సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 5వ.భాగమ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి భక్తులు – శ్రీ బొండాడ జనార్ధనరావు – 5వ.భాగమ్

తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు

ఆమె బాబా ఫోటో ముందు నిలబడి బాబాని ప్రార్ధించింది.  ఆసమయంలో మురళీకృష్ణ జయనగర్ లో తన కారులో ఉన్నాడు. తల్లి అక్కడ ఇంటిలో ప్రార్ధించుకున్న వెంటనే ఇక్కడ ఇతని కారు దగ్గరకి ఒక వృధ్ధుడు నిలబడి కారు అద్దంమీద టకటకమని కొట్టాడు. అతను ఒక ఫకీరులాగ ఉన్నాడు.  అతను అచ్చం బాబా వేషధారణలో ఉన్నాడు.

అతను ధర్మం అడుగుతున్నాడేమోనని మురళీకృష్ణ అతనికి పదిరూపాయలు ధర్మం చేశాడు.  కాని ఆ ఫకీరు అతనిచ్చిన పదిరూపాయలను తిరిగి అతనికి ఇచ్చివేయడమే కాక దానితోపాటుగా ఒక వందరూపాయల నోటు కూడా ఇచ్చాడు.  (పది రూపాయలకు పదిరెట్లు)ఆతరువాత ఆఫకీరు ఒకవైపు లక్ష్మీనారయణులవారు, మరొకవైపు వినాయకుని చిత్రాలు ఉన్న వెండినాణాన్ని ఇచ్చాడు.

దానితోపాటు అరుదయిన చిన్న బాబా ఫొటోకూడా ఇచ్చాడు.  అది ఇస్తూ, “నువ్వు నీతల్లిదండ్రులు చెప్పిన సలహా ప్రకారం నడుచుకో. నీవ్యాపారం బాగా అభివృధ్ధి చెందుతుంది.  నీకు, నీకుటుంబానికి అంతా మంచే జరుగుతుంది” అన్నాడు.  అదే క్షణంలో పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోవడం అతనిలో ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆ ఫకీరుకు తన విషయాలన్నీ ఎలా తెలుసు, ఆరోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు.  ఫకీరు రూపంలో వచ్చినది బాబా తప్ప మరెవరూ కాదని అర్ధం చేసుకున్నాడు.  ఆఫకీరు ఎక్కడయినా కనిపిస్తాడేమోనని చూశాడు.  కాని అతను ఎక్కడా కనిపించలేదు.

మురళీకృష్ణ తనకు బాబా ఇచ్చిన 100/- రూపలయల నోటుని లామినేషన్ చేయించాడు.  బాబా ప్రసాదించిన అరుదయిన ఫోటోను, వెండి నాణాలతో సహా వందరూపాయల నోటును కూడా తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. జూన్ 28న అతను భార్యతోను, కుటుంబ సభ్యులతోను బాబా మందిరంలో ధునిపూజకు వెళ్ళాడు.  బాబా తన భక్తుల మొఱను ఆలకించి వెంటనే స్పందిస్తారనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

మొత్తం 62 మంది సాయిభక్తులను గురించి సమగ్ర సమాచారమంతా ఆయన సేకరించారు.  వాటినన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరాలనే ఉద్దేశ్యంతో ఇంటర్ నెట్ లో పెట్టారు.  ఇంత వరకు ప్రపంచంలోని దేశదేశాలలోని వారు దాదాపు 2,41,000 మందికి పైగా ఈ వ్యాసాల ద్వారా ఆనాటి సాయిభక్తుల గురించి తెలుసుకున్నారు. రోజురోజుకు చదివేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పాఠకుల సంఖ్య 300 కుపైగా ఉన్నదంటే అతిశయోక్తికాదు.

ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం ప్రపంచంలోని నలుదిక్కులా ఉన్న,  ఆఖరికి చిన్నచిన్న దేశాలలోని ప్రజలకు కూడా ఈ సాయితత్వం చేరువలోకి వచ్చింది.  అటువంటి దేశాలలో క్యూబా (హవానా) తైవాన్,  లిథుయానియ, బెనిన్ , రువాండాలు ఉన్నాయి.  సెంట్.మార్టిన్ అతి చిన్న దీవి.  సౌత్ ఈస్టర్న్ కరేబియన్ సీ లో ప్రపంచంలోనె అతి చిన్న దీవి  ఆఖరికి అక్కడి ప్రజలలో కూడా సాయితత్వం గురించి చదివేవారున్నారు. 

ఆదీవిలో మొత్తం జనాభా 38,000.  కురేసౌ (curacao) దక్షిణ కరేబియన్ సీ లో మరొక చిన్న దీవి.  అందులో జనాభా కూడా చాలా తక్కువ.  అక్కడి వారు కూడా సాయిభక్తులను గురించిన వ్యాసాలు చదువుతూ ఉంటారు.  పైన ఉదహరించినవాటి వల్ల బాబా ప్రత్యక్ష దైవమని అన్ని దేశాలలోని ప్రజలు భావిస్తారనే విషయాన్ని మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు.

మరొక అతి చిన్న పగడపుదీవిలో కూడా బాబా ఉనికిని మనం అక్కడ జరిగిన సంఘటన ద్వారా గ్రహించవచ్చు.  దక్షిణ పసిఫిక్ సముద్రంలో ’న్యూయే’ అతి చిన్న దీవి.  (ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ మధ్య ఉన్న దీవి).  ఆదీవిలో అక్కడి ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 2015 జూలై 31 శుక్రవారము గురుపూర్ణిమ రోజున ఒక వెండి కరెన్సీ నాణాన్ని విడుదల చేసింది.  సాయిబాబా చిత్రంతో ఒక వెండి కరెన్సీ నాణాన్ని అధికారికంగా విడుదల చేయడం అదే మొదటిసారి.

31.1 గ్రాముల బరువుతో స్వచ్చమైన వెండితో తయారు చేయబడ్డ నాణెం.  దానిని స్విడ్జర్ లాండ్ లోని హెల్వెటిక్ మింట్ లో స్విస్ హాల్ మార్క్ తో ముద్రించారు.  ఈ విషయాన్ని కలకత్తాలోని సేవక్ హాబీ సంస్థ తెలిపింది.  నాణానికి ఒకవైపున రంగులతో  బాబా కూర్చున్న చిత్రం, రెండవవైపున రెండవ ఎలిజబెత్ రాణి  చిత్రాలను ముద్రించారు.

‘న్యూయే” ఒక పగడాల దీవి.    ఈ నాణాన్ని విక్రయించే హక్కుల్ని అలోక్ గోయల్ అనే వ్యక్తి సంపాదించాడు. Coins-n-coins.com  ద్వారా ఆర్డర్ తీసుకునే ఏర్పాటు చేశారు.  సేవక్ హాబీ సంస్థకు ఈ నాణానికి చెందిన హక్కులు కల్పించారు.  కాని ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి 501 నాణాలను మాత్రమే ముద్రించారు.

 (దీనికి సంబంధించిన యూ ట్యూబ్ లింక్ ఇస్తున్నాను చూడండి)

https://www.youtube.com/watch?v=OqI9hp-omio

https://www.youtube.com/watch?v=8hDU3s2TptM

న్యూజిలాండ్ కి ఈశాన్య దిశలో 1500 మైళ్ళ దూరంలో ఉంది.  దీని జనాభా నవంబరు 2016 నాటికి 1612.

(సమాప్తం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles