Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సకల దేవతల నవ్యాకృతి సాయిబాబా అంటారు.
గతంలో ఏతెంచిన మహా మత ప్రవక్తలందరి నూతన అభివ్యక్తీకరణగా శ్రీరామకృష్ణ పరమహంసను వర్ణిస్తారు.
సాయిబాబా సకల మతాలను సమంగా ఆదరించారు. రామకృష్ణులు వివిధ మత సిద్ధాంతాలను ఆచరించి, వాటి ఏకత్వాన్ని చాటారు. ఆధునిక కల్పతరువు రామకృష్ణులు.
కోరిన వారి శ్రేయోదాయకమైన కోర్కెలు తీరుస్తారు. ఆ కోర్కెలు ప్రాపంచికమైనవి కావచ్చును, ఆధ్యాత్మిక మైనవి కావచ్చును.
ఉపేంద్రనాథుడు “నాకు ధనం కావాలి” అని కోరాడు. అతడు ధనవంతుడై ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ సత్కార్యాలకు ధనం ఖర్చు చేసేవాడు.
హారన్ చంద్రదాస్ తన ఇష్టదైవ దర్శనం కోరగా, రామకృష్ణులు, అతని శిరస్సును స్పృశిస్తే ఆ దైవదర్శనం లభించింది అతనికి.
ఒకసారి దక్షిణేశ్వరంలో గోవిందుని విగ్రహం నేల మీద పడి ఆ విగ్రహపు కాలు విరిగిపోతే, విరిగిన విగ్రహం పూజకు అనర్హమని పండితులు చెప్పారు.
అప్పుడు రామకృష్ణులు “రాణి గారి అల్లుళ్లలో ఎవరైనా క్రిందపడి కాలు విరగగొట్టుకుంటే, అతడిని అలా వదిలేసి, అతడి స్థానంలో మరో వ్యక్తిని భర్తీ చేస్తారా? లేక సముచిత చికిత్సను చేయిస్తారా? అదే పద్దతి ఇక్కడ విరిగిన విగ్రహం విషయంలో అనుసరించాలి” అని సలహా ఇచ్చారు.
సాయి కూడా గురుస్థాన్ లో పూజలందుకుంటున్న పవిత్ర పాదుకలు పగిలిపోతే కొత్త పాదుకలు తెప్పించనక్కర లేదు. శాంతి చేస్తే చాలు అన్నారు. ఎవరు చెప్పినా భావం ఒక్కటే. అనంతుడు అఖండుడు అయిన భగవంతుడు పగిలిపోవటమేమిటి?
మనో వాక్కులను ఏకం చేయాలి అంటారు రామకృష్ణులు. బెల్లమును తినుట మానుమని రామకృష్ణులు ఒక వ్యక్తికి చెప్పవలసి నప్పుడు, తాను బెల్లమును తిను అలవాటును మానిన తరువాతనే చెప్పారు.
భగవంతుని పొందాలనే తీవ్రమైన కాంక్ష ఎల్లప్పుడూ ఉండాలి. దీనిని సాయి చెప్పిన శ్రద్ధ, సబూరిలతో పోల్చవచ్చును.
సర్వమూ భగవానుడే, సమస్తమూ భగవానునిదే. ఒకసారి దక్షిణేశ్వరంలోని ఆలయంలో దొంగతనం జరిగితే యజమాని బిస్వాస్ దేవుడిని “నీ వసమర్థుడవు, నీ అభరణాలను దొంగలు ఎత్తుకుపోతుంటే నీవు అడ్డుకోలేకపోయావు” అన్నారు.
“నీవు అర్పించే జగదీశ్వరుడికి ఈ (పోయిన) నగలన్నీ ఒక మట్టిపెడ్డ పాటి చెయ్యవు. సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి తన వైభవాన్ని ఆ జగదీశ్వరుడి వల్లే పొందుతోంది” అన్నారు రామకృష్ణులు.
మనకు తోచిన దానిని, మనము నిర్దారించరాదు. కఠిన పరీక్షలకు లోను చేయనిదే, ఎవరినీ శిష్యులుగా స్వీకరించేవారు కాదు అయన.
ఈశ్వర ఆదేశాన్ని పొందిన ఆ మహనీయుడిని ఆరాధించటం, అయన బోధనలు ధ్యానించటం ఆత్మ వికాసానికి సులభోపాయాలు.
మరణ సమయంలో కూడా రామకృష్ణులు దైవత్వాన్ని తెలుసుకోన గోరిన వివేకానందులతో “నరేన్! మునుపు ఎవరు రాముడు గాను, కృష్ణుడు గాను అవతరించారో, వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు. కానీ నీ వేదాంత భావన ప్రకారం కాదు” అన్నారు.
ఆంగ్ల కాలమాన ప్రకారం రామకృష్ణులు దేహాన్ని విడిచిన దినం ఆగస్టు 16, 1886. ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తెలుసుకో ఈ నిజం…. మహనీయులు – 2020… మే 25
- తీరిన కోరిక…. మహనీయులు – 2020… మార్చి 20
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- దర్శనం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 25
- తల్లికి తగిన బిడ్డ …. మహనీయులు – 2020 – జనవరి 30
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments