నా కోసం ఒక పనిని చేయగలవా?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

జోషికి బాబా దర్శనం చేసుకోవాలని ఎంతో కోరిక. కానీ అతను యెంత ప్రయత్నించిన తన ప్రణాళికలన్ని విఫలమై ఎంతో నిరాశ చెందాడు.  జోషికి కలతతో బాబాపై కోపం వచ్చింది. “నా స్నేహితులు, బంధువులు అందరూ షిర్డీకి వెళుతున్నారు, కాని నాకు ఎందుకు అవకాశం రావట్లేదు? బాబా! మీరు నిజంగా సత్పురుషులైతే నేను షిర్డీకి వెళ్ళకుండానే నాకు ప్రసాదం ఇవ్వండి” అని అనుకున్నాడు.

అదే సమయంలో షిర్డీలో కొంకణ్ నుండి వచ్చిన ఒక కుటుంబం బాబా యొక్క దర్శనం చేసుకున్న తరువాత ఇంటికి తిరిగి బయలుదేరుతున్నారు. బాబా ఆ వ్యక్తిని ‘నా కోసం ఒక పనిని చేయగలవా?’ అని అడిగారు. అందుకు ఆ భక్తుడు వెంటనే అంగీకరించాడు.

అప్పుడు బాబా “నీవు మెయిల్ లో ఇంటికి వెళ్లు, రైలులో నిన్ను కూర్చోవడానికి జానెడు స్థలం ఇవ్వమని అడిగిన వ్యక్తికీ ఈ ఊధి ప్యాకెట్ ను ఇవ్వు” అని అన్నారు. భక్తుడు బాబా యొక్క వింత అభ్యర్థనకు అంగీకరించి షిర్డీ నుండి బయలుదేరాడు.

అతను మరియు అతని కుటుంబం సౌకర్యవంతంగా రైలులో కూర్చున్నారు. వచ్చిన ప్రతి స్టేషన్ వద్ద భక్తుడు బాబా చెప్పిన ఆ వ్యక్తీ కోసం చూసాడు. కానీ అలాంటి వ్యక్తి అతన్ని సమీపించలేదు. చివరకు రైలు కళ్యాణ్ స్టేషన్ నుండి బయలుదేరింది అక్కడ కూడా అతనికి ఆ వ్యక్తీ జాడ కనిపించకపోవడంతో తనకు అటువంటి వ్యక్తీ కనపడలేదని బాబాకు రాస్తానని భక్తుడు అనుకున్నాడు.

అప్పుడు రైలు తానా స్టేషన్ వచ్చి ఆగింది. రైలు బయలుదేరితూ ఉండగా, చెమటతో తడిసి ముద్దైన ఒక వ్యక్తి పరుగెత్తుతూ తన కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. అతను ఆయాసపడుతూ “నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది దయచేసి మీ బిడ్డని కొంచం ప్రక్కకు నడిపి నాకు కోర్చోవడానికి జానెడు స్థలం ఇస్తారా?” అని అడిగాడు.

కొంకణ్ భక్తుడు తన బిడ్డను వెంటనే తన ఒడిలోకి తీసుకోని, అతనికి చోటు ఇచ్చి, బాబా ఇచ్చిన ఊది ప్యాకెట్ కూడా సంతోషముగా అప్పగిస్తూ బాబా యొక్క వింతైన విన్నపాన్ని గురించి చెప్పాడు.

జోషి ఆనందభాష్పాలు కారుస్తూ, గౌరవంతో ఊధి ప్యాకెట్ అందుకొని తాను ఎంతగా యత్నించిన షిర్డీ దర్శించలేకపోయనని బాబాయే తనకు ప్రసాదం పంపాలని ప్రార్ధించనని సంతోషంగా చెప్పాడు. అప్పుడు కొంకణ్ భక్తునికి బాబా వింత కోరిక వెనుక అసలు రహస్యం అర్ధం అయ్యింది.

జోషి కోపంతో ఉన్న పిల్లలపై కూడా బాబా యొక్క కరుణ గురించి ఆలోచించి, కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles