Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-42-1022-నా చరిత్ర తలదిండు కాదు 4:09
ఎ.ఎమ్.నరసింహప్రసాద్ డబ్బై సంవత్సరాల వృద్దుడు.
ఇప్పుడు ఆరోగ్యం గానే వున్నా 2006 సెప్టెంబరు నాటికి ఆయన జీవించి వుండే అవకాళాలు చాలా తక్కువగా వుండేవి.
నాస్తికుడైన ప్రసాద్ ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకూ త్రాగుతూనే వుండేవాడు.
ఆయన భార్య బాబా భక్తురాలు.
అప్పుడప్పుడూ ఆయన ఆమెని సాయిబాబా మందిరానికి కారులో తీసికుని వెళ్ళి, ఆమె దర్శనం చేసికుని తిరిగి వచ్చేవరకూ మందిరం బయట వేచి వుండేవాడు.
విపరీతమైన మత్తుగా వుంటూ వుండడం వలనా, స్పృహ కోల్పోతూ వున్నందువలనా అతనిని సెప్టెంబరు లో ఆసుపత్రికి తీసికుని వెళ్ళారు.
ఆసుపత్రిలో చేర్చుకుని పరీక్షలు చేయడం ప్రారంభించారు.
ఆ సమయానికి అతని పొట్ట పొంగిపోయి వుండేది, అతని లివర్ పూర్తిగా మధ్యపానం వలన పాడయిపోయింది.
డాక్టర్లు ఆయన కుటుంబ సభ్యులతో అతను రెండురోజులకు మించి బతకడనీ, ఇంటికి తీసికుని వెళ్లిపోవల్సిందనీ చెప్పారు.
ప్రస్తుత పరిస్థితులలో లివర్ మార్పిడి వలన కూడా ప్రయోజనముండదని చెప్పారు.
అతను కోమాలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితులలో ఆసుపత్రిలో వుంచి ఉపశమనానికి చికిత్స ప్రారంభించారు.
ఈ లోగా అతని స్నేహితుడు నాగేశ్ రెడ్డి అతనిని చూడడానికి వచ్చాడు, తనతో శ్రీ సాయి సఛ్ఛరిత్ర గ్రంధాన్ని తెచ్చాడు.
ప్రసాద్ ఆందోళన కర పరిస్థితి ని చూసి రెడ్ది శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధాన్ని అతని గుండేలపై నుంచి అతనిని రక్షించమని బాబా ని ప్రార్దించాడు.
పఠించే ఉద్దేశ్యం లేని ప్రసాద్ ఆ గ్రంధాన్ని తన తలగడ క్రింద పెట్టాడు, ఇంతలో అతను కోమాలోనికి వెళ్లాడు. చికిత్స కొనసాగుతోంది.
నలభై ఎనిమిది గంటల తర్వాత కళ్ళుతెరిచిన ప్రసాద్ బోజనం కోసం అడిగి, మళ్ళీ కోమాలోనికి వెళ్లాడు. అలాగ అరవై గంటలు గడిచిపోయాయి.
అప్పుడు బాబా ప్రత్యక్షమై ప్రసాద్ భుజం తట్టి లేపి తనతో రమ్మన్నారు.
తనతో పాటు బాత్ రూమ్ కి తీసికుని వెళ్ళి, అతను కాళ్లూ చేతులు కడక్కునేందుకు ఆదేశించారు.
తిరిగి అతని గదిలోనికి తోడ్కొని వచ్చారు.
అతనిని కుర్చీలో కూర్చుండబెట్టి అతని వెనకాల నిలబడి ’నా చరిత్ర నీకు చదివి అర్దం చేసికునేందుకు ఇవ్వబడింది అంతేకానీ తలదిండుక్రింద ఉపయోగించడానికి కాదు.
నేను నీకు నయం చేస్తాను. నీవు చాలా చేయాల్సి వుంది’ అని చెప్పి అదృశ్యమయ్యారు. ప్రసాద్ వెంటనే శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధాన్ని చదవడం మొదలుపెట్టారు.
ఉదయం ఆరుగంటయ్యేసరికి పూర్తి చేసాడు.
వైద్యులు ప్రసాద్ కూర్చుని పుస్తకం చదవడం చూసి ఆశ్చర్యపోయారు.
అతని రక్తపరీక్షలన్నీ మామూలుగానే వున్నాయనీ, అతను ఆరోగ్యవంతుడైనాడనీ చెప్పాల్సిన అవుసరం లేదు.
ఇప్పుడు నరసింహప్రసాద్ అన్నదానం చేస్తూ వుంటాడు, పేదలకు బట్టలు, కంబళీలు పంచుతూ వుంటాడు, బాబా బోధనలను పాటిస్తూ వుంటాడు.
పొగత్రాగడం కానీ, మధ్యపానం చేయడంఆనీ పూర్తిగా మానుకున్నాడు.
ఇప్పుడు నరసింహప్రసాద్ బాబా కి అకుంఠిత భక్తుడు.
శ్రీ డి.శంకరయ్యద్వారా వ్యక్తీకరణ:
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దర్శనం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 25
- నా చరిత్ర కోసం నా జీవితాన్నే పణంగా పెట్టాను–Audio
- బాబా మొదటి విరాళం ఇప్పించాడు. నా నమ్మకం వమ్ము కాలేదు!–Audio
- నా ఇంటిని బాబా గుడిగా మార్చి వేసాను
- ఎంత దయామయుడు బాబా. నా నొప్పి బాధ రెండు రోజులలో తగ్గిపోయాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నా చరిత్ర తలదిండు కాదు, చదివి అర్దం చేసికో–Audio”
kishore Babu
July 8, 2016 at 6:25 amఈ లీలా ద్వారా సాయి బాబా వారి సత్చరిత్ర కూడా, ఆపదలో ఉన్న భక్తులకి అభయం ఇస్తుందని మనం గ్రహించవచ్చు. మనం అందరం కూడా సాయి బాబా వారి సత్చరిత్రను ఎన్నిసార్లు చదివాము అని భావన లేకుండా, మనము ఎంత అర్థం చేసుకొన్నాము అని ప్రతినిమిషము గ్రహించాలి.