Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు సాయితో సాయి.బా.ని.స. అనుభవాలలో అయిదవ అనుభవాన్ని తెలుసుకుందాము.
బాబా అహంకారాన్ని తొలగించుట
హేమాద్రిపంత్ (అన్నా సాహెబ్ ధబోల్కర్) శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికి యోచించినప్పుడు, శ్రీ సాయి తన అంకిత భక్తుడైన శ్యామాతో (మాధవరావ్దేష్పాండే) “హేమాద్రిపంత్ తన అహంకారాన్ని విడిచి నాపాదాలను ఆశ్రయింపుమని చెప్పు, నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు” అన్నారు.
శ్రీ సాయి యెల్లప్పుడు తన భక్తుల మదిలోఅహంకారం కలగకుండా చూస్తూ వారు ఆధ్యాత్మికంగా యెదగడానికి సహాయం చేస్తూ ఉండేవారు.
ఈ నా అనుభవాల క్రమములో అయిదవ అనుభవం లో శ్రీ సాయి నా అహంకారాన్నితొలగించిన విధానాన్ని తెలియ చేస్తాను.
అది డిసెంబరు 1990, శీతాకాలం ఉదయపు వేళ సికందరాబాదు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ గణేష్ మందిరంలో పూజ చేయించుకుని బయటకి వచ్చాను. దక్షిణ భారత సాంప్రదాయపు దుస్తులలో ఉన్న మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి చిరునవ్వుతో నా నుండి ఒక రూపాయి దక్షిణ కోరినారు.
ఆ విలక్ష్ణమైన చిరునవ్వు మా యింటిలో ఉన్న శ్రీసాయిఫొటోని జ్ఞప్తికి తెచ్చింది. సహజంగానేను సాయే వచ్చి దక్షిణ అడుగుతున్నారని భావించి.
ఆయనకు ఒక రూపాయి ఇచ్చినాను. ఆ పెద్ద మనిషికి ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన తరువాత దగ్గరలో ఉన్న శ్రీ పాండురంగ విఠల్ మందిరం వైపు నడవసాగాను.
ఆ మార్గంలో శ్రీ గోకుల్ లాడ్గ్ దగ్గరికి వచ్చేసరికి నాలో ఒక ఆలోచన వచ్చింది. నేను గెజిటెడ్ఆ ఫీసరుని శ్రీ సాయి యెప్పుడు నా నుండి ఒక రూపాయి మాత్రమే దక్షిణగాయెందుకడుగుతారు.
కనీసం రెండు రూపాయలు దక్షిణ ఇచ్చే స్థోమత నాకు ఉంది కదా, మరి బాబా ఒక రూపాయి మాత్రమే అడగడము నా తప్పిదము కాదు.
ఇటువంటి ఆలోచనతో నడుస్తుండగా శ్రీ గోకుల్ లాడ్గ్ మెట్ల మీద కూర్చుని ఉన్న ఒక ఫకీరు, నన్ను గట్టిగా పిలవ సాగినాడు.నేను అసంకల్పితంగా వారి వద్దకు వెళ్ళాను.
వారు నన్ను చూసి, నీవొక పెద్ద ఆఫీసరువి నేను బీదవాడినైన సాయిబాబాను. నేను అడి గినంత ధనమునువ్వివగలవా? నువ్వు నన్ను బిచ్చగాడిననుకుంటున్నావా? నీలోఅహంకారముయెక్కువయింది.
ఖబడ్దార్ అని నన్ను తిడుతుంటే నేను శిలావిగ్రహంలా నిలబడి తిట్లని వినసాగాను. నేను చేసిన పొరపాటును గ్రహించాను. నా మనసులోని ఆలోచనలను ఈ ఫకీరు ఎలా పసిగట్టగలిగినారు.
సాక్షాత్తూ సాయిబాబాయే ఈ ఫకీరు రూ పంలో వచ్చి నాలోని అహంకారాన్ని తొలగించి నన్ను సక్రమ మార్గంలో పెట్టారని భావించాను. ఇక పరిసరాలను కూడా పట్టించుకోకుండా ఆ ఫకీరు పాదాలకు నమస్కరించి వారి చేతిలో రెండు రూపాయల నోటును ఉంచి వారి ఆశీర్వచనాలు తీసుకుని శ్రీ పాండురంగ విఠల్ గుడికి బయలుదేరి వెళ్ళాను. పాండురంగ విఠల్ గుడికి వెడుతూ వెనక్కి తిరిగి చూశాను.
ఆ చుట్టు పక్కల ప్రాంతంలో ఆ ఫకీరెక్కడా కనపడలేదు. శ్రీ సాయి తాను సర్వాంతర్యామినని చెప్పడానికి మరియు నా లోని అహంకారాన్నితొలగించడానికి ఆ ఫకీరు రూపంలో దర్శనమిచ్చారని భావించాను.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా ఆనందానికి అవధులు లేవు–Gopal Rao–17–Audio
- లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది-Gopal Rao –13–Audio
- నా నుండి పదిరూపాయలు దక్షిణ కోరుతున్నారని భావించాను–Gopal Rao–15–Audio
- నా తరఫున మీరు శ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి– Sree Gopal Rao — 9–Audio
- పల్లె విడిచి బయటకు పోవలదు–Gopal Rao-8–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు–Gopal Rao– 5–Audio”
kishore Babu
August 30, 2016 at 8:05 pmThank you so much Sai Suresh..