డను తీసుకుని బయలుదేరాడు. ఆ మంచుగడ్డకు కాగితం చుట్టాడు, చుట్టూర తువ్వాలు చుట్టాడు,

ఎంతో జాగ్రత్తతో బయలుదేరాడు, బహుశ పాదరక్షలు కూడా ధరించి ఉండదు. సూర్యుని వేడికి అతని శరీరం బొబ్బలెక్కింది. భారంగా నడక సాగించాడు.

అది అతనికి బాధ కలగలేదు, తాను చిరు కానుకగా, ఆ మంచు ముక్కను సమర్పిస్తున్నాననే ఆనందం ఉంది.

కానీ, ఆరు మైళ్ళ దూరం, ఎండలో సూర్యుని వేడికి మంచుముక్క నీరు కాకుండా ఉంటుందా? ఇక దక్షణేశ్వరంలో రామకృష్ణులు ఎండ వేడికి శరీరమంత కమిలిపోయి, మంటలెత్తుతోందని అక్కడున్న వారితో చెప్పారు.

శశిభూషణ్ వచ్చాడు మంచుగడ్డతో. ఆ మంచుగడ్డ కరగలేదు – నిజానికి కరిగి ఉండవలసింది. దానిని ప్రేమతో రామకృష్ణులకు సమర్పించాడు.

రామకృష్ణులు తన గదిలో ఉండి, ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నందుకు కారణం అందరకు తెలిసింది. ప్రేమ మంచును కరుగనీయదు!

ఒకసారి స్వామి రామకృష్ణానంద (శశిభూషణుడు) రామకృష్ణుని సేవలో ఉన్నాడు. ఒక పల్చని బట్టను మాత్రమే అతడు ధరించి ఉన్నాడు. అది చలికాలం. డిసెంబరు మాసం.

రామకృష్ణులు విసర్జనను చేసిన పాత్రను, ఆయన గది నుండి బయటకు తీసుకు వెళ్ళాడు రామకృష్ణనంద శుభ్రం చేసి తీసుకువద్దామని.

గది బయట ఎముకలు కొరికే చలి. రామకృష్ణానంద బయట ఆ చలిలో పాత్రను శుభ్రం చేస్తున్నాడు. రామకృష్ణుల వారికి శక్తి ఏమాత్రం లేదు.

మెల్లగా రామకృష్ణులు పాకుకుంటూపోయి, శాలువాను తీసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో, రామకృష్ణానంద లోపలి వచ్చాడు.

“అయ్యో, నేను రామకృష్ణ పరమహంసకు శాలువా కప్పటం మరచిపోయి పాత్రను శుభ్రం చేయటానికి పోయాను. ఎంత తప్పిదం జరిగింది” అని మనసులో అనుకున్నాడు శిష్యుడు.

శాలువా కావాలి అని పిలిస్తే నేను తెచ్చే వాడినిగదా!” అని రామకృష్ణ పరమహాసకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ అన్నాడు.

“బయట బాగా చలిగా ఉంది. నీ కోసమని దండెం మీదనుంచి శాలువాను తీశాను, కప్పుకో” అని రామకృష్ణులు శిష్యునికిచ్చారు ఆ శాలువాని.

అద్దమే కాదు ప్రతిబింబాన్ని చూపేది, స్వచ్ఛమైన ప్రేమ కూడా ప్రతిబింబిస్తుంది.

స్వామి రామకృష్ణానంద జూలై 13 (1863)న జన్మించారు. నేడు ఆయన జయంతి.

ఆయనకున్నటువంటి ప్రేమ మనకు కూడా కలుగుగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles