Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 8
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు సాయి బా.ని.స. అనుభవాలలో 8 వ.అనుభవాన్ని తెలుసుకుందాము.
సాయితో సాయి.బా.ని.స. అనుభవాలు – 8
శ్రీ షిరిడీ సాయి సశరీరంతో షిరిడీలో ఉన్న రోజులలో బాబా గారి అనుమతితో షిరిడీ ప్రజలు బయట గ్రామాలకు వెళ్ళేవారు మరియు వారిని దర్శించుకోవడానికి వచ్చిన వారు వారి అనుమతి ఆశీర్వచనాలనూ తీసుకున్నతరవాతనే తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్ళేవారు. అది ఒక నియమంలా ఉండేది.
ఈ పధ్ధతిని పాటించిన వారంతా యెటువంటి కష్టాలూ లేకుండా తమ యాత్రలను పూర్తి చేసుకునేవారు.
శ్రీ సాయి ఆదేశాలను పాటించనివారు అనేక కష్టాలను యెదుర్కోవలసి వచ్చేది.
ఈ విషయాలన్ని శ్రీసాయి సచ్చరిత్రలో విపులీకరంగా చెప్పబడింది. 1992 లో బాబాగారి ఆదేశానికి వ్యతిరేకముగా నేను కొనసాగించిన ప్రయాణము వివరాలు మీకుతెలియపర్చదలచుకున్నాను.
అది 1992 వ సంవత్సరము ఏప్రిల్ నెల. నాభార్య బలవంతము వలన నంద్యాల పట్టణములో ఉన్న నాకు కాబోయే అల్లుడి గురించిన వివరాలు సేకరించడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.
అప్పటికే వివాహము నిశ్చయము అవడం వల్ల అలా చేయడం భావ్యం కాదనుకున్నాను. కాని నాభార్య వెళ్ళి తీరవలసిందే అని పట్టు పట్టింది.
ఈ సందిగ్ధావస్తలో నాకు సలహాను ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించి కళ్ళుమూసుకుని శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక పేజీ తెరిచాను. అది 9వ అధ్యాయములో 84 వ పేజీ. అందులోని సందేశము “పల్లె విడిచి బయటకు పోవలదు“.
ఈ సందేశము ద్వారా బాబా నన్ను నంద్యాల పట్టణానికి వెళ్ళవద్దని ఆదేశించుచున్నారని గ్రహించాను. కాని నా భార్య బలవంతం మీద నాకాబోయే అల్లుడి వివరాలు తెలుసుకొనుటకు రాత్రినంద్యాల పట్టణమునకు బయలుదేరాను.
మరుసటి ఉదయము నాడు(మహాశివరాత్రి పర్వదినము ) నా అల్లుడు గారి యింటికి వెళ్ళాను.
ముందుగా తెలియపరచకుండా హటాత్తుగా వారి యింటికి చేరుకోవటము వారికి కొంచెం ఇబ్బంది కలిగించింది.
నేను మహానందిలో మహాశివరాత్రి పుణ్యదినమున పూజలు చేయించడానికి మహానందికి వెడుతూ అతనిని చూడటానికి వచ్చినానని అబధ్ధము చెప్పినాను.
ఆయన ఆరోజున తన స్నేహితులతో కలిసి అహోబిలం వెళ్ళడానికి నిశ్చయించుకుని నన్ను కూడా వారితో కలిసి రమ్మని చెప్పినారు.
నేను వారి ఆహ్వానానికి అంగీకరించి వారితోను వారి స్నేహితులతోను కలిసి అహోబిలము చేరుకున్నాను.
అహోబిలములో శ్రీ నరసింహస్వామికి పూజలు పూర్తి చేసుకుని మధ్యాహ్న్నము 12 గంటల తరువాత బస్సు స్టాండ్ కు వచ్చినాము.సాయంత్రము 4 గంటల వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు లేవని తెలుసుకుని అందరమూ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కాలినడకన బయలుదేరాము.
ఆ మండు టెండలో నేను నడవలేక పోవుచున్నాను. బాగా అలసి పోయి నిస్సత్తువగా ఉన్నాను.
తాగడానికి మంచి నీరు లేదు. సేద తీర్చుకుందుకూ ఏ చెట్లకు ఆకులు లేక నీడ కూడా లేదు.
ఆ మార్గము గుండా పోవుతున్న చిన్న వాహనముల వారు ఎవ్వరూ మాకు సహాయము చేయడానికి తమ వాహనాలను ఆపలేదు. నాకు కాబోయే అల్లుడు అతని మిత్రులు వడివడిగా ముందుకు నడవసాగారు.
నేను ఆ మండుటెండలోనడవలేక రోడ్డుకు అడ్డముగా నిలబడి శ్రీసాయి నామమును జపింప సాగినాను. నా అదృష్టము వశాత్తు ఒక లారీ నా ముందు ఆగినది. నేను కనులు తెరిచి ఆలారీ వైపు చూసినాను.
ఆ లారీపై శ్రీ షిరిడీ సాయినాధుల వారి అభయ హస్తముతో ఉన్నపటము మరియు శ్రీ షిరిడీ సాయి లారీ సర్వీసు అనే అక్షరములు చూసి తన్మయత్వములో కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయినాను.
నా కాబోయే అల్లుడు వారి మిత్రులు ఆ లారీ డ్రైవరు అందరూ కలిసి నన్ను ఆ లారీలో పరుండబెట్టినారు. ఆ లారీ డ్రైవరు మమ్ములని దగ్గరలో ఉన్న గ్రామములో చేర్చినాడు.
ఆ లారీ డ్రైవరు నన్ను దగ్గిరలో ఉన్న హోటలుకు తీసుకుని వెళ్ళి తాగడానికి ఒకసోడా కొని పెట్టి తన చేతి సంచీ నుండి ఒక గజ నిమ్మపండు ఇచ్చి నా చేత నిమ్మరసము తాగించాడు.
ఆ లారీడ్రైవరుమమ్మలని అక్కడ వదలిపెట్టి వెడుతూ అన్నమాటలు ” ఇక మీదట నీగురువు మాటలను పెడచెవిని పెట్టి యిటువంటి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.”
ఈ మాటలకు నేను నిశ్చేష్టుడినయ్యాను. సాక్షాత్తూ శ్రీసాయినాధుల వారే ఈ లారీ డ్రైవరు రూపములో వచ్చి నన్ను కాపాడినారని తలచి వారికి నా రెండు చేతులతో నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేసుకున్నాను.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా ఆనందానికి అవధులు లేవు–Gopal Rao–17–Audio
- నేనే నా సచ్చరిత్ర రాస్తానని చెప్పు–Gopal Rao– 5–Audio
- శ్రీ సాయి నన్ను బాధ్యతలను నిర్వర్తించే సన్యాసీ అని పిలిచినారు-Sree Gopal Rao–21–Audio
- ఒక పట్టు ధోవతీని బహూకరించమని ఆదేశించారు–Gopal Rao–14–Audio
- పారాయణ చేసిన ఫలముగా భావించినాను.–Sree Gopal Rao–22–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments